Author: Sujanaranjani

దేశభక్తి కవిత

సుజననీయం
దేశమే నేను-నేనే దేశము రచయిత్రి-తమిరిశ జానకి దేశమంటే మట్టికాదని దేశమంటే మనుషులని పాడుకుందాం గురజాడవారి జాడలో ! వట్టిమాటలు కావవి గట్టిమేలుకొలుపులు మనసా వాచా కర్మణా దేశాన్ని ప్రేమించు మనుషులం మనమవుదాం మంచిమనసులకు రూపాలు అవుదాం ! నడుచుకుందాం తోటిమనిషికి సాయపడుతూ నడవనిద్దాం వారి వృద్ధికి అడ్డుపడక ! నటనకాదు దేశభక్తి స్వతహాగా రావాలి మనసులోంచి ! దేశం నాకేమిచ్చిందని రుసరుసలాడకు దేశానికి నేనేమి చెయ్యగలనని యోచించు ! ఏడాదికోసారి ఎగరవేస్తే జెండా అయిపోదు బాధ్యత అని తెలుసుకుందాము ! కులమతభేదాలు కుతంత్రాలు కూలదొయ్య్కపోతె ప్రక్షాళన చెయ్యకుంటె అవినీతీ అక్రమాలు దేశమేగతి బాగుపడును భవిత ఏ తీరున చక్కపడును ! భావిభారత పౌరుల తీర్చిదిద్దాలంటె ఉండాలి మెండుగా దేశమంటే భక్తి నేనే దేశము దేశమే నేనన్న భావన నిండాలి మనసున దండిగా ! ఎందరి త్యాగఫలమో మనదేశ స్వాతంత్ర్యం అర్పించుకుందాము అందరికీ వందనాలు ! గౌరవ

*అన్యాపదేశం*

కవితా స్రవంతి
-దర్భముళ్ల  చంద్రశేఖర్ నిన్నటిలో పుట్టిన అబద్ధానివి నువ్వు... రేపటిలో మొలిచే నిజాన్ని నేను! ఏ ఉన్మాదుడి ఊహలోంచో... ఊహాన్ లోంచో... ఉరికి వచ్చి, ఊరికొచ్చి ఉరి చిచ్చు పెట్టిన ఉపద్రవానివి... జడ లిప్పుకు తాండవం చేస్తున్న జగజ్జంత్రీవి! ఊడలు ఊబిలోకి దిగేసి నిర్దాక్షిణ్యంగా నాల్కతో లాగి నలిపేసే దెయ్యాల మర్రివి... రాక్షస కంత్రీవి!! అయినా నా ధృడ సంకల్పం ముందు నువ్వు నన్నేమి చేయలేవు........!!! ఒక్క బేతాళుడివి... కొమ్ములతో వేలాడే పాపాల పాతాళుడివి... ఏ భుజం ఆసరాగా దొరుకుతుందని చూసే పిచ్చి పీనుగవి నీలాంటి ఎందరో బేతాళుల్ని ముగింపు లేని వందల వేల శంకల్ని వంకల్ని తెగ నరికే విక్ర"మార్కు" తలారిని నేను!!! గుర్తుందా.... ఆనాడు అమృతాన్ని అరచుక్క చవి చూడకుండానే నాల్కలు చీల్చుకున్న విష సర్పమా... నీ కందకుండా అమృతభాండాన్ని అదిలించి మరీ ఎగరేసుకు పోయిన దమ్మున్న  ఖగరాజుని నేను రా! ఈనాడు నా గ

Telugu AUDIO book of Veerayya

- Krishna మన ముత్తాత  పేరే తెలియని ఈ రోజుల్లో.. రచయత కృష్ణ తన మూలాన్ని వెతుక్కుంటూ చరిత్రపుటల్లోకి..తవ్వుకుంటూ వెళ్ళిపోయి..అక్కడినించి..ఘనీభవించిన.. తమ పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి..'వీరయ్య' గా మన ముందు పరిచాడు కృష్ణ ముత్తాత, వీరయ్య  భారత దేశం నుండి  సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, మారిషస్ లొ బ్రిటిష్ చెరుకు పొలాల్లో పంపబడ్డ 13 లక్షల ఇండెంచర్ కూలీలలో ఒకరు... ఇది ప్రతిఒక్కరు చదవ వలసిన పుస్తకము. దాసుభాషితం అప్ లో తెలుగు ఆడియో పుస్తకాన్ని విని ఆనందించండి https://www.dasubhashitam.com/ab-title/ab-veerayya-1 తెలుగు పుస్తకాన్ని కొనటానికి క్లిక్ చెయ్యండి https://www.amazon.com/dp/8194427339 = = In times where most of us do not even know the name of our great grandfathers, Krishna spent a lifetime searching through the annals of history for his ancestor,

గజల్

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నీ తలపే నన్ను ప్రేమలో ముంచేసింది నీ వలపే నన్ను ప్రేమలోకంలో దించేసింది తొలిచూపులే కదా పలికింది ప్రణయం నీ మనసే నన్ను ప్రేమమైకంలో ముంచేసింది నిరంతరం వెంటాడే నీ ప్రేమకిరణం నీ చూపే నన్ను మోహంలో కప్పేసింది నువ్వే కదా నా జీవితానికి ఆరోప్రాణం నీ విరహం నన్ను వియోగంలో ముంచేసింది నీవులేని జీవితం నిజానికెంత నరకం నీ ఎడబాటు నన్ను కన్నీరులో ముంచేసింది జీవితమంతా ఆరాధనే కదా భీంపల్లి మరపురాని ప్రేమ జ్ఞాపకాల్లో ముంచేసింది

వీక్షణం సాహితీ గవాక్షం-105 వ సమావేశం

వీక్షణం
-వరూధిని వీక్షణం-105 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆసక్తిదాయకంగా మే 9, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీమతి గునుపూడి అపర్ణ గార్ల కథా పఠనం, కవిసమ్మేళనం జరిగింది. కథాపఠనంలో ముందుగా శ్రీధర్ రెడ్డి గారు "మాతృప్రేమ" కథను చదివి వినిపించారు. “పండు పండు ముసలమ్మ! గింత ఫాస్టు రోడ్డు మీద కారు నడుపుకుంట పోతాందా?”, "వేడిగాలి ఏమంత పెద్దగ లేదు గని, ఎండ మాత్రం సుర్రుమంటాంది” వంటి సంభాషణలతో తెలంగాణా యాసలో రాసిన డయాస్పోరా కథ మాతృప్రేమ. ప్రపంచంలో ఎక్కడైనా తల్లి హృదయం ఒక్కటే అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ రాసిన చక్కని కథ. పాత్రలు సహజ సంభాషణలతో కళ్ళ ముందు కదలాడినట్లు ఉండడం ఈ కథలో విశేషం. తర్వాత అపర్ణ గారి కథ "సంకర్షణ" పెళ్ళికి స్వస్తి పలికి, సింగిల్ పేరెంట్ గా కోరుకుని మరీ మారుతున్న యువత గురించిన ఆలోచింపచేసే విలక్షణమైన డయాస్పోరా కథ. కథలో ఆద్యంతం రెండు సంస్కృతుల మధ్య సంఘర్షణని స్పష

కృష్ణుడి నవ్వు

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి యుధిష్టిరుడు పంపిన ఆహ్వానం చూసి కృష్ణుడు ఉద్ధవుణ్ణి అడిగేడు, “చూసావు కదా, మొన్నటికి మొన్ననే రాజ ప్రతినిధులు వచ్చి జరాసంధుడు చెరలో పెట్టిన రాజులని విడిపించమన్నారు. ఇప్పుడే యుధిష్టిరుడి నుంచి ఈ రాజసూయానికి ఆహ్వానం. మనం ఏం చేస్తే బాగుంటుంది?” “జరాసంధుడు మనచేతిలో చావడనేది నీకు తెల్సిందే. తనకి తగ్గ వీరుడితో ద్వంద్వ యుద్ధంలో తప్ప ఆయన చావడు. రాజసూయానికి ఎలాగా మిగతా రాజులని ధర్మజుడు జయించాలి. జరాసంధుడు బతికి ఉండగా అది అసంభవం. పాండవులలో భీముడొక్కడే జరాసంధుణ్ణి చంపగలవాడు. అలా భీముడితో జరాసంధుణ్ణి అంతం చేయించి రాజసూయం చేయించావంటే రెండు పనులూ ఒకేసారి అయిపోతాయి,” ఉద్ధవుడు చెప్పాడు. మంచి సలహా ఇచ్చిన ఉద్ధవుడి భుజం తట్టి అక్కడే వేచి చూస్తూన్న పాండవదూతతో చెప్పాడు మురారి, “నేను బయల్దేరి వస్తున్నాననీ దగ్గిరుండి రాజసూయం చేయిస్తాననీ ధర్మజుడితో చెప్పు.” రాజసూయానికి బయల్దేరే కృష్ణుడ