అమెరికా ఉద్యోగ విజయాలు-10
సత్యం మందపాటి చెబుతున్న
తాబేలు - కుందేలు
“అర్జునా!
వాళ నీకొక మంచి కథ చెబుతాను” అన్నాడు కృష్ణ.
“అదేమిటి బావా, ఇప్పుడు కథలెందుకు. ఇంతకు ముందు చెప్పినట్టుగా కాస్త మంచి విషయాలు చెప్పి, నా ఉద్యోగంలో పనికొచ్చేటట్టుగా చేయి” అన్నాడు అర్జున్.
నవ్వాడు కృష్ణ. “నీ ఉద్యోగ విజయాల్లో ఉపయోగపడే కథేనయ్యా. ఇది నేనొకసారి ఒక ప్రాజెక్ట్ మానేజ్మెంట్ సెమినారుకి వెడితే, అక్కడ చెప్పారు. ఇదే కథ ఇంకోరకంగా చిన్నప్పుడే పంచతంత్రంలో కూడా చదివాననుకో. విను మరి” అన్నాడు కృష్ణ.
“అయితే చెప్పు మరి” అన్నాడు అర్జున్ సర్దుకుని కూర్చుంటూ.
కృష్ణ చెప్పటం మొదలు పెట్టాడు.
“అనగా అనగా ఒక తాబేలు. ఒక కుందేలు. ఆ రెండూ ఒక రోజు, ఊరికే కూర్చుంటే ఊరా పేరా అని, పోటీ పడ్డాయి, మనం ఇద్దరం
పరుగెడితే ఎవరు గెలుస్తారూ అని. సరే ఎలాగూ అనుకున్నాం కదా ఇక ఆలస్యమెందుకు పరుగెడితే పోలా అని, అవి పరుగెత్తటం మొదలుపెట్టాయి. కుందేలు, ఎలాగైనా మరి కుందేలు క