Author: Sujanaranjani

వాటా

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి సోమవారం పొద్దున్న డాకెట్ లో మొదటి కేసు. బెనర్జీ అనే ఓనర్ గారు ఏపిల్, ఆండ్రాయిడ్ ల మీద పనిచేసే ఓ ఏప్ తయారు చేస్తున్నారు. ఒక వెంచర్ కాపిటలిస్ట్ పాతిక శాతం వాటాకి పెట్టుబడి పెట్టాడు కానీ పని అవలేదు. కారణాలు అనేకం – కోడ్ రాసే కుర్రాడు పని మానేసి వెళ్ళిపోయాడు; కొన్ని కోడ్, నెట్ వర్క్ కష్టాలు, అన్నీ కలిపి కోతి పుండు బ్రహ్మరాక్షసి లాగా తయారయ్యాయి. డబ్బులు అయిపోయాయి; ఈ ఆప్ కనక మరో ఆర్నెల్లలో పూర్తవకపోతే వెంచర్ కాపిటలిస్టు గారు పీకలమీదకి వచ్చి కూర్చుంటాడు. ఉన్న ఒకే ఒక దారి – బెనర్జీగారి ప్రకారం – మరో నూట యాభైవేలు సర్దాలి. అన్నింటికన్నా ముఖ్యం ఆ ఆప్ పూర్తిచేయడానికి అమల, వెంకటేశ్వరన్ ఇద్దరూ పనిచేయాలి –ఫుల్ టైం స్థాయిలో – అంటే, ఉన్న ఉద్యోగాలు మానుకుని. ఉన్న ఉద్యోగం మానుకుంటే ఎలా అనే ప్రశ్నకి బెనర్జీగారే చెప్పారు సరైన సమాధానం. ఏప్ అవగానే దాన్ని ఎవరో పెద్దవాళ్లకి అమ్ముతారు ఏడాదిలో

మువ్వగోపాల

కవితా స్రవంతి
రచన—తమిరిశ జానకి నీ మురళిపాటకై వేచియున్నాను వేగిరము రావేల వెతలు బాపంగ నీ సొగసు కనుటకై కాచియున్నాను కమలనయన ఇటు కనుపించవేల నీ మురళిపాటలో నెమ్మది దొరికేను నీ సొగసుకాంతిలో శక్తి కలిగేను పూలబాటగా నా బ్రతుకు సాగిపోయేను గడియ గడియకూ భ్రమ కలిగించెను ఎండుటాకుల గలగల నాకు నింగిలో తారకలు నను చూచి నవ్వేను పొగడచెట్టు నను పలుకరించేరీతి పొందికగ నాపైన పువ్వులను రాల్చేను ఇటువింటి నీ కాలిమువ్వలసడి అటువింటి నీ వేణుగానమ్ము ఎటు చూచిన కానరావు వేధించకయ్య నను బాధించకయ్య వేగిరము రావయ్య వేణుగోపాల మురిపించబోకు మరి మువ్వగోపాల ! తమిరిశ జానకి

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: సంసార సుఖంబులబ్బు సన్యాసికిలన్ (శ్రీ చిరువోలు విజయ నరసింహా రావు గారు పంపిన సమస్య) ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న: యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్ (“నిద్ధరన్” అని ఉంటే బాగుండేది అని శ్రీ M.V.S. రంగనాధం గారు సూచించారు) ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి. ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్ (1) ఉ. యుద్ధమె జీవితమ్ము, గెలు పోటము లుండును, పోరు సాగగన్

‘అనగనగా ఆనాటి కథ’

కథా భారతి
-సత్యం మందపాటి స్పందనః నాకు ఆనాటినించీ ఈనాటిదాకా ఎన్నో పుస్తకాలు, పత్రికలూ చదివే అలవాటు వుందని చెప్పాను గదా! అలాగే కొన్ని పత్రికల్లో పడుపు వృత్తి గురించి, వారు అలాటి వృత్తిలోకి కావాలని రాకపోయినా, ఆ విషవలయంలోకి ఎలా కొందరు స్వార్ధపరులు డబ్బుకోసం వారిని ఆ రొంపిలో తోసేస్తారు, సమాజంలో ఆ వృత్తి చేసుకునే వారికి మర్యాద, గౌరవం ఎలా వుంటుంది మొదలైన విషయాలు చదువుతుంటే వచ్చిన ఆలోచనే ఈ కథ వ్రాయటానికి స్పందన. ఈ కథ ఆంధ్రపత్రికలో వచ్చాక, ఎందరో పాఠకులు మెచ్చుకుంటూ ఉత్తరాలు వ్రాశారు. అంతేకాక, ఆనాటి కొన్ని మంచి కథలు ప్రచురించిన ఒక కథా సంపుటిలో కూడా, ప్రత్యేకంగా ఆ పుస్తకానికే “మనిషి” అని పేరు పెట్టి ప్రచురించారు. ఇది నాకిష్టమైన కథల్లో ఒకటి. మీ అభిప్రాయం కూడా చెబుతారు కదూ! 0 0 0 మనిషి (ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక సెప్టెంబర్ 4, 1974 సంచికలో ప్రచురింపబడింది) ఒకసారి ఆ ఆరుగురినీ పరీక్షగా చూశాడతను. ముఖాలకు

