కథా భారతి

రంగ్ దే బసంతి

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి ఒకానొక రాజ్యంలో రాజు తెలుపు, ప్రథానమంత్రి తెలుపు, అనుయూయులూ తెలుపే. ప్రజలందరూ తెలుపు. అన్నీ సజావుగా సగిపోతున్న రోజుల్లో ఓ తెల్లవాడు అడవుల్లో వేటకెళ్ళాడు. అక్కడో చిన్న తండా అందులో కొంతమంది మనుషులూ ఉంటే, దాహం కోసం వాళ్ళదగ్గిరకెళ్ళిన ఈ తెల్లవాణ్ణి ఆ తండా మనుషులు వింతగా చూడ్డం మొదలుపెట్టారు. కారణం ఏవిటంటే తండాలో మనుషులందరూ నల్లవాళ్ళు. బావిలో కప్పల్లా బతుకుతున్న వాళ్ళకి మనుషులు తెల్లగా ఉంటారని తెలీదు ఈ తెల్లవాణ్ణి చూసేవరకూ. తెల్లవాడిక్కూడా అదే పరిస్థితి. వీడూ తెల్లబావిలో కప్పే కానీ ఆ నల్లవాళ్లలా ‘నాకూ ఇలా నల్లవాళ్ళు ఉంటారని తెలియదు’ అనే మాట బయటకి చెప్పలేదు. వీడు దాహం తీర్చుకున్నాక వేట చాలించి తన రాజ్యానికికొచ్చి తను చూసిన విషయం తెల్ల రాజ్యంలో చెప్పేసేడు ఇలా తాను నల్ల మనుషులని చూసినట్టు. కొంతమంది నమ్మితే, కొంతమంది నమ్మలేదు. నమ్మనివాళ్లని కొంతమందిని పోగు చేసి తెల్లరాజు ఓ తెల్ల

ఆడది – పుస్తక సమీక్ష

కథా భారతి
*ఉన్నతమైన కధలతో ''ఆడది''* కథ దిన దిన ప్రవర్ధమానమై నిత్యం మన ముందు ఎప్పటికప్పుడు తాజాగా కనిపిస్తూనే ఉంది.. అంటే 1910 లో ప్రారంభమైన కథలకు ఇప్పుడు వస్తున్న కధలకు వస్తువులు ఒకటే. రచించే విధానం లో, ఎత్తుగడలో, ముగింపులో మాత్రం తేడా కనిపిస్తుంది. మనిషి జీవితం లో సమస్యలు మారలేదు. ఆలోచించే విధానం లో మార్పు లేదు. మనం నిత్యం చేసే తప్పుల్ని సరిదిద్దుకోవాలనే తపన లేదు. మనం ఒక తప్పు చేస్తే ఆ ప్రభావం పది తరాల వరకు వినిపిస్తూనే ఉంటుంది. అదే ఒక ఒప్పు చేస్తే ఆ ప్రభావం శాశ్వతంగా నిలిచిపోతుంది అనే ధ్యాస లేదు. అంటే ఆకలి వేసిందంటే ఎదురుగా ఏది ఉంటె అది తినేయడమే. ఇంతకు ముందే తిన్నాము కదా ఇప్పుడు తింటే ఏమవుతుంది అనే ఆలోచనే ఉండదు. అలాగే మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడమే. ఏది అనిపిస్తే అది మాట్లాడేయడమే. ఈ మాటల వాళ్ళ ఎదుటి వారి మనసు ఎంత బాధ పడుతుంది అనే చింతనే ఉండదు. ఒక మాట అయినా, ఏదైనా ఒక చేత అయినా ఏదైనా మనమున్న స్థా

