కవితా స్రవంతి

అతనిప్పుడు

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. అతనిప్పుడు మహావృక్షమే కావచ్చు కానీ, ఒకప్పుడు నేలలో... విత్తుగా నాటబడినప్పుడు ఎన్నో ప్రతికూలాలను ప్రతిఘటించేడు. ఎన్నో పరివర్తనలను ప్రతిబింబించేడు. వంచన,వంచినతల ఎత్తనీయకుండా చేస్తుంటే ఆ అవమానంతో కుమిలి కుంచించుకు పోయేడు ముంచిన అల మరలా లేవనీయకుండా చేస్తుంటే ఆ అహంకార ఆధిపత్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేడు. తన ఊపిరిని, ఉనికిని నిలబెట్టుకోవటమే అప్పటి అతని ఏకైక ధ్యేయమయ్యింది.. అయోమయం, అతని జీవితంలో సహజంగా ఒక అధ్యాయం అయ్యింది. ఒదుగుతూనే ఎదగటం అతనికి ఒక ఆటఅయ్యింది. ఎగ ఊపిరితోనే ఎగరటం అతనికి పరిపాటి అయ్యింది. మొక్కదశ నుండి చెట్టుగా మారటం, అతనికి మహా యజ్ఞమయ్యింది. అలాంటి చెట్టుదశనుండి చేవతో వృక్షంగా మారటానికి అతను మహా ప్రళయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇనా, ఇప్పటికీ అతను గతాన్ని మరువడు. ఎప్పుడూ బేలతనానికి వెరువడు. అతనిప్పుడు ఎందరికో ఒకపాఠం అయ్యేడు అత

తెలుసా?

కవితా స్రవంతి
-పారనంది శాంతకుమారి చీకటే నీకు వెలుగును అందిస్తోందని దుఃఖమే నీపై సుఖాన్ని చిందిస్తోందని ఓటమే గెలుపును నీ ముందుంచుతోందని పతనమే నిన్ను పైమెట్టుకు చేరుస్తోందని తెలుసా? ఓరిమే నీకు కూరిమిగా కలిసొస్తోందని చెలిమే నిన్ను బలిమిగా చేరుతోందని సహనమే నీకు సంపదగా మారుతోందని ప్రేమయే నిన్ను పరిమళమై చుట్టుకుంటోన్దని తెలుసా? శ్వాసయే నీ ఆశను కదిలిస్తోందని నిజాయతీవే నీకో రాయతీని కల్పిస్తోందని నిబద్దతే నీ భద్రతై బ్రతుకునిస్తోందని తెలుసా? ***

రామప్ప దేవాలయం

కవితా స్రవంతి
- అమరవాది రాజశేఖర శర్మ ఘనమైన రామప్ప దేవాలయం మన రామలింగేశ్వరుని ఆలయం నాటి చరితకు ఋజువు మేటి కళలకు నెలవు కోటి కాంతుల కొలువు తేట తెలుగుల పరువు సాటిలేదనిపించి పాటిగా చాటించి దిటవుగా కీర్తి నల్దిశలు పలికించినది కాకతీయులరేడు రేచర్ల రుద్రుడు లోకప్రశస్తిగా కట్టించె నీ వీడు లోకైకనాథు సుశ్లోక నామము గాక శ్రీకరమ్ముగ నిలుపుశిల్పి పేరున వెలుగు ఎత్తైన పీఠికన ఏలికల శైలిగా చిత్తరపు నక్షత్ర చిత్రమై నిలిచింది చిత్తములనలరించు శివలింగ రూపము చిత్తినొసగగ నునుపు శిలలాగ వెలిసింది మండపము స్తంభములు మెండైన ఇతిహాస దండి శిల్పాలతో ధన్యులను గావించు నిండైన రమణీయ నాగిని మదనికల అందాల శిల్పములు నలరించనలరింది ఏవైపు నిలిచినా మనవైపు గనునను భావమై ఆ నంది ప్రాణమై నిలిచింది చెవిని రిక్కించి ఈ భువిని అడుగును నిలిపి శివుని ఆనతి కోరి చిత్రమై తోచింది జలముపైనను దేలు బలముగల ఇటుకలను అల కోవెలను గట్ట వెలయించినారట అల

ఏం చేస్తుంది?

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. పుట్టగొడుగుల్లా పండితులు పూటకొక్కరు పుట్టుకొస్తుంటే, టీవీలలో ఠీవిగా కనిపిస్తూ, పోటీలుపడి మరీ ప్రసంగాలు పెట్టించుకుంటుంటే, పసలేనితనాన్ని పట్టెనామాలవెనుక దాచుకొని, పనికిరానితనాన్ని రూపుమాపుకోవటానికి, పైసల సంపాదనే పరమార్ధంగా చేసుకొని, ప్రజల మనసులను మభ్యపెడుతుంటే, ఆలకించేవారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అనంతంగా అజ్ఞానులిలా అవతరిస్తుంటే, సుజ్ఞానులు సుంతైనా శ్రద్ధచూపక మౌనాన్ని అభినయిస్తుంటే, విజ్ఞానులు వీటన్నిటినీ వింతనుచూసినట్లు చూస్తుంటే, ఆధ్యాత్మికం అపహాస్యం పాలుకాక ఏమౌతుంది? అసలు తత్త్వం అంతర్ధానమవక ఏం చేస్తుంది?