WASC గుర్తింపు

సుజననీయం
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం - WASC గుర్తింపు ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారిగా భారతీయులచే స్థాపించబడి భారతీయ భాషలు, కళలకు నెలవైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి (`University of Silicon Andhra`) జులై 13th న ప్రతిష్ఠాత్మకమైన `WASC` (`Western Association of Schools and Colleges`) గుర్తింపు లభించింది. ప్రతిభగల విద్యార్థులకు బోధన చేయటానికి ఈ గుర్తింపు ఆవశ్యకం కాబట్టి, అమెరికాలో ప్రతి విశ్వవిద్యాలయం ఈ గుర్తింపు తెసీసుకోటానికి ప్రయత్నం చేస్తాయి. ఈ గుర్తింపుతో విశ్వవిద్యాలయం అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తూ, కళలు, భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయటానికి సహకరిస్తుంది. అభివృద్ధికి ఎన్నో బాటలు వేస్తుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా రాష్ట్రం, మిల్పిటాస్ నగరంలో 2016లో స్థాపించబడింది. 2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు సంపాదించి భారతీయ కళలు, భాషల్లో విద్యాబోధన ప

జన్మ దినోత్సవం

కవితా స్రవంతి
- అరాశ (అమరవాది రాజశేఖర్ శర్మ) ఫోమును ప్రెస్ చేసి మోమంత చల్లేసి                కంపును కొంపంత నింపుతారు క్రొవ్వొత్తులంటించి రివ్వుననూదుచు               నోర్పుగా దీపాల నార్పుతారు కేరింతలనుగొట్టి కేకును ఖండించి               క్రీము ఫేసులకద్ది గెంతుతారు సరదాలు పండించ సఖులంత వరుసగా               వీపుపై గ్రుద్దులు మోపుతారు పిచ్చి కేకల బొబ్బల రెచ్చిపోయి గాలి బుడగల పిన్నుతో కూలదోసి అల్ల కల్లోల భావన నల్లుతారు జన్మ దినమను పర్వమున్ జరుపువేళ దేహమునిచ్చి పెంపుగొన దీవెనలిచ్చి సరాగమున్నిడన్ స్నేహితులై చెలంగి మది చింతలెరుంగని సౌఖ్యమిచ్చు స మ్మోహన దేవతల్ గనగ మోదమగున్ తలిదండ్రులన్న దా సోహమటంచు జన్మదిన శోభనమున్ ప్రణమిల్ల సౌఖ్యమౌ వందనమిదె గొనుమా గో విందా యని కోవెల జని వేడుక తోడన్ బృందా విహారిని జనన పుం దినమున గన్న యమిత పుణ్యంబబ్బున్ వృద్ధ జనులకు సేవ సమృద్ధినిచ్చు అర్థికోటికి సహకారమర్

అసాధ్యుడు

అసాధ్యుడు (పి వి మొగ్గలు) - డా. భీంపల్లి శ్రీకాంత్ జూన్ 28వ తేది మాజీ ప్రధాని కీ.శే. పాములపర్తి వెంకట నరసిం హారావు శతజయంతి. కేంద్ర ప్రభుత్వం బిరుదు ఇవ్వక పోయినా పివి ని భారతజాతి రత్నంగా పరిగణించవచ్చు. దేశ ఆర్థిక సంస్కర్త, భారతదేశ నూతన శకానికి కర్త అయిన పి.వి. నరసిం హారావును మనదేశపు ఠీవీగా చెప్పుకోవచ్చు. రాజకీయవేత్తగా, విద్యార్థి నాయకుడిగా, సాహితీమూర్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా, ఇంకా తనను వరించిన ఇతరపదవులకే వన్నె తెచ్చి, తను పనిచేసిన అన్న్ని రంగాల్లో ఆదర్శప్రాయుడుగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశీలిని 360 డిగ్రీలలో ప్రస్తుతించారు కవి శ్రీకాంత్ గారు. మూడు పాదాల కవితల్లో, సరళమైన భాషలో, చదవగానే సులభంగా అర్థమయ్యే పదానుక్రమణతో రచించారు కాబట్టి 'పి వి మొగ్గలు ' అని కవితా సంపుటి పేరు పెట్టారనుకోవచ్చు. పాలమూరు సాహితి, మహబూబ్ నగర్ ప్రచురించిన 40 పేజీల ఈ పుస్తకం కావాలనుకొన్నవ

తనకు మాలిన ధర్మము

కథా భారతి
— బి వి లత ‘శశీ, ఎక్కడకు వెళుతున్నావు?’ ‘ఇప్పుడే వస్తా’ ‘నా మాట వినరా! బయట పరిస్ధితి బాగా లేదు, నువ్వు చెపితే వినవేం? ఊరంతా కరోనా అని భయపడుతోంది. జాగ్రత్తగా ఉండాలిరా’ ‘అందుకే వెళుతున్నానమ్మా! ఎవరికో ఎమర్జన్సీట!’ ‘కనీసం ఆ పి పి యీ కిట్టు ఏదో ఉంటుందిగా, అదేదో వేసుకోని, మాస్కన్నా సరిగ్గా పెట్టుకో’ ‘నాకు తెలుసులేమ్మా, నస పెట్టకు’ అంటూ హడావుడిగా వెళ్ళే కొడుకు కేసి బెంగగా చూస్తూ, ‘చూడండి, వాడు నా మాట వినకుండా, ఎలా వెళుతున్నాడో?’ అంటూ భర్తకు ఫిర్యాదు చేసింది సుగుణ. ‘ఇది మీ ఇద్దరకీ మాముూలేగా? కాస్త కాఫీ ఇవ్వు’ అంటూ శరత్ గారు టివి న్యూస్ చూడటంలో మునిగి పోయారు. *** ‘శశి రాలేదా?’ ‘లేదు, రాత్రి 10 అయ్యింది, రోడ్డుమీద పురుగు లేదు, వీడు ఎక్కడ ఉన్నాడో? ఫోన్ కూడా ఎత్తడు. అదిగో, వచ్చినట్లున్నాడు, శశీ, నీళ్ళు బయట పెట్టా, అక్కడే బట్టలు వదిలి, రెండు చెంబులు పోసుకోని రా’ వి