విశ్వామిత్ర 2015 – నవల ( 9వ భాగము )
- యస్. యస్. వి రమణారావు
ఉదయం తొమ్మిదికల్లా రాజు కారుతో సిబిఐ గెస్ట్ హౌస్ దగ్గర సిద్ధంగా ఉన్నాడు.అభిషేక్ వచ్చి కారులో కూర్చున్నాడు.’ఎడ్రస్ సార్"అడిగాడు రాజు."లక్ష్మీపురం దగ్గరకు వెళదాం. అక్కడికి వెళితే గుర్తు పట్టగలను "విశ్వామిత్రని చూశానని చెప్పి గొప్ప షాక్ ఇచ్చారు సార్.మేమింకా విశ్వామిత్ర హోమ్ కి భయపడి అండర్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడని అనుకుంటున్నాం అంతవరకు."నవ్వాడు అభిషేక్,కారులోంచి అందంగా కనబడుతున్న విశాఖ నగరాన్ని చూస్తూ."మీరు వెళ్ళాక జగదీష్ గారు మినిష్టర్ గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయనకూడా షాక్ అయ్యారు సార్" "అందులో నా గొప్పతనం ఏముంది?It`s purely accidental."
"వాట్ ఈజ్ మిరకిల్ టు మేన్ ఈజ్ లాజికల్ టు గాడ్ అన్నాడు సార్ షేక్స్పియర్. భగవంతుడు మీద్వారానే ఈ కేసు సాల్వ్ చేద్దామనుకుంటున్నాడు సార్.అందుకునే మిమ్మల్ని విశ్వామిత్రని కలుసుకునేలా చేశాడు."అంతవరకూ సిటీని చూస్తూ లైట్ మూడ్ లో ఉన్న