ధారావాహికలు

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
అప్పుడు దేవతలు 'నాయనా శ్రీరామా! నిన్ను చూడాలని స్వర్గలోకం నుంచి నీ తండ్రి దశరథ మహారాజు విమానంలో వచ్చాడు' అన్నారు. ‘మీ అన్నదమ్ములాయనకు నమస్కరించండి' అని పరమశివుడు వాళ్ళకు చెప్పాడు. విమానంలో ఉన్నతాసనం మీద దివ్యకాంతులతో ఉన్న దశరథ మహారాజుకు అన్నదమ్ములు నమస్కరించారు. దశరథ మహారాజు వాళ్ళను కౌగిలించుకున్నాడు. జరిగిన సంగతులన్నీ శ్రీరాముడికి మళ్ళీ గుర్తు చేశాడు దశరథ మహారాజు. తరువాత మళ్ళీ ఆయన స్వస్థానానికి వెళ్లి పోయినాడు. దేవేంద్రుడప్పుడు శ్రీసేతారామలక్ష్మణులను ప్రశంసించి ఏదైనా వరం కోరుకోవలసింది అని శ్రీరాముణ్ణి కోరాడు. అప్పుడు శ్రీరాముడు యుద్ధంలో మరణించిన వానరులు, గోలాంగూల (కొండముచ్చుల) యోధులు, అందరూ పునర్జీవితులయ్యేట్లూ ఎటువంటి శరీరాయాసం పొందకుండా ఉండేట్లు, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేట్లు వరం ఇవ్వవలసిందిగా దేవేంద్రుణ్ణి అర్థించాడు. అందుకు దేవేంద్రుడు తథాస్తని సంతోషంగా చెప్పి అయోధ్య వెళ్ళి సకల సౌఖ్యా

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
విభీషణా! నా మాట కాదని ఈ వానరుల్ని ఎందుకు బాధిస్తున్నావు? వారిని తొలగించవద్దు. వాళ్ళంతా నావాళ్ళు. న గృహాణి న వస్త్రాణి న ప్రాకారా స్తిరస్క్రియాః నేదృశా రాజసత్కారాః వృత్త మావరణం స్త్రియాః (యుద్ధ. 117.27) స్త్రీని మరుగుపరచి కాపాడేవి ఇళ్ళు కావు, వస్త్రాలు కావు, ప్రాకారాలు కావు, తెరలు కావు, రాజసత్కారాలు కావు, మంచి నడవడియే ఆమెకు ఆభరణం. వ్యసనేషు న క్రుచ్చేషు న యుద్ధేషు స్వయంవరే, న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్యతి స్త్రియాః    (యుద్ధ. 117.28) తనకు ఇష్టమైన వారితో ఎడబాటు వంటి కష్టాలు వచ్చినప్పుడూ, రాజ్యంలో కల్లోలాల వంటి సందర్భాల్లోనూ, యుద్ధాల్లో, స్వయంవరాల్లో, యజ్ఞప్రదేశాలల్లో, వివాహాల్లో స్త్రీలు ఇతరులకు కనపడటం దోషం కాదు. కాబట్టి సీతాదేవి పల్లకీ విడిచిపెట్టి కాలినడకనే నావద్దకు రావచ్చు. ఈ వానరులంతా ఆమెను చూస్తారు. నా సమీపంలో ఉండగా మిత్రులతోకూడిన నన్ను ఆమె కూడా చూస్తుంది" అన్నాడు. అప్పుడు సీతా

విశ్వామిత్ర 2015 – నవల ( 18వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు "అది సార్ సంగతి" రాజు పూర్తి చేశాడు "అంతేనా?"అన్నాడు అభిషేక్"ఈ విషయం చెప్పడానికి నువు ఇంత సంకోచం పడడమెందుకు?" రాజు ఆశ్చర్యపోయాడు"అదేంటి సార్,ఒక అమ్మాయి అర్థరాత్రి బీచ్ కి వెళ్ళడం,అక్కడ రౌడీలని చితక బాదడం,అదంతా వీడియో రికార్డింగ్ చేయడం,ఇదంతా మీకు వింతగా ఎబ్నార్మల్ గా అనిపించడం లేదా?" "ఏంలేదు.అర్థరాత్రి బీచ్ కి వెళ్ళాలనే ఉత్సాహం ఉంది,అనుకోనిదేమైనా జరిగితే తనను తాను రక్షించుకోగలననే ధైర్యం ఉంది.అంతకు మించి ఏం కనబడట్లేదు నాకు" "మీరిలా అంటారని మీ సంస్కారాన్ని బట్టి ఊహించాను సార్.కాని తరవాత ఇంకొక విషయం జరిగింది సార్." రాజు ఆగాడు.అభిషేక్ వింటున్నాడు" ఆ ఇంటి బయటకు వచ్చి కేతుబాబుని ఏ హాస్పటల్ కి తీసుకు వెళ్ళారో కనుక్కుని ఆ హాస్పటల్ కి వెళ్ళుతుండగా నాకు ఓఫోన్ వచ్చింది సార్"రాజు మళ్ళీ ఆగి ఇంకో పెగ్గు పోసుకున్నాడు అభి దింకా మొదటిపెగ్గే ఇంకా పూర్తికాలేదు.రాజు అప్పుడే నాలుగుల

