ధారావాహికలు
అమెరికా ఉద్యోగ విజయాలు – 12
సత్యం మందపాటి చెబుతున్న
జయం మనదే!
“బావా! నువ్వు నాకు రెస్యూమే వ్రాయటం దగ్గర మొదలు పెట్టి, దాని ముఖ్య ప్రయోజనం ఇంటర్వ్యూ తెప్పించటం మాత్రమేననీ, అది రాగానే ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తిస్తే ఉద్యోగం తెచ్చుకోవచ్చో చెప్పావు. ఆఫీసులో సరైన సంభాషణ ఎలా చేయలో, మాట్లాడేటప్పుడు నా శరీరవాణి ఎలా వుండాలో చెప్పావు. మన శతకాలలోని మేనేజ్మెంట్ సూత్రాలు సూక్షంగా చెప్పావు. ఆఫీసుల్లోని రకరకాల మనస్థత్వాలు ఎలావుంటాయో, వాళ్ళతో ఎలా మెలగాలో చెప్పావు. రంగుటద్దాలలోనించీ కాకుండా, మనం ఇతరులని వాళ్ళని వాళ్ళలాగే చూడటం ఎంత అవసరమో చెప్పావు. అలాగే ఆ రంగుటద్దాలలోనించీ మనల్ని సరిగ్గా చూడని వారితో ఎలా ప్రవర్తించాలో చెప్పావు. పాల్ గెట్టీ, లీ అయోకోకా, స్టీవ్ జాబ్స్ మొదలైన వారి మేనేజ్మెంట్ సూత్రాలు చెప్పావు. జాన్ మాక్స్వెల్ మొదలైన వారి పుస్తకాల గురించి చెప్పావు. అడగందే అమ్మయినా పెట్టదనీ, ప్రమోషన్లు ఎలా తెచ్చుకోవాలో చెప్పావు. ఉద్యోగ వై
అమెరికా ఉద్యోగ విజయాలు – 11
సత్యం మందపాటి చెబుతున్న
పదండి ముందుకు!
“నిన్నొక విషయం అడగనా, బావా? కొత్త ఉద్యోగంలో చేరి ఇంకా ఒక్క సంవత్సరం కూడా కాలేదు, పాలు త్రాగే పసి వెధవ అప్పుడే పరుగెడతానంటున్నాడేమిటని అనుకోవు కదా!” కొంచెం సంకోచిస్తున్నా, నవ్వుతూనే అడిగాడు అర్జున్.
పెద్దగా నవ్వాడు కృష్ణ. “సరే అడుగు. ఏ పసి వెధ.. నువ్వే ఏదో అన్నావు కదా.. ఎవరైతేనేమిలే.. ఎలాగైనా నువ్వు స్పెషల్. అడిగేసెయ్.. నేనేమీ అనుకోనులే..” అన్నాడు.
“నువ్వే చెప్పావు కదా.. ప్రతి మనిషికీ ఒక ధ్యేయం వుండాలనీ, ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారం మనం అనుకున్నది సాధించాలనీ.. “
“అవును. మరి నీ లక్ష్యం ఏమిటి? ఎలా అది సాధిద్దామనుకుంటున్నావు?” అడిగాడు కృష్ణ.
అర్జున్ ఒక్క క్షణం ఆలోచించాడు.
అతను ముందే తన లక్ష్యం, ఆ లక్ష్య సాధనకి ఒక మంచి ప్రణాళిక ఆలోచించి పెట్టుకున్నాడని అర్ధమవుతూనే వుంది. తను చెప్పినవి పూర్తిగా పాటిస్తూ, వాటిని ఉపయోగించటంలో అప్పుడే ముందుకు వెడుతున
ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం 2019
“అనుభూతి కవిత్వం ప్రధానంగా జీవచైతన్య ప్రవృత్తికి సంబంధించింది. మిగిలిన నాలుగు ప్రవృత్తులను సాధ్యమైనంత వరకు జీవచైతన్య ప్రవృత్తిలో సంగమింప చేసుకోవడమో, దానికి పోషకంగా నిలుపుకోవడమో చేస్తారు అనుభూతి కవులు. దీని వల్ల ఆయా కవుల యొక్క అభివ్యక్తి వైవిధ్యాన్ని బట్టి - వాస్తవ చైతన్యాన్ని, జీవచైతన్యానికి పోషకంగా నిలిపే కవులని, కాల్పనిక చైతన్యాన్ని జీవచైతన్యానికి పోషకంగా నిలిపే కవులని, జ్ఞాన ప్రవృత్తిని జీవచైతన్య ప్రవృత్తిని పోషకంగా నిలిపే కవులని, నాలుగు విధాలుగా అనుభూతి కవులను నింగడించ వచ్చు.
