అమెరికా ఉద్యోగ విజయాలు – 4
సత్యం మందపాటి చెబుతున్న
అమెరికా ఉద్యోగ విజయాలు - 4
శతకాలతో శతకాలు
మొత్తం మూడు ఇంటర్వూలకు వెళ్ళిన అర్జున్ని, ఒక కంపెనీ వెంటనే పిలిచి ఉద్యోగంలో చేరమన్నది. అదే కృష్ణతో అంటే, ‘మన భారతదేశంలో కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా ఆగవు అనే ఒక సామెత వుంది.
అలగే అమెరికాలో వుంటే, ఉద్యోగమొచ్చినా ఆగదు. శుభం. వెంటనే చేరు’ అన్నాడు.
‘అంతేకాదు బావా, ఉద్యోగం కూడా మీ వూళ్లోనే. వచ్చే సోమవారమే చేరమన్నారు’ అన్నాడు అర్జున్.
‘మరింకేం? తంతే గారెల బుట్టలో పడ్డావన్నమాట. మా ఇంట్లోనే వుండి మీ కంపెనీకి దగ్గరలోనే ఒక ఎపార్ట్మెంట్ ఎతుక్కోవచ్చు’ అన్నాడు కృష్ణ.
‘అది కూడా మా కంపెనీ వాళ్ళే చేశారు. పక్కనే వున్న ఎపార్ట్మెంట్ బుక్ చేశారు. నడిచి వెళ్ళొచ్చు. మా హెచ్చార్ వాళ్ళు ఇలాటి సహాయాలన్నీ చేస్తారు’ అన్నాడు అర్జున్.
శనివారం మధ్యాహ్నం అర్జున్ అక్కడ ఎపార్ట్మెంటులో చేరాడు. కృష్ణ కారులో అతన్ని తీసుకువెళ్ళి అతనికి రోజువారీ కావలసినవన