విశ్వామిత్ర 2015 – నవల ( 17వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు మర్నాడు పొద్దున్న ఉదయం పొద్దున్న ఎనిమిదింటికి త్రీటౌన్ కానిస్టేబుల్ రాజు సెల్ ఫోన్ గట్టిగా మోగడంతో ఉలి్క్కిపడి లేచాడు. ఎస్సై కేతుబాబు నుంచి ఫోన్. "హోమ్ కొడుకు సురేష్ ఫోన్ చేశాడు. నిన్నేదో గొడవైందంట గదా,నీకు తెలుసంట గదా. అమ్మాయంట గదా. కంప్లయింట్ గూడా ఇచ్చారంట గదా?ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి బొక్కలోకి తోసెయ్యమంటున్నాడు.ఇంకా అరెస్ట్ చేయలేదా అని చిందులు తొక్కుతున్నాడు.మనకెవడు బాసో నాకైతే అర్థం కావటం లేదు.అది సరేలే సురేష్ మనోడే కదా. నిన్నరాత్రే ఎందుకు అరెస్ట్ చేయలేదు?" "సురేష్ ఫ్రెండ్స్ కి దెబ్బలు చాలా బలంగా తగిలాయి సార్.నేను నిన్న వాళ్ళని హాస్పటల్ లో చేర్పించక పోయుంటే కండిషన్ ఇంకా చాలా క్రిటికల్ గా ఉండేది సార్. వాళ్ళని హాస్పటల్ లో జేర్పించడం, వాళ్ళ దగ్గర్నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం ఇవన్నీ పూర్తిచేశాను సార్.అవన్నీ పూర్తయ్యేసరికే తెల్లవారుఝాము ఐదయిపోయింది సార్.

విశ్వామిత్ర 2015 – నవల ( 16వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు ఎగసిపడుతున్న అలలతో ఎఇడి లైట్ ల వెలుగులతో విశాఖపట్టణ సముద్రం మెరిసిపోతుంది.సమయం రాత్రి పదకొండు గంటలు దాటింది.అయినా ఎక్కువగా లేనప్పటికీ ఇంకా జనం ఉన్నారు బీచ్ లో ఆశ్చర్యంగా. దానికి కారణం ఉంది.బీచ్ సాండ్ లో లైట్ లు పెట్టారు. కూర్చోడానికి వీలుగా బీచ్ రోడ్ పొడవునా గ్రానైట్ స్టోన్ వేశారు. గ్రానైట్ స్టోన్ ముందర ఒక పదడుగుల దూరంలో గ్రనైట్ స్టోన్ తోనే చేసిన సోఫాలు అక్కడక్కడ ఉన్నాయి. అక్కడ కూర్చుని ఎగసిపడుతున్న అలలని,సముద్రంమీద పడుతున్న చంద్రకాంతిని చూస్తూ ఎంతకాలమైనా గడిపేయచ్చు. పోలీస్ పేట్రోల్ వాహనం అప్పుడప్పుడు అటూ ఇటూ రౌండ్స్ వేస్తోంది.ఎంతో అందంగా, కొంచెం సెక్యూర్డ్ గానే అనిపిస్తున్నప్పటికీ కూడా..... అంతరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా అక్కడ ఆ సోఫాలో కూర్చుని ఉండడం కొద్దిగా ఆశ్చర్యమే! అదే ఆశ్చర్యం,దానితోపాటు కొంచెం కోరిక, నోవాటెల్ లో డ్రింక్ చేసి ఇంటికి వస్తున్న ఒక నలుగురు కుర్రా

శ్రీరామాయణ సంగ్రహం

ధారావాహికలు
విభీషణ పట్టాభిషేకం రావణుడి అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత లంకారాజ్యానికి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు శ్రీరాముడు. సుగ్రీవుణ్ణి సంతోషంతో కౌగిలించుకున్నాడు. తన పక్కనే వినీతుడై నిలిచి ఉన్న హనుమంతుణ్ణి చూసి శ్రీరాముడు 'నీవు ఇప్పుడు ఈ మహారాజు విభీషణుడి అనుజ్ఞ పొంది వైదేహిని చూసి నా విజయవార్త ఆమెకు తెలియచెప్పాలి' అని కోరాడు. అప్పుడు రాక్షసులు లంకాపట్టణంలో హనుమంతుడి పట్ల వినయవిధేయతలు చూపి గౌరవించారు. వెంటనే లంకాపట్టణానికి వెళ్ళాడు హనుమంతుడు. శ్రీరాముడు ఆమెకు చెప్పవలసిందని చెప్పిన వార్త వినిపించాడు. ‘నీవు చెప్పిన ఈ విజయవార్తకు నేనెట్లా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేడు. నీకెటువంటి బహుమానం ఇవ్వాలన్నా నేనిప్పుడు అశక్తురాలిని.’ అని సీతాదేవి మారుతిని శ్లాఘించింది. సీతమ్మను పలువిధాల బాధలకు గురిచేసిన రాక్షసాంగనలను చంపివేస్తానని హనుమ చెప్పగా ఆమె అతణ్ణి వారించింది. “నా చుట్టూ ఉన్న ఈ స్త్రీలు నన్నెం