ఈ రకంగా పరిశీలిస్తే అనుభూతివాద కవులు ఐదు రకాలుగా కన్పిస్తారు.
జీవచైతన్య ప్రవృత్తిని వాస్తవచైతన్యంతో పోషించిన కవులు.
జీవచైతన్య ప్రవృత్తిని కాల్పనిక మార్మిక చైతన్యాలతో పోషించిన కవులు.
జీవచైతన్య ప్రవృత్తిని కాల్పనిక చైతన్యాలతో పోషించిన కవులు.
జీవచైతన్య ప్రవృత్తిని వైజ్ఞానిక, తాత్విక చైతన్యాలతో పోషించిన కవులు.
జ
రామాయణ సంగ్రహం
ఇక కిష్కింధకు రావణుణ్ణి అట్లా చంకలో ఇరికించుకొనే వచ్చిన తర్వాత వాణ్ణి కిందకి దింపి నవ్వుతూ 'ఏమిటి సమాచారం? ఎక్కడి నుంచి వచ్చారండి!’ అని అడిగాడు వాలి.
రావణుడు బిక్కచచ్చిపోయినాడు. రావణుడి సంభ్రమాశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ‘నేను రావణుణ్ణి. లంకాధిపతిని. నాకు బాగా శాస్తి జరిగింది. నా గర్వం అణగారిపోయింది. భళిరా! ఏమి బలం! ఏమి వేగం! మనోవేగం, వాయువేగం, సుపర్ణుడి వేగం కూడా నీ వేగం ముందు తీసికట్టు. నన్ను మన్నించు. నీ స్నేహితుడిగా చేసుకో నన్ను. నీ వాణ్ణిగా చూసుకో' అని ప్రాధేయపడ్డాడు రావణుడు, వాలిని. అప్పుడు అగ్నిసాక్షిగా వాళ్ళు మిత్రులైనారు.
వాలి రావణుణ్ణి కౌగిలించుకొని మన్నించాడు. ‘ఇవాల్టి నుంచీ మనం అన్నీ నీది, నాది అనే భేదం లేకుండా మైత్రీభావంతో చూసుకుందాం' అని రావణుడు, వాలిని వేడుకున్నాడు. వాలి రావణుణ్ణి, సుగ్రీవుడితో సమానంగా సమాదరించాడు. ఒక నెల రోజులు రావణుడు కిష్కింధలో గడిపాడు. తన కోసం వచ
అమెరికా ఉద్యోగ విజయాలు – 10
సత్యం మందపాటి చెబుతున్న
తాబేలు - కుందేలు
“అర్జునా!
వాళ నీకొక మంచి కథ చెబుతాను” అన్నాడు కృష్ణ.
“అదేమిటి బావా, ఇప్పుడు కథలెందుకు. ఇంతకు ముందు చెప్పినట్టుగా కాస్త మంచి విషయాలు చెప్పి, నా ఉద్యోగంలో పనికొచ్చేటట్టుగా చేయి” అన్నాడు అర్జున్.
నవ్వాడు కృష్ణ. “నీ ఉద్యోగ విజయాల్లో ఉపయోగపడే కథేనయ్యా. ఇది నేనొకసారి ఒక ప్రాజెక్ట్ మానేజ్మెంట్ సెమినారుకి వెడితే, అక్కడ చెప్పారు. ఇదే కథ ఇంకోరకంగా చిన్నప్పుడే పంచతంత్రంలో కూడా చదివాననుకో. విను మరి” అన్నాడు కృష్ణ.
“అయితే చెప్పు మరి” అన్నాడు అర్జున్ సర్దుకుని కూర్చుంటూ.
కృష్ణ చెప్పటం మొదలు పెట్టాడు.
“అనగా అనగా ఒక తాబేలు. ఒక కుందేలు. ఆ రెండూ ఒక రోజు, ఊరికే కూర్చుంటే ఊరా పేరా అని, పోటీ పడ్డాయి, మనం ఇద్దరం పరుగెడితే ఎవరు గెలుస్తారూ అని. సరే ఎలాగూ అనుకున్నాం కదా ఇక ఆలస్యమెందుకు పరుగెడితే పోలా అని, అవి పరుగెత్తటం మొదలుపెట్టాయి. కుందేలు, ఎలాగైనా మరి కుందేలు కద
ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం అక్టోబర్ 2019
కవికి కలిగిన వ్యక్తిగతానుభవాలను కవితలో వెలువరిస్తాడు. ఈ అనుభవాలన్నిటినీ కవి ఆత్మాశ్రయ కవితలుగా రూపొందిస్తాడు. కవిలో కలిగిన ప్రతి అనుభవాన్నీ కవి వ్యక్తపరచకపోవచ్చు. కవి వ్యక్తపరచిన అనుభూతిని పఠిత తన అనుభూతిగా మార్చుకుంటారు. స్వాత్మీకరణంలో సామాజికుడికి అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవితలో కవి వ్యక్తీకరించటం, దాన్ని సామాజికుడు ఆత్మీకరించుకొని తాదాత్మ్యంతో అనుభవించటం జరుగుతుంది. అనుభూతి ప్రధానంగా ఏర్పడిన కవిత్వంలో వాడిన పదాలు అనుభూతికి మరో పేరుగా ఉంటాయి. ఆత్మగతమైన కవితలో ఈ పదాలకు అనుభూతులే చిహ్నాలు.
