TAGS – తెలుగు భాషా దినోత్సవం
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 29, 2021 న ‘గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి - తెలుగు భాషా దినోత్సవం’, మరియూ ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గురించిన చర్చా కార్యక్రమం
ఆగష్టు 29 న గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి ని...మనం “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని తెలుగు భాషలో ఉన్న అందాన్నీ, మాధుర్యాన్ని తెలియజెప్పిన మహనీయుడు గిడుగు వారి గూర్చి, ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గురించిన ఒక చర్చా కార్యక్రమాన్ని శాక్రమెంటో తెలుగు సంఘం ఆన్ లైనులో నిర్వహించింది .
పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చినా అది ఉండవచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, లేదా కరిగిపోవచ్చు. కానీ వారికి మనం అందించే భాష మరెన్నో తరాలకు చేరుతుంది. మన తెలుగు జాతి వైభవాన్ని, తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి ఖ్యాతిని చ