కథా భారతి

ట్రాఫిక్ టికెట్

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి తీరుబడిగా వేసవి శెలవులకి ఓహైయో నుంచి న్యూయార్క్ న్యూజెర్సీ అన్నీ చూడ్డానికి బుధవారం సకుటుంబంగా బయల్దేరిన శంకర్రావుకి శనివారం వచ్చేసరికి ఒక్కసారి నీరసం ఆవహించింది, మళ్ళీ సోమవారం నుంచీ పనిలోకి వెళ్ళాలంటే. ఓ సారి తల తాకట్టు పెట్టాక ఎలాగా కుదరదు కనక శుక్రవారం రాత్రే హోటల్ ఖాళీ చేసి రాత్రి కొలంబస్ వెళ్ళిపోతే మరో రెండు రాత్రులు తీరిగ్గా పడుకుని సోమవారం పన్లోకి పోవచ్చు. ఇదీ సరిగ్గా వేసుకున్నప్లాను. అయితే క్వీన్ విక్టోరియా, యువరాజా, రాణీల వారికి తండ్రి కున్నంత కంగారు లేదు అప్పుడే ఇంటికెళ్ళిపోవడానికి. వెకేషన్ లో వాళ్ళకి కావాల్సిన ఆనందం వాళ్ళు పిండుకున్నాక కారెక్కి బజ్జుంటారు. శంకర్రావుకు డ్రైవింగ్ ఎలాగా తప్పదు. అర్ధరాత్రీ, అపరాత్రీ ఏక్సిడెంట్ లేకుండా వెళ్ళాలంటే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నిద్రపోకుండా. పోనీ తనకి నిద్ర రాకుండా కబుర్లు చెప్తారా అంటే వాళ్ళందరూ బాగా అలిసిపోయి నిద్రలో

సెకండ్ పెన్ష్జన్!

కథా భారతి
-కుంతి (కౌండిన్య తిలక్ ) సెల్ మ్రోగింది. "హలో! ఆనంద్ బిజీగా ఉన్నావా" స్టేట్ బ్యాంక్ అశోక్ నగర్ లో పనిచేస్తున్న ముకుందరావు నుండి ఫోన్. "లేదు చెప్పు" మారెడ్ పల్లి బ్రాంచ్ లో పని చేస్తున్నఆనందరావు ఫోన్ రిసీవ్ చేస్తూ అన్నాడు. "ఒక న్యూస్.మన రామానుజము సార్ కు వారము రోకుల క్రిందట పెద్ద యాక్శిడెంట్ అయిందట్. సికింద్రాబాద్ లోని ఆత్మీయ హాస్పిటల్ లో ఉన్నాడట .సాయంత్రము ఆరు గంటలకు వెళదామనుకుంటున్నాను.నీవు వస్తావా?" "అరెరె! ఎలా జరిగింది" "ఒక వికలాంగుడినిరోడ్డుదాటించబోయాడట. ఇంతలో ఒక కార్ ర్యాష్ గా వచ్చి సారును బలంగా ఢీకొట్టిందట. ఆ వికలాంగుడికి పెద్దగా దెబ్బలు తగల్లేదట.కానీపాపము సార్ కే బాగా గాయాలయ్యాయట. చాలా రక్తము పోయిందట" "తప్పకుండా వస్తాను" ,ఫోన్ పెట్టేసి,రామానుజముగారితో అతడికున్న అనుబంధము గుర్తుకు రాగా ,అతడికి వచ్చిన ఆపద తలుచుకొని మరింత బాధపడుతూ కూర్చుండిపోయాడు ఆనందరావు. శ్రీ రామానుజము స్టేట్

పాకీ వాడు

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి ఓహైయో, కేస్ వెస్టర్న్ యూనివర్సిటీ కేంపస్ నుంచి దాదాపు రాత్రి ఎనిమిదిన్నరకి చలిలో వెనక్కి నడుచుకుంటూ వచ్చి బూట్లు కూడా విప్పకుండా అపార్ట్ మెంట్ వంటింట్లోకి దూరిన మనోజ్ కి వంట వండుతోన్న అప్పారావు కనిపించేడు. “ఏంటి గురూ డిన్నర్, కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్, వంట చేయడం అయిపోయిందా?” “ఇదిగో అవుతోంది, బట్టలు మార్చుకురండి, తినేద్దాం.” చెప్పేడు అప్పారావు. అన్నం తింటూంటే కబుర్ల మధ్యలో మనోజ్ చెప్పేడు, “వచ్చే నెలలో నాకు థీసిస్ చేయాలా, లేకపోతే నాన్ థీసిస్ ఆప్షన్ చేయాలా అనేది తేల్చుకోమని చెప్పేడు ఇవాళ గురుడు.” “ఏం చేద్దామనుకుంటున్నారు?” “నాన్ థీసీస్ అయితే ఓ ఐదారుసార్లు రాసిందే రాసి దిద్దించుకోవచ్చు. తర్వాత అది ఎక్కడ పారేసినా ఎవడికీ పట్టదు. థీసిస్ అయితే దాన్ని సమర్ధించుకోవాలి, ముగ్గురు ప్రొఫెసర్లకి కాళ్ళు కడగాలి, ఆ తర్వాత ఎవడికి నచ్చకపోయినా మరోసారి దిద్దడం, మరోసారి కాళ్ళు కడగడం అ

రాశి ఫలాలు

కథా భారతి
జ్యోతిష్ పండిట్, ఆస్ట్రో సిద్దాంతి, దైవఙ్ఞ చింతామణి, జంతు జీవన జిజ్ఞాసి, ప్రకృతి ప్రేమిక్, కధా రచయిత, బ్రహ్మశ్రీ డా॥ ఆర్. శర్మ దంతుర్తి,పి.హెచ్.డి (అమెరికా) (ఈ రోజుల్లో అసలు జ్యోతిషం అంటే ఏమిటో కూడా తెలియకుండా రాశి ఫలితాలు రాయవచ్చు అని గ్రహించడం కష్టం కాదు. “మేఘాలు వస్తే వర్షం వస్తుంది,” “రోహిణీ కార్తెలో ఎండబారి పడకుండా ఉంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు” లాంటి ఫలితాలు అంతర్జాలంలో, పత్రికల్లో చదివి నేను కూడా రాయగలను అని వెక్కిరించడానికి ఇది రాసాను. దీనికోసం తెలుగు రాయడం వస్తే చాలు; మిగతా ఎటువంటి పరిజ్ఞానం అవసరం లేదు. బ్రహ్మశ్రీ,, ఆస్ట్రో పండిట్, వేదాంతిక్ అనే బిరుదులు ఎన్నికావాలిస్తే అన్ని తగిలించుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనే వాటికి ఏ సంఖ్య వేసినా ఫర్వాలేదు. మీరుకూడా రాయవచ్చు; ప్రయత్నం చేయండి.) [ఈ సంపూర్ణ జీవిత ఫలితాలు రాశి దృష్ట్యా చూసి నిశితంగా గమనించి ర

నిర్ణయం

కథా భారతి
- పాలెపు బుచ్చిరాజు సాగర్ తో తన పెళ్లి ఇలా బెడిసి కొడుతుందని అనుకోలేదు జలధి. అన్నయ్య అయితే అమ్మానాన్నలని కాదని కులంగాని పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబం నుంచి వేరుపడి వేరే కాపురం పెట్టాడు. పిల్లల మీద ఎన్నో ఆశలు పెంచుకునే అందరు తలిదండ్రుల లాగే వారిద్దరూ చాలా కృంగి పోయారు. వాళ్ళని మరింత నిరాశ పరచడం ఇష్టం లేక, వాళ్ళు చూపించిన సంబంధమే చేసుకోవడానికి ఒప్పుకుంది జలధి. సాగర్ తలిదండ్రులు బాగా డబ్బున్నవాళ్ళు. అతను ఎం టెక్ . చదివి, వైజాగులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అందంగా ఆకర్షణియంగా ఉంటాడు. జలధి కూడా ఐ.టి లో డిగ్రీ చేసి, కేంపస్ ఇంటర్వ్యులో టి. సి. ఎస్. లో సెలక్టు అయింది. పెళ్ళయిన కొత్తలో మూడు నెలల పాటు రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. అత్తవారింట్లో ఆ ఆస్థి పాస్తులు, ఆడంబరాలు చూశాక, తమ తాహతుకు మించిన సంబంధమే అనిపించింది జలధికి. తలిదండ్రులకి ఒక్కడే కొడుకు అతి గారాబంగా పెరిగాడు. ఆ యింట్లో అ