మువ్వగోపాల

కవితా స్రవంతి
రచన—తమిరిశ జానకి నీ మురళిపాటకై వేచియున్నాను వేగిరము రావేల వెతలు బాపంగ నీ సొగసు కనుటకై కాచియున్నాను కమలనయన ఇటు కనుపించవేల నీ మురళిపాటలో నెమ్మది దొరికేను నీ సొగసుకాంతిలో శక్తి కలిగేను పూలబాటగా నా బ్రతుకు సాగిపోయేను గడియ గడియకూ భ్రమ కలిగించెను ఎండుటాకుల గలగల నాకు నింగిలో తారకలు నను చూచి నవ్వేను పొగడచెట్టు నను పలుకరించేరీతి పొందికగ నాపైన పువ్వులను రాల్చేను ఇటువింటి నీ కాలిమువ్వలసడి అటువింటి నీ వేణుగానమ్ము ఎటు చూచిన కానరావు వేధించకయ్య నను బాధించకయ్య వేగిరము రావయ్య వేణుగోపాల మురిపించబోకు మరి మువ్వగోపాల ! తమిరిశ జానకి

జన్మ దినోత్సవం

కవితా స్రవంతి
- అరాశ (అమరవాది రాజశేఖర్ శర్మ) ఫోమును ప్రెస్ చేసి మోమంత చల్లేసి                కంపును కొంపంత నింపుతారు క్రొవ్వొత్తులంటించి రివ్వుననూదుచు               నోర్పుగా దీపాల నార్పుతారు కేరింతలనుగొట్టి కేకును ఖండించి               క్రీము ఫేసులకద్ది గెంతుతారు సరదాలు పండించ సఖులంత వరుసగా               వీపుపై గ్రుద్దులు మోపుతారు పిచ్చి కేకల బొబ్బల రెచ్చిపోయి గాలి బుడగల పిన్నుతో కూలదోసి అల్ల కల్లోల భావన నల్లుతారు జన్మ దినమను పర్వమున్ జరుపువేళ దేహమునిచ్చి పెంపుగొన దీవెనలిచ్చి సరాగమున్నిడన్ స్నేహితులై చెలంగి మది చింతలెరుంగని సౌఖ్యమిచ్చు స మ్మోహన దేవతల్ గనగ మోదమగున్ తలిదండ్రులన్న దా సోహమటంచు జన్మదిన శోభనమున్ ప్రణమిల్ల సౌఖ్యమౌ వందనమిదె గొనుమా గో విందా యని కోవెల జని వేడుక తోడన్ బృందా విహారిని జనన పుం దినమున గన్న యమిత పుణ్యంబబ్బున్ వృద్ధ జనులకు సేవ సమృద్ధినిచ్చు అర్థికోటికి సహకారమర్

ఆచారం -విచారం

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. ఆచారం వేరు, విచారం వేరు. ఆచారం సంప్రదాయానికి సంబందించినది, విచారం విజ్ఞానానికి అనుబంధించినది. ఆచారానికి మూలం నమ్మకం, విచారానికి మూలం విశ్వాసం. ఆచారంతో ఆధ్యాత్మికం మొదలవుతుంది, విచారంతో ఆధ్యాత్మికం అంతమౌతుంది. ఆచారానికి మూడత్వం జతపడితే అజ్ఞానిగా మారుతాం, విచారానికి వేవేకం తోడవుతే జ్ఞానుల లిస్టులో చేరుతాం. ఆచారం మనసును శుద్ధం చేయటానికి, విచారం మనసును మేల్కొలపటానికి. ఆచారం సాధన ద్వారా దేవుని తెలుసుకోమంటుంది, విచారం చివరకు నీవే ఆదైవమని తెలుసుకోమంటుంది. ఆచారం ప్రధమ దశలోని సాధన, విచారం అంత్య దశలోని శోధన. ఆచారం నది లాంటిది, విచారం సంద్రం లాంటిది. ఆచారానికి అజ్ఞానం నీడలా ఉంటుంది, విచారానికి విజ్ఞానం తోడుగా ఉంటుంది. ఆచారం నమ్మి పాటించమంటుంది, విచారం తెలుసుకొనిపాటించమంటుంది. ఆచారం కళ్ళు మూయిస్తుంది, విచారం కళ్ళు తెరిపిస్తుంది. ఆచారంలో వికారము

కదలి వచ్చెను గంగ

కవితా స్రవంతి
నాగలక్ష్మి N. భోగరాజు (జూన్ 20 'దశ పాప హర గంగ దశమి ' సందర్భంగా) ఈ సంవత్సరం(2021) జూన్ 20 వ తారీఖుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు జ్యేష్ఠ శుద్ధ దశమి. దీనిని ‘దశపాపహర గంగా దశమి’ అని అంటారు. ఆ రోజు ఎంతదూరాన ఉన్నవారైనా గంగను ఒక్కసారి స్మరించడంవల్ల, వారికున్న పదిరకాల పాపాలు తొలగిపోతాయనీ, తద్వారా వారికి పుణ్యం లభిస్తుందనీ ప్రతీతి! అటువంటి ప్రత్యేకత ఉన్న ఆ పర్వదినం సందర్భంగా, కాశీ క్షేత్రంలో గంగానది ఒడ్డుపై కూర్చుని నేను రాసినటువంటి ఈ పాటను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను! కదలి వచ్చెను గంగ కరుణాంతరంగ మన పాపములు వడిని కడగంగ హిమగిరులు దాటుకొని ఉపనదులు కలుపుకొని సాగరమును చేరుకొను సందడిగ గంగ ||క|| విష్ణు పాదమునెటులవీడిందో శివుని శిరమున నాట్యమాడిందో భువిపైన మన పాప భారములు తొలగించి పాతాళమునకెటుల చేరిందో త్యాగమే రూపమౌ ఈ గంగ ముల్లోకములనెవరుసరిలేరనంగ|| క|| అల భగీరథుని కోరికను మన్నించి ఇలపైన