సంగీత రంజని

సంగీత రంజని జూన్ 2018

610వ అన్నమయ్య జయంత్యుత్సవం లో భాగంగా మిల్పీటస్ లో ఏప్రిల్ 23 న జరిగిన ప్రాంతీయ పోటిల్లో బే ఏరియా గురువులు ఆలపించిన కొన్ని కీర్తనలు.

సంగీత రంజని మే 2018

610వ అన్నమయ్య జయంత్యుత్సవం లో భాగంగా మిల్పీటస్ లో ఏప్రిల్ 22 న జరిగిన ప్రాంతీయ పోటిల్లో కర్ణాటక సంగీత విదుషీమణి శ్రీమతి NCS రవళి కచ్చేరీ ఇచ్చారు. మృదంగంపై నటరాజన్ శ్రీనివాసన్, వీణపై హృషీకేశ్ చారి సహకారం అందించారు.    

ఉగాది గీతం!

- డా. యడమండ్ర శ్రీనివాసశర్మ పై గీతాన్ని వినడానికి క్రింది లంకెని నొక్కండి https://www.facebook.com/sharma.ys/videos/1363690473735154/

సంగీత రంజని మార్చి – 2018

-A.S.Murali గాత్రకచేరీ ఏప్రిల్ 30, 2017 న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ A.S.Murali గాత్రకచేరీలోని కొన్ని త్యాగరాయ కీర్తనలు. శ్రీమతి సంధ్య శ్రీనాథ్ వయొలిన్, శ్రీ రవీంద్రభారతి శ్రీధరన్ మృదంగం

సంగీత పాఠాలు- (నాలుగవ భాగం)

సేకరణ: డా.కోదాటి సాంబయ్య గీతములలోని స్వరములు సరళంగా ఉండి, ఎక్కువ దాటు స్వరములు గానీ, క్లిష్టమైన సంచారములు గానీ లేకుండా విద్యార్థి తేలిగ్గా పాడడానికి వీలుగా ఉంటాయి. ఉదా: మలహరి రాగం లోని శ్రీ గణనాధ గీతములో పల్లవి చూడండి. మ ప | ద స స రి || రి స | ద ప మ ప || రి మ | ప ద మ ప || ద ప | మ గ రి స || శుద్ధ మధ్యమం సరళీ, జంట, వరుసలు, అలంకారములలో ఇదివరకే పాడడం అలవాటు అయింది కనుక ...ఈ గీతం మంగళకరమైన శుద్ధ మధ్యమం తో ప్రారంభించబడి వెంటనే పక్క స్వరమైన పంచమం తో ద్రుతం ముగుస్తుంది. ఇక లఘువులో దైవతం తో ప్రారంభించి పై షడ్జమం. పై రిషభం తో ముగుస్తుంది . తాళములలో రూపక తాళం సరళంగా ఉంటుంది. మొదటి ఆవృత్తం తో ఆరోహణ అయింది. ఆరోహణ లో కూడా మొదటి ఆవృత్తం లోని స్వరాలే వచ్చాయి. పల్లవి రెండో లైన్ రిషభం తో మొదలై మధ్యమం, పంచమం, దైవతం వరకు వెళ్లి మళ్ళీ మధ్యమం పంచమం కు అవరోహణ మై రెండవ ఆవృత్తం లఘువులో గాంధారం తో కలిసి మ గ

సంగీత పాఠాలు

సేకరణ: డా.కోదాటి సాంబయ్య (మూడవ భాగం) ధాతువు : ఒక సంగీత రచన లోని స్వర భాగమును ధాతువు అంటారు. సంగీతం లో కొంత స్థాయికి చేరిన వారు ఈ ధాతువు సహాయంతో కొత్త రచనలను నేర్చుకోవచ్చు . దీనినే ఇంగ్లిషు లో నోటేషణ్ అంటారు. ఉదా : వరవీణా - రూపక తాళం గీతం లోని ధాతువు. గ గ | పా పా || ద ప | సా సా || మాతువు : ఒక సంగీత రచన లోని సాహిత్య భాగమును మాతువు అంటారు . ఉదా : వరవీణా రూపక తాళ గీతము లో మాతువు .....వ ర | వీ ణా || మృ దు | పా ణీ || ఇప్పుడు దాతు , మాతు లను కలిపి రాస్తే ఇలా ఉంటుంది. గ గ | పా పా || ద ప | సా సా || వ ర | వీ ణా || మృ దు| పా ణీ || కాలము : 1. ప్రధమ కాలము : ఒక క్రియకు ఒక అక్షరం చొప్పున పాడడాన్ని ప్రధమ కాలము అంటారు ..ఉదా: స రి గ మ | ప ద | ని స || స ని ద ప | మ గ | రి స || 2. ద్వితీయ కాలము : ఒక క్రియకు రెండు అక్షరములు చొప్పున పాడితే..ద్వితీయ కాలము ..ఉదా: స రి గ మ ప ద ని స | స ని ద ప | మ గ రి స |

సంగీత పాఠాలు

సేకరణ: డా.కోదాటి సాంబయ్య (రెండవ భాగం) ద్వాదశ స్వర స్తానములు :- రెండు శ్రుతులకు లేక రెండు స్వరములకు గల వ్యత్యాసమును ' అంతరం ' ( difference ) అంటారు. సంగీతములో ద్వాదశ స్వరాంతర్గత స్థానములను చెప్తారు. సప్త స్వరముల లోని షడ్జ, పంచమ ములకు వికృతి భేదములు లేవు. రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాధ ములకు ప్రక్రుతి, వికృతి బేదములు రెండూ కలవు. అందువల్ల షడ్జ , పంచమ ములను ప్రక్రుతి స్వరములని, రిషభ , గాంధార, మధ్యమ, దైవత, నిషాధ స్వరములను వికృతి స్వరములు అని పేరు. ఈ విధమైన తేడాలు హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతం లో కూడా కలవు. మూర్చన :- ఏదైనా ఒక రాగం లో రాగల స్వరముల ఆరోహణ, అవరోహణ లను కలిపి మూర్చన అంటారు. మానవ దేహమునకు ఆస్థి పంజరము ఎలా ఆధారభూతమో ఒక రాగానికి కూడా మూర్చన అలా అధారమవుతుంది. ఆస్థి పంజరానికి పైన మాంసము తదితర అంగములు సమకూరి మానవ శరీర మవుతుంది అలాగే వాగ్గేయకారులు ఒక రాగ మూర్చనకు రాగ ప్రయోగాలు, రంజక