కవితా స్రవంతి

కవిత

కవితా స్రవంతి
మాతా గంగా భవానీ శాంకరీదేవి ధర్మ శీలవంతు ధారులే నందరు అల్ప భోగపరులు ఆత్మబంధు దానశీలా జనులు ధన్య మొందినవారు రామపడమె జగతి రాజపధము రామయనుచు నామ రాగ గీత మనగ శిశువు నవ్వు కఠిన శిలలు కరుగు మహిమ లెన్నో దాగె మహిమాన్వితంబగు రామపదమె జగతి రాజపధము రామచరణ స్పర్శ రాతి నాతిగా మార్చె మాట శబరికిచ్చె ముక్తిపధము దనుజుల దునిమాడి ధరణిని రక్షించె రామపదమె జగతి రాజపధము ఘోర పాప దోష కర్మలే మున్నను రామనామ మనిన రాలిపోగ భస్మమగును మనుజ భవబంధవిముక్తి రామపడమె జగతి రాజపధము ***

నేను

కవితా స్రవంతి
- కారుణ్య కాట్రగడ్డ పెదవుల నవ్వుల వెనుక భారమైన హృదయాన్ని మోస్తున్న రెండు పాదాల గాయాలను అనుభవాలుగా మార్చుకుని కొన్ని క్షణాలైన విశ్రమించాలని అలసిన దేహం మనసులోకి జారిపోయి నవ్వుకుంటూనే ఉంది వేదనగా కలల కాన్వాసు పై గీసిన చిత్రం నిశ్శబ్దం ఆలపిస్తున్న సరిగమలు చీకట్లోకి జారిపోతున్న జీవితం వెంటాడుతున్న ఒంటరితనం అంతరంగంలో ఆగని అంతర్యుద్ధం! బాధతో జారుతున్న కన్నీళ్లు బంధంతో ముడి వేసిన సంకెళ్లు అంతర్ముఖంగా ఆగిన పాదాలకు జీవం పోసుకుంటూ నిన్నటి నిస్పృహ నుండి వెలుగును వెతుక్కుంటూ జీవితాన్ని నిర్మించుకోవడంలో ఓటమి గాయాన్ని గుండెలో దాచుకుని గెలుపు దారుల్లోకి ఆశ నిరాశల గాలిపటంలా గమ్యం తెలియని ఒంటరి ప్రయాణం తీరాల మధ్య నిశ్శబ్దం ఘనీభవించినట్టు ఒక్కోసారి మనసు సముద్ర తరంగమౌతుంది పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండని మనసు అలసిన దేహాన్ని కుట్టుకుంటూ అతికించుకుంటూ ఆశల తీరం వైపు అడుగేస్తూ ప్రతి

జీవిత కహానీ

కవితా స్రవంతి
- కారుణ్య కాట్రగడ్డ జీవితంలో ఓ భావమేదో మేఘమైనపుడు గొంతు మధ్యలో ఇరుక్కున్న వెక్కిళ్ళలా కనురెప్పల మాటున దాగిన ఆవేదనల్ని నిశ్శబ్దం లోపల తవ్వుకుంటున్నపుడు.. చిరునామాగా శూన్యాన్నే తీసుకుని నా ప్రస్థానంలో మరో మజిలీ మరో అతిధేయత్వం.... అర్థమే అవసరం లేని బంధంలా మనసులు స్ఖలించుకోవడం మొదలయ్యాక... చీకటి రాత్రుల్లోనూ,పగటి మేఘాల్లోనూ మోసాడు!నా మాటల బరువంతా... మిణుగురు పురుగుల వెలుగుల్లోనూ, రెప్పల కింద చీకటి లోను గుండెలో చేరిన చెమ్మని బరువెక్కిన మనసుతో ఎప్పుడో ఈదేశాడు! మనసు పొగిలినపుడల్లా జీవిత కహానికి కంటిరెప్ప అసూయ పడిందేమో ఆనందమో,ఆర్ద్రమో అర్థం తెలీక! నిన్ను కప్పుకున్న క్షణం నా మనసుకి,నీ ప్రేమకి మధ్య ఇరుక్కున్న క్షణాలన్నీ అసూయ పడాల్సిందే! 'నేన'నే అద్దంలో కూడా నీకు లొంగిపోని క్షణమేది నాకక్కర్లేదన్నప్పుడు... జీవితంలో ఈ క్షణమే శాశ్వతమన్న నీ కళ్ళలోని ఆనందమూ, నాకు దూరంగా వుండలేనన్

ఆ క్షణమొక్కటీ తప్ప

కవితా స్రవంతి
- కారుణ్య కాట్రగడ్డ ఎప్పుడైనా చేతుల్లోకి కాసిని కన్నీళ్లు తీసుకుని చూస్కుంటుంటాను సముద్రమూ నువ్వూ అలలు అలలుగా కనపడుతుంటారు నీ తడిసిన చూపుల్ని ఆకాశంలో ఆరబెట్టుకుంటున్న ఆ క్షణాలే మా కంటి మొనల్లో నిలిచుంటాయి అలసిన ఆకాశం చీకటి ముసుగేసుకుంటున్నట్టు నీ లోపలికి లోపలికి నువ్వు నడవకుండానే జీవితమనే ఆఖరి పేజీల అధ్యాయం రానే వచ్చింది.... కళ్లలోని భారమంత దిళ్ళకెత్తుకున్నాక ఎరుపెక్కిన మనసు పుటలో అర్థం ఆ పసి వయసులో మాకేం ఎరుకని మనసును చదవడమనే మహా ప్రస్థానం నీ నుండే మా ఊపిరి కొసల్లోకి చేరాక కూడా నిన్ను చదవడం మాకో కాల జ్ఞానమే... గడప దాటని నీ మనసు మాటలన్నీ మా రెప్పలకి తగిలినపుడల్లా మా మనసెంత కురిసిందో కనులకేం తెలుసని కష్టాల పాన్పుపై పూల మాలవై మాలో పరిమళాలు నింపిన నీ ఆత్మాభిమానం ముందు మోకరిల్లిన ఆడతనానికే తెలుసు నిండుకుండా నీవు ఒక్కటేనని... కడుపులో దాచుకున్న సముద్రాలను జ్ఞప్తికి తెచ్చుకు

నాన్న

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. అమ్మ పెదవిపై విరిసే నవ్వులో నాన్న, అమ్మ జడలో మురిసే పువ్వులో నాన్న. అమ్మ చీరకట్టులో బెట్టులా నాన్న, అమ్మ నుదిటిపై బొట్టులా నాన్న. అమ్మ కలలకు ఆకారం నాన్న, అమ్మ కళలకు సాకారం నాన్న. అమ్మ కనులలో కాంతి నాన్న, అమ్మ మనసులో శాంతి నాన్న. అమ్మ గుండె ధైర్యం నాన్న, అమ్మ మాట శౌర్యం నాన్న. అమ్మకొచ్చిన మంచిపేరులో నాన్న, అమ్మ చూపే ప్రేమ తీరులో నాన్న. నాన్న లేని అమ్మ అయిపోతుంది సున్నలా, తనని తాను భావించుకుంటుంది మన్నులా.

తెలుగు వెలుగుల స్వాగతం పాట

కవితా స్రవంతి
పల్లవి : ముద్దు ముద్దుల మూట నా తెలుగు మాట మురిసిపోయే పూజ నా తెలుగు పాట వేల యేండ్ల చరిత గలది తెలుగు భాష ఎన్నో అణచివెతలను చవిచూసిన ఆశ నా తెలుగు భాష చరణం : నిజాము పాలనలో నలిగినట్టి భాష అయినా తన అస్తిత్వం వదులుకోని ఆశ పోన్నిగంటి తెలుగన అచ్చతెలుగు భాష మల్కిభరాముడిన కుతుబ్ షాహి పోషించిన భాష నా తెలుగు భాష ||ముద్దు|| చ|| సురవరం ప్రతాపరెడ్డి - గోల్కొండ కవుల సంచిక నన్నయ, తిక్కన, ఎర్రన = రాసిన మహాభారతం సినారె సిరా చుక్క నుండి జాలువారె భాష శ్రీశ్రీ అందించిన జయభేరి రా నా భాష రణభేరిరా నా తెలుగు ||ముద్దు|| చ|| కాళోజి నేర్పినట్టి పలుకుబడల భాషరా సామల, (సదాశివం) యశోదరేద్ది తెలంగాణా యాసరా కందుకూరి, గురజాడ, గిడుగు జనం మాటరా పాల్కుర్కి వారి ద్విపద చందము నా భాషరా సందమామనె తెలుగురా ||ముద్దు|| చ|| జానపదుల జనజాతర - తెలంగాణ నేలరా కళామతల్లి కల్పవల్లి - తెలంగాణ గడ్డరా ఆమరుల త్యాగాలకు - ఊపిరిచ్