ఫ్రెంచ్ లీవు

కథా భారతి
- ఆర్ శర్మ దంతుర్తి డాక్టర్ ఆఫీసులోంచి బయటకొచ్చి గుమ్మం మెట్లు దిగేడు మూర్తి. మనసంతా చిరాగ్గా ఉంది. ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం వచ్చిన అయిదేళ్లలో తనని తన ఏరియా మేనేజరూ ఆ పైన రీజినల్ మేనేజరూ మాటిమాటికీ చంపుకు తినడం తనకి తెలుస్తూనే ఉంది. ఈ ఉద్యోగం అంతే. ఎంత కాళ్ళీడ్చుకు తిరిగినా ఎప్పుడూ అలా తనని దెప్పుతూ ఉంటారు ఇంకా బాగా చేయాలనీ, ఏదో చేయలేదనీ. రెణ్ణెళ్ల కోసారి అలా మీటింగ్ మిషతో ముంబయి లాంటి పెద్ద సిటీలకి తిప్పినా అక్కడ కాన్ఫరెన్స్ రూములో తమకి వేసే అక్షింతలు బయటకి కనపడవు కనక తమకి బాగానే ఉంది జీవితం అనుకుంటూ ఉంటారు మామూలు జనం, కుటుంబాలూను. వేరే ఉద్యోగం వస్తే ఈ దరిద్రం లోంచి తప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు? అంతవరకూ ఎందుగ్గానీ ఇప్పుడే తాను మాట్లాడిన డాక్టర్ ఊర్లో పేరొందిన సర్జన్ గారు. తమ కంపెనీ మందు గురించి ఒక బ్రోషర్ చూపించి చెప్తూంటే ఆయన ప్రశ్న వేసాడు. సర్జన్ గారు ఏమడుగుతాడో ఎలాగరా అను

మధురంతో నా ప్రేమ యాత్ర

కథా భారతి
- భారతీ నాథ్ మధ్యాహ్నపు కునుకులో ఉండగా, హాలులో నుండి మా ఆవిడ మాటలు గట్టిగా వినపడడంతో, లేచి ఏమిటా అని చూశాను. మా అబ్బాయి, అమ్మాయితో స్కైప్ లో మాట్లాడుతూ, గొడవ పడుతూంది, ఆవిడ. సరే, విషయం ఏమిటా అనుకుంటూ, నాకున్న చిన్నపాటి తలను, ఆ సంభాషణలో, దూర్చాను. కాకినాడ ఇంజనీరింగు కళాశాలలో పదును పెట్టిన తలఅవడం వలన, సులభంగానే, విషయం కూలంకషంగా అర్ధమయ్యింది. నన్ను మధు మేహ మహమ్మారి పెళ్ళాడి అర్ధ శత దినోత్సవము అయిన తరువాత, ఎంతో కష్టపడి దింపిన చక్కెర నిలవల సూచి, మళ్ళీ, ఒక్కసారిగా బంగారం ధర పెరిగినట్టు పెరిగి పోయిందని, దానికి గల కారణాలను, విశ్లేషిస్తూ, వాళ్ళ ముగ్గురి మధ్య మేధో మధన కార్యక్రమం జరుగుతుంది. అసలు, ఈ మహమ్మారితో, బహిరంగముగా, పెళ్ళయి 50రోజులే అయినా, ఆమెతో, ఎప్పటినుంచో, అక్రమ సంభంధం పెట్టుకున్నానని, మా ఆవిడ అనుమానం. ఇప్పుడు పరీక్షలు చేయ బట్టి, మీ భాగోతం బయట పడింది, అంటూంది. సగటు మొగుడులాగా, భార్య ఏం

జోస్యం

కథా భారతి
- ఆర్. శర్మ దంతుర్తి జ్యోతిషం చెప్పే వాడికి పేరు రావాలంటే మార్గం ఆయన చెప్పేవి నిజం అవుతున్నాయని వ్యాప్తి చేయడం. ఆ వ్యాప్తికి ఉన్న అనేకానేక పద్ధతుల్లో జనా లు ఒకరి కొకరు చెప్పుకోవడం, లేకపోతే అదృష్టం ఉంటే పత్రికల్లోనో పేపర్లలోనో వార, నెల వారీగా రాశి ఫలితాలు రాయడమో అనేవన్నీ ఒకప్పటి మాట. హై టెక్ యుగానికి ఇవన్నీ అక్కర్లేదు. ఓ బ్లాగో, వెబ్ సైటో మొదలుపెట్టి అంతర్జాలం మీదో ఫేసు బుక్కులోనో వదిల్తే చాలు. గొర్రెల్లాంటి జనం పొలోమంటూ వచ్చి పడతారు. అదిగో అలాగే అప్పారావు పండిట్ గానూ, దైవజ్ఞుడిగానూ మారిపోయేడు బ్లాగు మొదలుపెట్టి. ఇందులో ఆయన పోస్టుచేసేవి వరుసగా జరుగుతూ ఉండడంతో అప్పారావుని 'గురువుగారూ’ అని పిలిచే అభిమాన సంఘం ఒకటి మొదలైంది. ప్రతీ పోస్టుకీ 'ఆహా ఓహో' లనడం, బాజా భజంత్రీలు వాయించడం, లైకులు కొట్టడం వీళ్ల పని. అప్పారావు మొదటి జోస్యం - మార్చ్ నెలలో రాబోయే అమావశ్య కి జనం చావడం – ఎక్కడో కాదు కానీ దే

అమెరికాలో యోగీశ్వరుడు – చివరి భాగం

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి (జరిగిన కధ – పరమహంస గారి రెండో అమెరికా ట్రిప్పులో ఓ సర్జన్ గారింట్లో ఆయనకి పాదపూజ ఏర్పాటు చేయబడింది. ఆ పూజ తాలూకు ఫోటోలు సుబ్బారావు ఎప్పటిలాగానే ఎవరి అనుమతులూ అడక్కుండా తన వెబ్ సైట్లో పెట్టేసేడు. అయితే ఎవరికీ తెలియని మూడో పార్టీ, ఆ వెబ్ సైట్లో ఫోటోలు చూసి సర్జన్ గారింట్లో పకడ్బందీగా దొంగతనానికి పూనుకుంది. ఇంట్లో సమస్తం దోచుకోబడ్డాక సర్జన్ గారూ వాళ్ళావిడా లెంపలు వేసుకుని సుబ్బారావు శిష్యరికంలోంచి బయటపడ్డారు. దొంగతనం కేసులో జరిగినది విన్నాక పోలీసులు పరమహంస గారి వెబ్ సైటుని ఒక కంట కనిపెడుతున్నారు. సర్జన్ ని వదిలేసి మిగతా శిష్యగణం పరమహంసగారితోపాటు ఓ రిట్రీటు కి మిషిగన్ రాష్ట్రంలో “గాంగెస్” అనే ఊరికి వెళ్ళడానికి సమాయుత్తమౌతున్నారు. ఇంక చదవండి) రోజులు గడిచి రిట్రీటుకి మరో రెండు, మూడు గంటల్లో బయల్దేరుతారనగా సుబ్బారావుకి ఆ రోజు తనింకా రోజూ వెళ్ళే వాకింగ్ కు వెళ్ళలేదని అర్జెంట