అనుభవాలని అనుభూతులుగా మార్చుకొన్నప్పుడు కవికి సమగ్రదార్శనికత ఏర్పడుతుంది. సమగ్ర దార్శనికత వల్ల కవి పఠితకు సమగ్రానుభూతిని అందించగలడు. ఈ సమగ్రానుభూతి కవిలో ఏ విధంగా కళానుభూతిగా మారుతుందో వారి మాటల్లోనే చూద్దాం.
“సచేతనంగా, సబుద్ధికంగా, సంకల్పసహితంగా జీవితాన్ని ఆచమనం చెయ్యడం అనుభూతిని కళగా అభ్యసించటం
రామాయణ సంగ్రహం
అప్పుడు కార్త్యవీరుడి మంత్రులు 'ముందు మాతో యుద్ధం చేయండి' అని రావణుడి మంత్రులను కోరారు. రావణుడి మంత్రులు కోపంతో వాళ్ళను చంపివేశారు. అప్పుడు కార్త్యవీరుడి సేనాపరివారంలో గొప్ప గగ్గోలు పుట్టింది. సంక్షోభం బయలు దేరింది.
కొందరు పరిచారకులు వెళ్ళి నదిలో ఉన్న కార్త్య వీరుడికి ఈ సంగతి విన్నవించారు. కార్త్యవీరుడప్పుడు మహాకోపోద్రిక్తుడైనాడు. తనతో జలక్రీడలాడుతున్న సుందరీమణులకు అభయం పలికి ఆయన గొప్ప గద ధరించి గట్టుమీదికి వచ్చాడు. ముందుగా అతడు రావణుడి మంత్రి అయిన ప్రహస్తుడితో తలపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్యా పోరు భీకరంగా సాగింది. తన గదతో బలంగా ప్రహస్తుణ్ణి ప్రహరించాడు కార్త్యవీర్యార్జునుడు.. రావణుడి మంత్రి తలపగిలి కిందపడి పోయినాడు. తరువాత తక్కిన మంత్రులు కార్త్యవీర్యార్జునుణ్ణి ఎదుర్కొన్నారు. వాళ్ళను అవలీలగా పరాజితుల్ని చేసి రావణుణ్ణి బంధించి మాహిష్మతీ నగరం తీసుకొని పోయినాడు కార్త్యవీరార్జునుడు. నగరమంతా తమ
ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం
కవికి కలిగిన వ్యక్తిగతానుభవాలను కవితలో వెలువరిస్తాడు. ఈ అనుభవాలన్నిటినీ కవి ఆత్మాశ్రయ కవితలుగా రూపొందిస్తాడు. కవిలో కలిగిన ప్రతి అనుభవాన్నీ కవి వ్యక్తపరచకపోవచ్చు. కవి వ్యక్తపరచిన అనుభూతిని పఠిత తన అనుభూతిగా మార్చుకుంటారు. స్వాత్మీకరణంలో సామాజికుడికి అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవితలో కవి వ్యక్తీకరించటం, దాన్ని సామాజికుడు ఆత్మీకరించుకొని తాదాత్మ్యంతో అనుభవించటం జరుగుతుంది. అనుభూతి ప్రధానంగా ఏర్పడిన కవిత్వంలో వాడిన పదాలు అనుభూతికి మరో పేరుగా ఉంటాయి. ఆత్మగతమైన కవితలో ఈ పదాలకు అనుభూతులే చిహ్నాలు.
అనుభవాలని అనుభూతులుగా మార్చుకొన్నప్పుడు కవికి సమగ్రదార్శనికత ఏర్పడుతుంది. సమగ్ర దార్శనికత వల్ల కవి పఠితకు సమగ్రానుభూతిని అందించగలడు. ఈ సమగ్రానుభూతి కవిలో ఏ విధంగా కళానుభూతిగా మారుతుందో వారి మాటల్లోనే చూద్దాం.
“సచేతనంగా, సబుద్ధికంగా, సంకల్పసహితంగా జీవితాన్ని ఆచమనం చెయ్యడం అనుభూతిని కళగా అభ్యసించటం