అభ్యుదయ మహిళ

కవితా స్రవంతి
సత్యవతి దినవహి విచక్షణ కలిగిన విద్యావంతురాలై ఎల్లచోటులా తన ఉనికిని చాటుతూ అన్నిటా పురుషులతో సరితూగగలనని చూపుతూ సమాజానికి తన అస్తిత్వాన్ని తెలియజేసిన అభ్యుదయ మహిళ దక్షత కలిగిన కార్య నిర్వాహకురాలై శక్తి యుక్తులతో పలురంగాల పురోగమిస్తూ తానెవ్వరికంటే తక్కువ కాదని నిరూపిస్తూ సంఘంలో తన స్థానాన్ని ఉన్నతంగా నిలుపుకున్న అభ్యుదయ మహిళ క్షమత కలిగిన గృహ నిర్వాహకురాలిగా సహజ సిద్ధమైన సౌమ్యత , సౌశీల్యతతో ఇంటా బయటా కార్యసాధకురాలిగా రాణిస్తూ సమస్త స్త్రీ జాతికే తలమానికమై నిలుస్తున్న అభ్యుదయ మహిళ కుశాగ్ర బుద్ధి కలిగిన నారీ మణిగా ఎల్లరి మన్ననను మెప్పును పొందుతూ రాజనీతిలో చాణుక్యుడిని మించిన కౌశలం కనబరుస్తూ ఉత్తమ ప్రజా నాయకురాలిగా ప్రశంశలు అందుకుంటున్న అభ్యుదయ మహిళ అధ్భుత ప్రతిభా పాటవాలతో శాస్త్రవేత్తగా , వ్యోమగామిగా రోదశీయానంలో సౌరమండలమున పాదము మోపి వచ్చి అసాధ్యమైనది సాధించి ఉన్నతికి హద్దులే

సంయుక్తాంధ్ర సాహిత్య క్షేత్రం

కవితా స్రవంతి
రచన: విద్వాన్ శ్రీమతి జి సందిత, అనంతపురము (సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత) తెలుగురాష్ట్రాన్నెవరో ముక్కలు చేశారంటారేంటి? కళ్ళుంటే చూడండి.... రాష్ట్రాన్నేలే ఏలిక తెలంగాణా చంద్రన్న గురువుపాదంపై నుదురానించి మ్రొక్కి... రాష్ట్రాల్నేకాదు ఉత్కృష్టాంధ్రభాషాప్రపంచాన్నే ఏకంచేస్తున్నాడిక్కడ! నన్నయాదికవుల్ని ఈ ఏడాదికి బ్రతికున్న కవులతో కలిపి పరభాషా వ్యామోహపు పులికి బలియైపోతున్న తెలుగులిపిని కోట్లాదిగుండెల్లో నిలిపి పలికించి .. తెలుగుతల్లి పలుకుల్ని విలువల్ని బ్రతికిస్తున్నాడిక్కడ! ప్రజాసమస్యల్ని పరిష్కరిస్తూనే ఆకాశవాణి హైద్రాబాద్సాక్షిగా తెలుగుసమస్యాపరిష్కారాల్ని సంధిస్తున్నాడిక్కడ ! స్వార్థంకోసం ఆస్తులకోసం అన్నదమ్ములే శత్రువులై దాయాదుల్ని చంపుకునే .... కురుక్షేత్రాన్నికాదు తెలుగుకోసం ..భాష అస్థిత్వం కోసం సోదరులందరెేకమై ఆత్మీయతల్ని

తెలుస్తుందా..?!

కవితా స్రవంతి
-దేవనపల్లి వీణావాణి ఎడిటర్ గారికి నమస్సులు.. నేను వ్రాసిన " తెలుస్తుందా...?" కవితను సుజన రంజని కొరకు అందజేయుచున్నాను... ఈ కవిత యొక్క ఉద్దేశ్యం... భక్తి ముసుగులో తోటి మనుషుల మీద జరుగుతున్న దాడి. అదిగో..అక్కడ .. జనసంద్రంలో.. తామర తూళ్లూ, తాటి పళ్ళూ, ఇప్ప పూలూ, రెల్లు పరకలు.. కపోతాలు, కాకులు బకాలు...,సీతాకోకలు... చరిత్ర దిద్దిన చిత్రిక... రంగు పూల పొత్తి...! ఇప్పుడు... వదులైన కుంచెలా విడివడ్డ దారాలు..! మెదళ్లను విధికి దేహాల్ని వీధులకీ విసిరేసి వెలుగు మొహం తెలియని గబ్బిలాళ్లలా తోడేళ్ళ పొదివి మీద వేలాడుతున్నాయ్...! చిన్న వానకే దీపానికి ముసురుకున్న ఉసుల్ల పుట్టలా అర్థం కాకున్నా ఎగురుతున్నాయ్...! తినడానికే పెంచుకున్న కోడిపిల్లలై గొఱ్ఱె దాటుడు నేర్చుకున్న కప్పల్లా పాముల గూటికి పరుగెడుతున్నయ్...! ఎప్పుడు తెలుస్తుందో బతుకు నిచ్చెఁ మెతుకు గొప్పదని మట్టిని మెతుకు చేసిన చెమట గొప్ప