Author: Sujanaranjani

తంజావూరు భాగవత మేళం కూచిపూడి ప్రహ్లాద – తులనాత్మక పరిశీలన

నాట్యరంజని
-- శ్రీమతి డా. ఉమా రామారావు మేలట్టూరు భగవతమేళ నాటకాలు అంకితభావానికి నిదర్శనం, కాలానుగుణంగా అభిరుచులు మారుతున్నా తరతరాల సంప్రదాయాన్ని నియమనిష్ఠలతో ఆచరించడం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా తమిళ భాషాభిమానం వెల్లువెత్తుతున్న వాతావరణంలో తెలుగుదనాన్ని ప్రదర్శించడం వెనుక ప్రధానంగా తెలుగు కళాకారులు మరీ ముఖ్యంగా కూచిపూడి కళాకారులను ప్రస్తావించాల్సి వుంటుంది. వివరాల్లోకి వెళితే విజయనగర సామ్రాజ్యం అంతరించేముందు, శ్రీకృష్ణదేవరాయల అనంతరం ఆంధ్రప్రాంతలో కళాపోషణ కరవై తంజావూరు నాయకరాజుల ఆశ్రయం కోరి కొంత మంది కూచిపూడి నాట్యాచార్యులు, పండితులు, కళాకారులు తరలివెళ్ళారు. క్రీ.శ. 1577-1614 మధ్య సింహాసనాన్ని అధిష్టించిన అచ్యుతప్పనాయకుడు నాట్యాచార్యులకు, కళాకారులకు భూదానం చేసి నిలువ నీడ కల్పించాడు. కళాభివృద్ధికి చేయూతనిచ్చాడు. దాదాపు 510 మంది కళాకారులకు (బ్రాహ్మణులకు) ఒక్కొక్కరికి ఒక ఇల్లు, ఒక బావితో సహా కొంత భూమిని జ
మనబడి పిల్లల నాటకోత్సవం

మనబడి పిల్లల నాటకోత్సవం

మనబడి
సిలికానాంధ్ర మనబడి ప్రతియేటా నిర్వహిస్తున్న 'మనబడి సాంస్కృతికోత్సవం'లో ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి ఈ సంవత్సరం 'పిల్లల నాటకోత్సవం' ప్రవేశపెడుతున్నది. అమెరికాలో నున్న మనబడి విద్యార్థులందరు ఈ పోటీలో పాల్గొనవచ్చును. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ఉంటాయి. వివరాలకు ఈ కింది లంకెను సందర్శించండి. ManaBadi Drama Festival - SiliconAndhra Manabadi మనబడి విద్యార్ధుల శ్రీ కృష్ణ రాయబారం నాటకం - కాలిఫోర్నియా 

తెలుగాట-ఇదొక తిరకాటం

ఈ మాసం సిలికానాంధ్ర
దీపావళి పండుగ, అక్టోబర్ 30 నాడు సిలికానాంధ్ర-TV9 సంయుక్త నిర్వహణలో ప్రారంభమైన తెలుగాట-ఇదొక తిరకాటం! కార్యక్రమాన్ని ఇండియాలో ప్రతి ఆదివారం ఉదయం 10:30కు, అమెరికాలో ప్రతి శని, ఆదివారాల్లో 1:30 PM PST/4:30 PM ESTల్లో చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి.