కథా భారతి
గాలిపటం
-G.S.S. కళ్యాణి
సంక్రాంతి పండుగ అనగానే సాధారణంగా అందరికీ రంగవల్లులు తీర్చిదిద్దిన లోగిళ్ళు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కొలువుదీరిన బొమ్మల కొలువులు, చేతికందిన వరి పంటలూ గుర్తుకొస్తాయి. కానీ, మనస్వినికి మాత్రం సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది 'గాలిపటం'!
మనస్విని రెండవ తరగతి చదువుతున్నప్పుడు, వాళ్ళ బడిలోని పిల్లలందరికీ పాఠశాలవారు భగవద్గీత శ్లోకాల పోటీని నిర్వహిస్తే, అందులో మనస్వినికి ప్రథమ బహుమతి వచ్చింది. ఆ ఏడు పాఠశాలవారు తమ వార్షికోత్సవాన్ని ఎప్పటికన్నా ఘనంగా నిర్వహించి, ఆ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల సమక్షంలో మనస్వినికి 'గాలిపటం' అన్న పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. మనస్విని స్టేజీపై అందుకున్న మొట్టమొదటి బహుమతి అది! ఆ రోజు మనస్విని ఆనందంతో ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి ఎంతో ఇష్టంగా చదువుకుంది. అలా ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. లెక్కలేనన్నిసార్లు ఆ 'గాలి
సురాపానం
-ఆర్. శర్మ దంతుర్తి
ఉపన్యాసం ముగించిన ఉరువేల కాశ్యపుడికి తన శిష్యులైన అయిదువందలమంది జటిలుల మొహాలలో ప్రతిబింబించే అసంతృప్తి కనబడుతూనే ఉంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. తనకీ తన తమ్ముడికీ ఉన్న శక్తుల గురించి ఈ శిష్యులకి తెలిసినా, తెరలు తెరలుగా వచ్చే బుద్ధుడి గురించి వినే వార్తలతో వీళ్ళకి తన మీద గౌరవం తగ్గుతున్నట్టే తెలుస్తోంది. తాను కొలిచేది అగ్నిదేవుణ్ణనీ, దానివల్లే కాలనాగుని లొంగదీసుకుని అగ్నిగృహంలో ఉంచగలిగాడనీ తెలిసినా మునుపు ఉన్న గౌరవం ఇప్పుడు లేనట్టుందే?
ఆలోచనల్లో ఉన్న కాశ్యపుడిని శిష్యుడు సాగత స్థవిరుడు అడుగుతున్నాడు, “తధాగతుడు ఇటువైపు వస్తున్నాడని వినిపించింది కదా ఎప్పుడండీ ఆయన వచ్చేది?”
ఉరువేల కాశ్యపుడికి లోపలనుంచి మాత్సర్యం తన్నుకువచ్చింది. ఇన్నేళ్లనుండీ తన దగ్గిరున్న ఈ శిష్యులకి తానంటే నమ్మకం పోతోంది అప్పుడే. ఒక్కసారి బుద్ధుడి గురించి విన్నారు ఎక్కడో, అప్పట్నుండీ, తధాగతుడు రా
ఆనంద దీపావళి
-G.S.S.కళ్యాణి.
"ధనత్రయోదశినాడు నీకు మాహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుట్టింది!", అంటూ మహేశ్వరి చేతిలో అప్పుడే పుట్టిన పాపాయిని పెట్టింది ఆమె తల్లి స్వరాజ్యం.
పాపాయిని మహేశ్వరి ముద్దాడుతూ ఉంటే పక్కనే నిలబడి, "అమ్మా! చెల్లి ఎంత ముద్దుగా ఉందో!", అన్నాడు కిట్టూ.
"ఇదిగోరా కిట్టూ! నువ్వు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న నీ చెల్లి!", అంటూ పాపాయిని కిట్టూ ఒళ్ళో పెట్టింది మహేశ్వరి.
తన చిట్టి చెల్లిని ఎత్తుకుని మురిసిపోయాడు కిట్టు.
"అమ్మా! చెల్లి పేరు చిట్టి!!", మహేశ్వరితో అన్నాడు కిట్టు ఉత్సాహంగా.
"సరేరా! నీ చెల్లిని నీకు ఎలాకావాలంటే అలా పిలుచుకో!", అంటూ కిట్టూని ముద్దు పెట్టుకుంది మహేశ్వరి.
అప్పటినుండీ చిట్టి కిట్టూకి ప్రాణమైపోయింది. కిట్టూ ఏ ఆట ఆడుతున్నా చిట్టిని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. చిట్టి ఎప్పుడైనా కిట్టు చేసిన పనిని చూసి నవ్వుతూ కేరింతలు కొడితే కిట్టూ తెగ సంతోషపడిపోయేవాడు.
