అష్టావక్రుడు
అర్చన ఆర్ట్స్ అకాడెమీ (హ్యూస్టన్), శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ, సంయుక్త కథల పోటీ 2019
-యర్రమిల్లి విజయలక్ష్మి
ద్వితీయ బహుమతి పొందిన కథ
హాల్లో నా ఎదురుగా గోడమీద ఎత్తున ఇనుప తీగకు బిగించిన మా తాతగారి నిలువెత్తు తైల చిత్రం వ్రేలాడుతోంది. పక్కనే మా మామ్మది. ఇంకా ఎవరెవరో పూర్వీకులు, కుటుంబ సభ్యుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు తగిలించి ఉన్నాయి. వాటిని చూస్తుంటే నేను పరిష్కరించవలసిన ఇంటి సమస్య గుర్తుకొచ్చింది. దాదాపు వంద సంవత్సరాల క్రితం మా తాతగారు కట్టించిన ఇల్లది. మా తాతగారికి ఇద్దరు మగ సంతానం. మా నాన్న, గోవిందు నాన్న. చిన్నతనంలోనే తల్లినీ, తండ్రినీ పోగొట్టుకున్నాడు గోవిందు. మా తాతగారు అయన తరువాత మా అమ్మ, నాన్న వాడ్ని మాతోనే పెంచారు. చాలా తింగరి తింగరిగా ఉండేవాడు. చదువు వంటపట్టలేదు. ఎప్పుడూ ఊరిమీద తిరుగుతూ ఎవరికే సాయం కావాల్సినా చేస్తుండేవాడు. కన్నవాళ్ళు లేకపోవటం వల్ల అ