వృద్ధాశ్రమం

కథా భారతి
-యనమండ్ర భానుమూర్తి "నాన్నా! మీరు, అమ్మ పెద్దవారైపోయారు. పదవీవిరమణ చేసి కూడా పది సంవత్సరాలయింది. ఇంకా ఈఇంట్లో ఒంటరిగా ఉంటే ఎలా? నేను అన్నయ్య అమెరికాలో ఉంటున్నాం కదా. అక్కడికి రమ్మని ఎన్నోసార్లు చెప్పినా మీరు రారు. ఎంతసేపు పుట్టిన వూరు, పెరిగిన వూరు అని ఈ కాకినాడ లో ఉంటే, మీ బాగోగులు ఎవరు చూస్తారు." రాత్రి భోజనాలయిన తరువాత, ప్రస్తావన లేవనెత్తాడు రమేష్. జగన్నాధంగారి రెండో కొడుకు రమేష్. మొదటి వాడి పేరు సతీష్. జగన్నాధంగారికి ఒక అమ్మాయి కూడా వుంది. పేరు అనూరాధ. రమేష్, సతీష్ అమెరికాలో వుంటున్నారు. అనూరాధ, అల్లుడు హైదరాబాద్ లో వుంటున్నారు. దసరా పండుగకు అందరూ కలుసుకున్నారు. మిగతా రోజుల్లో కలుసుకోక పోయినా, దసరా పండుగకు మాత్రం ప్రతిఏడూ అందరూ కలుసుకుంటారు. జగన్నాధం ప్రధానోపాధ్యాయుడు గా చేసి పదవీవిరమణ చేసాడు. తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కస్టపడి పైకొచ్చాడు. టీచరుగా అందరిచేత శెభాష్ అ

దెయ్యాలు

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి పెళ్ళైన అయిదేళ్లకి పుట్టింట్లో ముగ్గురు అక్కచెల్లెళ్ళు మళ్ళీ కలుసుకున్నాక అందరికీ ఒకటే ప్రశ్న – గీతకి ఇంకా పిల్లలెందుకు పుట్టలేదో? ఈ ప్రశ్న ఎలాగా ముందునుంచీ అడుగుతారన్నుకున్నదే కనక గీత తయారుగా ఉంచుకున్న సమాధానం – మా ఆయనకి అప్పుడే పిల్లలక్కర్లేదుట, స్వంత కిరాణా కొట్టు ఉద్యోగం కనక పగలూ రాత్రీ పనీ, అదిగాక కొంత కాలం కుటుంబ నియంత్రణ అవలంబిస్తున్నాం. అడిగిందే అడిగాక, చెప్పిందే చెప్పి ఇంక అందరి నోర్లూ మూసుకున్నాక గీత వెనక్కొచ్చేసింది మొగుడి దగ్గిరకి. తన ఇంటికి వచ్చిన రోజు రాత్రి తాను పడుకుందన్నమాటే గానీ నిద్ర లేదు. పక్కన పడుకున్న రమణ కేసి చూసింది – ఆయన నిద్రలో ఉన్నట్టు గురకే చెప్తోంది. మళ్ళీ ఎప్పుడు లేస్తాడో, పొద్దున్నే లేచి ఎప్పుడు పనిలో పడతాడో తెలియదు. పొద్దున్న ఏడునుంచి రాత్రి తొమ్మిది దాకా అలా కొట్లో కూర్చుని సామాను అమ్ముతూ చిల్లర లెక్కపెట్టుకోవడంలోనే ఈయన జీవితం అయిపోతోం

మోడర్న్ జ్యోతిషం

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి ఇన్ కం టేక్స్ డిపార్ట్ మెంట్ లోంచి రిటైరైపోయిన సుబ్బారావుకు మూడు నెలలు గడిచేసరికి ఇంట్లో కూర్చోవడం బోరు కొట్టినప్పుడు, ఇన్నేళ్లలో ఇన్ కం టేక్స్ డిపార్ట్ మెంట్ లో ఉండే పవర్, డబ్బూ, అందులో వచ్చే అదనపు పరపతీ వగైరాల వచ్చిన మనస్తత్వం తో ప్రజల్ని ఎలా దోచుకోవాలా అని ఎదురు చూస్తూంటే అప్పుడొచ్చిందో బ్రిలియంట్ ఐడియా. ఓ వారం బాగా ఆలోచించేడు ఏం చేయాలో. లెక్క చూసుకుంటే ఓ యాభై అరవై వేలు పెట్టి బిజినెస్ పెడితే రోజుకు రెండు, మూడు వేలు లాగవచ్చు – అతి సులభంగా. మహా అయితే మొదటి ఆరు నెలల్లో పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఈ ఆఫీసుకి ముందు ఒక అందమైన రిసెప్షనిస్టూ, తనకో ప్రైవేట్ రూమూ, అన్ని రూముల్లోనూ వీడియో కెమెరాలూ, అసలు సిసలు బిజినెస్ జరిగడానికి పూజామందిరం అనబడే ఓ మెయిన్ రూమూ, అందులో రకరకాల దేవుళ్ళ ఫోటోలూ ఇవన్నీ చూడ్డానికీ, ఓ ఫోను కీ మిగతా అల్లాటప్పా చిల్లర ఖర్చులకి అంతా కలిప్ మొత్తం డబ్