కొం
విద్యావికాసం
-ఆదూరి.హైమావతి.
"తాతగారండీ! చూడాండి నా గ్రేడ్ కార్డ్! అన్నిట్లోనూ ఏ + లే. ఇదో ఇంగ్లీష్ ఏ +, మాత్స్ ఏ + , సైన్స్ ఏ + , సోషల్ ఏ + , ఇంకా "అనిచెప్తున్న అన్న ఆనంద్ దగ్గరకొచ్చి అడిగించి చెల్లెలు.
"ఏంట్రా అన్నాయ్! నీకు అన్నిట్లూ ఏ + లేనా!! " అంటూ వచ్చిన చెల్లెలు చామంతిని,
"పోవే చామంటీ !పూబంతీ! నీతో మాట్లాడితేనేసిగ్గు. అన్నిట్లో బీ లే.షేం షేం." అని విదుల్చు కున్నాడు చెల్లెలు చేతిని .
"ఏ + అంటే ఏంటండీ బాబుగారూ !"అంటూ ఇద్దరికీ పాలగ్లాసులుపట్టుకొచ్చిన పనిమనిషి పార్వతి అడిగింది."
"పోపో నీకే తెల్సు? పొట్టపొడిస్తే అక్షరం రాని ఇల్లిట రేట్ వి? నీకు గ్రేడంటే తెలుసా అసలు?పేద్ద అడగొ చ్చింది!"అని పార్వతమ్మ మీద విరుచుకు పడ్దాడు ఆనంద్.
"పార్వతమ్మగారూ ! గ్రేడంటే 90నుంచీ 95 వరకూ మార్కులొస్తే' ఏ గ్రేడ్' అంటారు. 95 నుంచీ వందవరకూ వచ్చినవారిని' ఏ+ 'గ్రేడ్ అంటారు. నాకు ఎప్పుడూ అన్నిట్లో'బి' గ్రేడే వస్తుంది. అంట
విష్ణు మనోగతం
-సముద్రాల హరిక్రిష్ణ
ఎందుకురా, కాని వరాలు ఇస్తారు, నువ్వూ, ఆ శివుడూనూ!!
భూమ్మీద ఏ రాక్షసుడో తపస్సు చేయటం ఆలస్యం,
ఇద్దరూ వాలిపోతారు, ఉన్న పళాన, వరాల సంచి వేసుకొని!!
సరే, వెళ్తే వెళ్లారు! కాస్త ముందూ వెనకా ఆలోచించుకో
నక్కరలేదు, ఆ సంచి విప్పేముందు! వాళ్లకేం పోయింది,
ఇచ్చేవాడుంటే, ఏదైనా అడిగేస్తారు.
ఆ హిరణ్య కశిపుడి కథ ఏమిట్రా, విరించీ, ఏమాలోచించి సరే నన్నావురా, వాడు అడిగిన
అన్నింటికీ!! నువ్వు పుట్టించిన అయిదింట్లో దేనితో, దేనిలో కూడా చావకుండా, ఎటూ
గాని వరం వాడడగటం, నువ్వు తధాస్తు అనటం! బాగుంది నాయనా, చాలా బాగుంది!
ప్రహ్లాదుడు, పసి కూన నన్ని బాధల పడనిచ్చింది ఎందుకనుకున్నావ్?! ఆ వ్యవధిలో,
ఆలోచించి, ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందంటే నమ్ము, నువ్వు ఇచ్చిన వరాన్ని దాటి,
ఆ దైత్యుణ్ణి ఎట్లా అంతం చెయ్యాలా అని ఆలోచిస్తూ!! పాపం పసివాడు నలిగిపోయాడురా,
ఈ లోపల!
చివరకు ఎప్పుడో మధు కైట
చదువుల వెలుగులు
-G.S.S.కళ్యాణి
"భారతీ! ఇదే మన ఇల్లు!", పాతగా ఉన్న ఒక చిన్న పెంకుటింటి చెక్కతలుపును తీసి లోపలికి అడుగు పెడుతూ అన్నాడు సత్యం.
ఏ క్షణానైనా జారిపడేట్టు ఉన్న ఆ ఇంటి పెంకులవంక ఆశ్చర్యంగా చూస్తూ తన బట్టలమూట చంకలో పెట్టుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించింది కొత్తగా పెళ్ళై అప్పుడే కాపురానికి వచ్చిన భారతి!
"నీకు తెలుసుగా భారతీ! నాది టెంపొరరీ ఉద్యోగం! నెలసరి ఆదాయం మనిద్దరివరకే సరిగ్గా సరిపోతుంది! మా పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులేవీ నా దగ్గర లేవు. ఉన్నదాంట్లో సద్దుకుపోక తప్పదు మరి!", అన్నాడు సత్యం.
భారతి సత్యం వంక చూసి చిరునవ్వు నవ్వింది. అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలు కావస్తూ ఉంది. దాదాపుగా ఖాళీగా ఉన్న అక్కడి వంటింట్లో ఒకటిరెండు గిన్నెలు, కొద్దిగా కూరలు మాత్రం ఉన్నాయి. వాటితోనే గబగబా వంట పూర్తి చేసి భోజనాలు వడ్డించింది భారతి. కడుపునిండా తృప్తిగా తిని వెంటనే నిద్రపోయాడు సత్యం.
భారతికి ఎ
మోసం
- ఆర్. శర్మ దంతుర్తి
ఈ కారు కొని పదేళ్ళవుతోంది. ఎప్పుడూ పెద్ద రిపేర్లు చేయించలేదు. ఆ మాటకొస్తే, అసలు వెనక చక్రాల బ్రేకులు గత పది సంవత్సరాలలో రిపేర్ మాట అలా ఉంచి ఎప్పుడూ వాటికేసి చూసి ఎలా ఉన్నాయో చూసిన పాపాన పోలేదు. ముందు చక్రాల బ్రేకులు, రోటార్లు, వెనక చక్రాల షూస్, డ్రమ్స్ ఆఖరికి వాటి సిలిండర్లు, అన్నీ కూడా పాడయ్యాయిట. అయితే తప్పనిసరిగా చేయించాల్సిన ఆయిల్ ఛేంజ్ చేస్తున్నప్పుడు మిడాస్ స్టోర్ వాడు నన్ను కంగారు పెట్టేసాడు, ఈ బ్రేకులు రిపేర్ చేయించకపోతే ఏక్సిడెంట్ అవ్వచ్చనీ, ఇవి చాలా అర్జంట్ గా చేయించాల్సిన పనులనీ. ఆశ చావక ఇంకో మెకానిక్ దగ్గిర చూపించాను. వీడి నోటా అదే మాట.
‘ఆ చూద్దాంలే,’ అని ఊరుకున్నాక అసలు గొడవ మొదలైంది. ఓ రోజు పొద్దున్నే ఆఫీస్ కి బయల్దేరుతుంటే, చలిలో రోడ్డు మీద టైర్లు జారిపోయి బ్రేకులు మొరాయించాయి. పొద్దున్నే చలిలో బయల్దేరాను కదా, ఇంజన్ ఇంకా వేడెక్కకపోతే అలాగే జరుగుతుంద
కరోనా కాలంలో కల్యాణ వైభోగం
-డా.కె.మీరాబాయి
“ మన బంధువర్గం లో మీరే పెద్దవారు. పార్వతీపరమేశ్వరుల లాగా వచ్చి ఆశీర్వదించాలి. ముహూర్తం మధ్యాహ్నం పన్నెడు గంటలకు. పన్నెండున్నరకల్లా భోజనాలు.మా కోసం ఒక గంట సేపు శ్రమ తీసుకోండి. ఒంటిగంటకల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చును.మా అమ్మాయికి మీ ఆశీర్వచనం కావాలి." ఎంతో ఆప్యాయంగా పిలిచి, పెళ్ళి పత్రిక చేతిలో పెట్టి నమస్కారం చేసి వెళ్ళారు పద్మనాభం దంపతులు. కరోనా కాలం అయినా, పెద్దవాళ్ళు అయినా వెళ్ళక తప్పదు. ఎందుకంటే పెళ్ళి మండపం ఇంటికి దగ్గరే కూడా. " ఇంకేం ఆరు నెలలుగా పెట్టెలో గాలి సోకకుండా మగ్గి పోతున్న పట్టు చీర బయటకు తీయవోయ్ " మంగపతి గారి వేళాకోళం. మరీ ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టడం మానేసారేమో మంగమ్మ గారికీ కాస్త ఉత్సాహంగానే వుంది.
పెళ్ళి రోజు రానే వచ్చింది. సుముహూర్తం సమయానికి అక్కడ ఉండాలని తొందరగానే తయారవ్వడం మొదలు పెట్టారు మంగమ్మగారు. ఇంట్లోనే వుండి నైటీలు వేసుకుని అలవాటై, చీర కట్టు
Silicon Andhra Submitted
Corona Virus: How Best We Can Greet Each Other, Safely!
The Corona Virus within the last seven months has brought the whole world to its knees. We need to reassess the classification of the world's economies in the third world, and so on. Take a look at the URL provided at the end of this paragraph. It is time to reframe our approaches to daily living activities, more specifically, how we greet each other. Not only verbally (if mutually understandable language ideally. Other modes do exist, to pick a universal one, symbolic is the handshake. In the contexts of COVID, we need to reduce the communicability of infections. In Parasitology, we are aware that a commensal relationship (in a dormant fashion) exists. The host exists in both animal kingdom and plant life. In regards to the animal w...