చంద్రశేఖర్ చరిత్ర

నక్షత్రాలు

నక్షత్రభౌతిక శాస్త్రం (Astrophysics) భౌతిక శాస్త్రం (Physics) లో ఒక శాఖ. భౌతిక శాస్త్రానికి, నక్షత్రభౌతిక శాస్త్రానికి మధ్య మౌలికమైన తేడా ఒకటి ఉంది. భౌతిక శాస్త్రంలో వాదం (theory), ప్రయోగం (experiment) అని రెండు భాగాలు ఉంటాయి. ఉదాహరణకి ఆదర్శ వాయు సూత్రం, (Ideal gas law) PV = kT ఉంది. ఈ సూత్రం నిజమేనని ఋజువు చెయ్యాలంటే మనం ప్రయోగశాలలో కూర్చుని, ఒక గాజు బుడ్డిని వాయువుతో నింపి, ఆ బుడ్డిని వేడి చేసి, ఆ బుడ్డి ఎంత వేడెక్కిందో, లోపల పీడనం ఎంత పెరిగిందో, వగైరాలు కొలిచి ఇటో ఆటో తేల్చి చెప్పవచ్చు. శాస్త్రంలో ప్రయోగ ఫలితానిదే పై చెయ్యి. ఒక వేళ ప్రయోగంలో నమోదు అయిన విలోకానాంకాలు (readings) PV = kT అనే సమీకరణంతో ఏకీభవించలేదని అనుకుందాం. అప్పుడు మనం మన సమీకరణాన్ని (అనగా, మన వాదాన్ని, మన నమ్మకాన్ని, మన నమూనాని) మార్చాలి కానీ ప్రయోగం తప్పు అని దబాయించకూడదు. నక్షత్రభౌతిక శాస్త్రంలో నక్షత్రాలతో ప్రయోగం

చంద్రశేఖర్ చరిత్ర-విద్యాభ్యాసం

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (19 అక్టోబరు 1910 - 21 ఆగస్టు 1995) అవిభక్త భారత దేశపు పంజాబ్ లోని లాహోర్ నగరంలో సీతాలక్ష్మి కి చంద్రశేఖర సుబ్రహ్మణ్యన్ అయ్యర్ కి పుట్టిన పదిమంది పిల్లలలో మూడవ బిడ్డ, ప్రథమ మగ సంతానం. (తమిళులు తండ్రి పేరుని మొదటి పేరుగా వాడతారు; రెండవ పేరు పెట్టిన పేరు.) వారి వంశ వృక్షంలో చదువులకి, ప్రత్యేకించి వైజ్ఞానిక పరిజ్ఞానానికి, పెద్ద పీట పడడానికి ముఖ్య కారకుడు చంద్రశేఖర్ పితామహుడైన రామనాధన్ చంద్రశేఖర్. ఈయన విశాఖపట్నం లోని మిసెస్ ఏ.వి.ఎన్. (అంకితం వెంకట నరసింగరావు) కళాశాలలో గణితం బోధించే ఆచార్యుడుగా పనిచేసేడు. చంద్రశేఖర్ పుట్టిన ఏటనే ఈ పితామహుడు స్వర్గస్తుడవడంతో, ఆయన రచించిన, సేకరించిన, గణిత గ్రంథాలన్నింటికి చంద్రశేఖర్ వారసుడయ్యాడు. వాటిని జీవితాంతం చంద్రశేఖర్ తన దగ్గర భద్రపరచుకున్నాడట. రామనాధన్ పిల్లలలో జ్యేష్ఠుడు చంద్రశేఖర సుబ్రహ్మణ్యన్; ఈయనే మన కథానాయకుడయిన చంద్రశేఖర్

చంద్రశేఖర్ చరిత్ర ‘చుక్కల్లో చంద్రుడు’

వేమూరి వేంకటేశ్వరరావు తొలిపలుకు రామ కథ రావణుడితో ముడిపడి ఉంది. రావణుడు లేకపోతే రామాయణమే లేదు. రావణుడు మాత్రం సామాన్యుడా? అసమాన్య ప్రతిభావంతుడు. చివరికి రావణుడిని పడగొట్టింది అతని అహంకారం. చంద్రశేఖర్ కథ ఎడింగ్టన్ తో ముడిపడి ఉంది. ఎడింగ్టన్ లేకపోతే చంద్రశేఖర్ కథ మరొకలా ఉండి ఉండేదేమో! ఎడింగ్టన్ మాత్రం సామాన్యుడా? అసమాన్య ప్రతిభావంతుడు. అతను జాత్యహంకారంతో తనని పడగొట్టడానికి ప్రయత్నం చేసేడని చంద్రశేఖరే అభియోగం చేసేడు; అయినా చిట్టచివరి వరకు ఎడింగ్టన్ యెడల గౌరవభావం సడలనివ్వ లేదు. చంద్రశేఖర్ పేరు మొట్టమొదట నేను అమెరికా వచ్చిన కొత్తలో, 1961 లో, విన్నట్లు జ్ఞాపకం. అంతకు పూర్వమే విన్నానేమో, చెప్పలేను. అమెరికా వచ్చి మూడు నెలలు అయింది. డిసెంబరు నెలలో, సెలవులకి, అన్నయ్య దగ్గరకి రాచెస్టర్ వెళ్లేను. అప్పుడు చాల విషయాల మీద చాల కబుర్లు చెప్పుకున్నాం. మా కబుర్లలో అప్పటికి అమెరికాలో సజీవంగా ఉన్న ముగ