Month: December 2019

ఆడది – పుస్తక సమీక్ష

కథా భారతి
*ఉన్నతమైన కధలతో ''ఆడది''* కథ దిన దిన ప్రవర్ధమానమై నిత్యం మన ముందు ఎప్పటికప్పుడు తాజాగా కనిపిస్తూనే ఉంది.. అంటే 1910 లో ప్రారంభమైన కథలకు ఇప్పుడు వస్తున్న కధలకు వస్తువులు ఒకటే. రచించే విధానం లో, ఎత్తుగడలో, ముగింపులో మాత్రం తేడా కనిపిస్తుంది. మనిషి జీవితం లో సమస్యలు మారలేదు. ఆలోచించే విధానం లో మార్పు లేదు. మనం నిత్యం చేసే తప్పుల్ని సరిదిద్దుకోవాలనే తపన లేదు. మనం ఒక తప్పు చేస్తే ఆ ప్రభావం పది తరాల వరకు వినిపిస్తూనే ఉంటుంది. అదే ఒక ఒప్పు చేస్తే ఆ ప్రభావం శాశ్వతంగా నిలిచిపోతుంది అనే ధ్యాస లేదు. అంటే ఆకలి వేసిందంటే ఎదురుగా ఏది ఉంటె అది తినేయడమే. ఇంతకు ముందే తిన్నాము కదా ఇప్పుడు తింటే ఏమవుతుంది అనే ఆలోచనే ఉండదు. అలాగే మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడమే. ఏది అనిపిస్తే అది మాట్లాడేయడమే. ఈ మాటల వాళ్ళ ఎదుటి వారి మనసు ఎంత బాధ పడుతుంది అనే చింతనే ఉండదు. ఒక మాట అయినా, ఏదైనా ఒక చేత అయినా ఏదైనా మనమున్న స్థా

భక్తి-ముక్తి

సారస్వతం
-​శారదాప్రసాద్  ​​ఈ నాడు తెలుగుదేశంలో భక్తి విపరీతంగా ప్రవహిస్తుంది.ఎన్నో భక్తి చానళ్ళు ,ఎందరో ప్రవచనకారులు, స్వాములు, పీఠాధిపతులు భక్తిని గురించి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కొంతమంది స్వాములకు, మహర్షులకు(?) ఏకంగా స్వంత చానళ్ళు ​కూడా ఉన్నాయి ​.​అందరి ప్రవచనాలు ​వినటానికి జనం కూడా విపరీతంగా వెళ్ళుతున్నారు. ఒకవైపు భక్తి విపరీతంగా పెరుగుతున్నా మరొకవైపు అశాంతి, ​అవినీతి ,​అన్యాయం ​దానికి రెట్టింపుగా ​పెరుగుతున్నాయ​నది కూడా వాస్తవమే. ఈ మధ్య ఒక రాజకీయనాయకుడు మాట్లాడుతూ ,దేవాలయాల ఆదాయం పెరగటానికి భక్తులు ఎక్కువగా చేస్తున్న పాపాలు కూడా కారణం అన్నారు.అది కొంతవరకు వాస్తవం కూడా కావచ్చు.ఆయన అవి స్వానుభవం వలన చెప్పిన మాటలు కూడా కావచ్చు!ఎందుకంటే ,సదరు నాయకుడు ఆ మధ్యనే ఆయన మనవడి జన్మదినం సందర్భంగా అధికంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చాడు.నిజమైన భక్తుడు భక్తికొలది ఏదో ఒకటి ముడు

ఇలా చేసి చూడు

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి వాదాన్ని వదిలేసి చూడు వేదం నీ వెంటే ఉంటుంది. కామాన్ని విడిచిపెట్టి చూడు రామం నీ జంటే ఉంటుంది. లోభాన్ని వదిలిపెట్టి చూడు లాభం నీఇంటే ఉంటుంది. క్రోధం వదిలిపెట్టి చూడు. నాదం నీలోనే నెలకొంటుంది. మదాన్ని విడిచిపెట్టి చూడు మోదం నీ మదిలోనే కొలువుంటుంది మాత్సర్యాని వదిలిపెట్టి చూడు తాత్సారం చేయకుండా మమకారం నీదవుతుంది. మోహాన్ని మొట్టు మొట్టి చూడు మాయా దాహం నిన్నోదిలి పోతుంది. రోషాన్ని వదిలి పెట్టి చూడు రోగం నీ దరికి చేరకుంటుంది. కక్షనొదిలిపెట్టి చూడు రక్ష నీన్నొదిలి పోనంటుంది. అబద్ధాల నోదిలిపెట్టి చూడు విశుద్ధం నీ వెంటే ఉంటుంది.

పాపం మనిషి!

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు నింగిని కొలుస్తాడు నేలని తొలుస్తాడు మనసునిమలచలేడు. గ్రహాన్ని చేరుతాడు నక్షత్రాన్ని కోరుతాడు అనుగ్రహాన్నిపొందలేడు. తెలివితో బొంకుతాడు, తేటగా ఉండలేడు. ఆశకు లొంగుతాడు, ఆశయానికి కట్టుబడలేడు. మహిని జయిస్తాడు, మనసును జయించలేడు. గ్రహంలో ఏముందో తెలుసుకుంటాడు, గృహంలో ఏముందో తెలియలేడు. నక్షత్రాన్ని తెలియాలనుకుంటాడు, స్వక్షేత్రాన్ని తెలుసుకోలేడు. చందమామ అందాన్ని పొగుడుతాడు, సొంత భామ అనుబంధాని పొందలేడు. ప్రకృతి ని జయించాలని అనుకుంటాడు, తన ప్రవృత్తిని జయించాలనుకోడు. పై పైకి వెళ్ళాలనుకుంటాడు, లోలోకి పోవాలనుకోడు.

Book Review in January 2020

శీర్షికలు
*పరిమళాల వసంతం* ~ వెన్నెల సత్యం షాద్‌నగర్ యువకవి కుడికాల వంశీధర్ “సరోజనార్ధన్” పేరుతో కవిత్వం రాస్తున్నాడు. కలం పేరు కాస్త కొత్తగా అనిపించింది. అమ్మానాన్నలను కలంపేరులో నిలుపుకోవడంలోనే ఆయన “హృదయం” ఏమిటో మనకు స్పష్టమవుతుంది. తల్లిదండ్రులను ప్రేమించిన వాడు, ఆరాధించిన వాడు చుట్టూ ఉన్న సమాజాన్ని సైతం ప్రేమిస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. వంశీ నానీల్లో ఆ “ప్రేమ” మనకు అడుగడుగునా కనిపిస్తుంది. ఏ సాహితీ కార్యక్రమం చూసినా యాభై ఏళ్ళకు పైబడిన వారే అధికంగా కనిపిస్తూ ఉంటారు. ఒక వేళ అడపాదడపా యువత కనిపించినా ఏ తెలుగు ఉపాధ్యాయులో, ఉపన్యాసకులో, పరిశోధక విద్యార్థులో అయ్యుంటారు. ఇలాంటి సాహిత్య కార్యక్రమాల్లో తరుచూ పాల్గొంటాడు వంశీ. చదివింది ఆంగ్లమాధ్యమం, చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. ఈ నేపథ్యంలో వంశీ కవిత్య్వం వైపు అడుగులు వేయడం గొప్ప విషయమే. బహుశా నాన్న గారి సాహిత్య వారసత్వమూ కారణమేమో. నానీల ప్రక్రియ

పద్యం – హృద్యం జనవరి 2020

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. అనివార్య కారణముల వలన గత కొన్ని మాసములుగా ఈ శీర్షికను ప్రచురించ వీలుపడలేదు. అందుకు క్షంతవ్యుడను. ఇకపై నిర్విరామముగా నిర్వహించడానికి ప్రయత్నిస్తాము. నెలెనెలా పూరణలతో మీ ప్రోత్సాహమును కొనసాగిస్తారని ఆశిస్తూ.. 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేస్తూ పద్యములను పంపండి. ఈ మాసం ప్రశ్న: చుట్టములను కలసినంత సుఖములు తగ్గున్ గతమాసం ప్రశ్న: నాస్తికులకు దైవమన్న నయమున్ భయమున్ (శ్రీ దువ్వూరి వి.ఎన్. స