Month: February 2020

చిన్నతనం

శీర్షికలు
చట్టాలకు పదునే కాదు .. కుటుంబాల నుండీ కూడా నైతికతలు పెంచాలి !! అమరనాథ్ .జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 మానవ నాగరిక చరిత్రలో "స్త్రీ"కున్న ప్రాశస్త్యం, పవిత్రత పూజా దేవతలుగా పూజించబడే విధానాలు మన సాంప్రదాయాల్లో సంస్కృతిలో భాగమనే విషయం అలాగే భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల్లో "స్త్రీ"ని దేవతామూర్తిగా కొలవబడటం, పూజించబడటం మన ముందున్న సజీవ వాస్తవాలే అయినా కూడా ద్వంద ప్రమాణాలతో "మహిళ" పైనే ఈ దారుణాలు నిత్యకృత్యంగాఎందుకు జరుగుతున్నాయి? శారీకంగా మగవాడు బలవంతుడైన కూడా మహిళే మానసికంగా బలవంతురాలనే ఒక సామాజిక 'సత్యం' తెలిసినా కూడా ఇటువంటి ఒత్తిళ్లకు, వివక్షతలకు, అవమానాలకు మరియు అత్యాచారాలకు ఎన్నడూ లేని విధంగా అత్యంత క్రూరంగా ఆడదే ఎందుకు గురి కావాల్సి వస్తుందనేదే నేడు కొన్ని కోట్ల కొట్ల మనస్సులను తొలిచి వేస్తున్న ప్రశ్న! సమాజంలో తరాలు మారుతున్నా తరగని పురుషాధిక్య భావజాలాలు,కుటుంబ స్థాయ

అన్నమయ్య శృంగార నీరాజనం ఫిబ్రవరి 2020

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య చెప్పరాదీ యింతి సిరులు అన్నమయ్య శ్రీ వేంకటనాధుని దేవేరి అందచందాలను వివరిస్తున్నాడు. ఆమె వంటిపై ధరించిన ఆభరణాలను సరససృంగార రసభరితంగా వర్ణిస్తున్నాడు. ప్రబంధశైలిలో సాగిన ఈ కీర్తన తరువాతి తరాల కవులకు మార్గదర్శకమై ఉండవచ్చు. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: చెప్పరాదీ యింతి సిరులు - దీని- వొప్పులిన్నియుఁ జూడ వొరపులో కాని ॥పల్లవి॥ చ.1 ముదితజఘనముమీఁది మొలనూలిగంటలవి కదలు రవమెట్లుండెఁ గంటిరే చెలులు మదనుఁడుండెడి హేమమందిరము దిరిగిరాఁ గదిసి మ్రోసెడి పారిఘంటలో కాని ॥ చెప్పరాదీ ॥ చ.2 కొమ్మపయ్యెదలోని కుచమూలరుచి వెలికిఁ జిమ్ముటది యెట్లుండెఁ జెప్పరే చెలులు యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి కమ్ముకొని చెంగావి గప్పిరో కాని ॥ చెప్పరాదీ ॥ చ.3 నెలతకంఠమునందు నీలమణిహరములు అలరుటెట్లుండు కొనియాడరే చెలులు లలితాంగి ప్రాణవల్లభుఁడు వేంకటవిభుఁడు నెలకొన్న కౌఁగిటనె నిలిచెనో కాని ॥

వీక్షణం-89

వీక్షణం
-రూపారాణి బుస్సా కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ లో శ్రీ వెంకటరమణ, శ్రీమతి సుభద్ర గారింట్లో జనవరి 12, 2020 న జరిగిన 89వ వీక్షణ సమావేశానికి శ్రీ వేణు ఆసూరి గారు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మొట్టమొదటగా వెంకటరమణ గారు కథలు వ్రాసే విధానం లో చారిత్రకంగా వచ్చిన మార్పులను గురించి వివరంగా మాట్లాడారు. దాదాపు 1910 నుండి మొదలైన కథా రచన పరిస్థితులను బట్టి, కాలానికి తగినట్టు ఎలా మార్పు చెందిందన్నది చాల చక్కగా తెలియజెప్పారు. కథ యొక్క ప్రయోజనమేవిటి, కథావస్తువు ఎలా ఎంచుకోవాలి, కథా శిల్పమేమిటి వంటి అనేక విషయాల గురించి క్షుణ్ణంగా తెలియపరిచారు. విరామం తరువాత సభను డా|| కె.గీతగారు ప్రారంభించారు. తమ తల్లి శ్రీమతి కె.వరలక్ష్మి గారికి ఇటీవలే లభించిన అజో-విభోకందాళం ఫౌండేషన్ వారి జీవన సాఫల్య పురస్కారం గురించి చెబుతూ కె.వరలక్ష్మి గారి కథా ప్రస్థానాన్ని, జీవన విశేషాల్ని వివరించారు. కె. వరలక్ష్మి గారి

తేడా

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి దేశంలో ఎన్నికలు జరుగుతున్నపుడు రెండు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పైకి రావడం మొదలైంది. మొత్తం దేశం అంతా ఒకే పార్టీ ఉంటే బాగుంటుందనీ, ఇలా చిన్న ప్రాంతీయ పార్టీలకి వోట్లు వేస్తే దేశం గల్లంతౌతుందనీ అథిష్టానం నుంచి పెద్దలు వ్రాక్కుచ్చారు. అయినే ఎవరూ విన్నట్టు లేదు. ఈ రెండూ రాష్ట్రాల్లోనూ మొత్తానికి ప్రాంతీయపార్టీలే నెగ్గాయి. ఈ పార్టీలు కూడా ఈ మధ్యనే కాలేజీలోంచి పాసయ్యీ, అవకా అవసరాన్ని బట్టి సమ్మెలు చేస్తూ బయటకొచ్చిన కుర్రగాళ్ళవి. అందువల్ల ఏ అభ్యర్ధికీ కూడా ముఫ్ఫై దాటలేదు వయసు. పక్క పక్క రాష్ట్రాలు కనక ఒకే భాష మాటాడకపోయినా, దాదాపు వీళ్ళ భాష వాళ్ళకీ, వాళ్లది వీళ్ళకీ అర్థం అవుతుంది, తిండీ తిప్పలూ ఇద్దరివీ ఒకటే రకానివి. అధిష్టానం వేరే పార్టీ అయినా ఈ రెండు ఈశాన్య రాష్ట్రాలూ వేరేపార్టీతో అధికారంలోకి వచ్చేయి. ఈశాన్యం ఒకటికి బందోపాధ్యాయ్ ముఖ్యమంత్రి అయితే ఈశాన్యం రెండుకి