జ్ఞానసంపద

కథా భారతి
“బామ్మా బామ్మా ! ఎక్కడ " అని అరుచుకుంటూ వచ్చింది ఆవని. "ఏం ఆవనీ! ఏదోపని పడ్దట్టూందేనాతో! అందుకే రాగానే స్నాక్స్ కు వెళ్ళ కుండా నాకోసం వచ్చావ్?" అడిగింది బామ్మ. "రేపు మా క్లాస్ లో అసూయను గురించీ, తెలివిని గురించీ కలిపి ఒక కధ చెప్పాలన్నారు మాతెలుగుటీచర్ గారు. బామ్మ ప్లీజ్ చెప్పవా ! " "అసూయా తెలివీ రెండూ కలిపి ఒకే కధా ! బావుంది స్నాక్స్ తిని, పాలు త్రాగిరాపో , ఈలోగా ఆలోచించి పెడతాను" అంటూ ఆవనిని పంపి ఆలో చించసాగింది బామ్మ. ఆవని రానే వచ్చింది.ఎదురుగా కూర్చుని,"ఇహచెప్పుబామ్మా!"అంది. "సరే ఆవనీ! ఒకకధ చెప్తాను. బాగా విను."అంటూ మొదలెట్టింది బామ్మ. ‘ అక్బర్ కొలువులో ఉండే బీర్బల్ చాలా తెలివైనవాడు. చతురుడూ, చమ త్కారి కూడాను.బీర్బల్ ను అక్బర్ చాలా ఆత్మీయంగా చూట్టం, గౌరవించడం, ప్రేమించడం, కానుకలు ఇవ్వడం కొలువులోని మిగతా వారు సహించలేక పోయేవారు.సమయం కోసం కాచుకుని ఉన్నారు. బీర్బల్ మీద చక్రవర్తికి ఏదై

బ్రహ్మ పునః సృష్టి

కథా భారతి
- ఆర్ శర్మ దంతుర్తి ఉమ్మడి ఆంధ్రదేశం విడిపోయాక ప్రథానమంత్రుల వారు గంగాజలం పట్టుకొచ్చి, ఆంధ్రదేశ శంఖుస్థాపన నాడు తనకూడా పట్టుకొచ్చిన మట్టితో సహా దాన్ని కాబోయే రాజథాని నోట్లో కొట్టాక నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళారు. ఆ నవ్వు చూసి డబ్బులు బాగా రాల్తాయనుకుని రాష్ట్ర అమాత్యులవారు రాజథాని నిర్మాణం అట్టహాసంగా మొదలుపెట్టారు. అందులో ఆయన చేసిన మొదటి పని భూసేకరణ కోసం రెండు చేతుల్తో ఓ ఖాళీ చిప్ప పట్టుకుని భిక్షకి బయల్దేరడం. రెండేళ్ళు తిరిగేసరికి భూమి దొరికింది గానీ దానిమీద భవనాలకీ, రోడ్లు వేయడానికీ డబ్బులు లేకపోయాయి. భూదేవి అసలే ఎండలకి తట్టుకోలేక గిలగిల్లాడుతూంటే, మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టూ వర్షాభారం, నిథుల కొరతా మొదలయ్యేసరికి అమాత్యుల వారికేం తోచలేదు. ఈ లోపుల అరాచకం, రాజకీయాలతో రాజ్యం అస్తవ్యస్తం అవుతుంటే ప్రజలు విశృంఖలంగా దోచుకోబడుతున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది రాజకీయనాయకులవల్ల; ప్రజాధనం