ప్రతి మనసూ కోరుతోంది
-జానకి తమిరిశ
కాలమెందుకో పగబట్టింది
కరోనా రూపంలో కలకలం తెచ్చింది !
లేదులేదు కాలానికి పగలేదు మనిషిమీద
పాఠాలు నేర్పుతుంది పరీక్షలు పెడుతుంది అంతే !
నేర్చిన పాఠాలు బుర్రకెక్కించుకోక
తిక్కవేషాలు వేస్తూ మనిషి
సమగ్రమైన పంధాలో ఆలోచనారీతి సాగించక
తనకి తనే వేసుకుంటున్నాడు శిక్ష !
తప్పించుకునే మార్గం కూడా
చూసుకోవాలి మరి తనే
ప్రకృతినొక్కటే తాను జయించలేనని
అనుకున్నాడు ఇన్నాళ్ళూ
కాదుకాదు నేనూ ఉన్నానంటూ ముందుకొచ్చింది కాలం !
కాలానికీ ప్రకృతికీ మధ్య ఊగిసలాడుతున్న మనిషి
తన ముంగిట వెలిగించుకుంటున్నాడు ఆశల దీపాలు
కరోనాని తరిమెయ్యగలమన్న ధీమాతో !
ఔను ఆత్మవిశ్వాసమే అతి పెద్ద ఆయుధం
అది ఉంటే విజయం తధ్యం అపజయం బలాదూర్ !
పెదవుల్లో వాడిపోయిన నవ్వులు
మళ్ళీ పువ్వుల దొంతరలవ్వాలని ఆరాటపడుతున్నాయి
నియమనిబంధనల పరిమళాలతో !
తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న
వైద్య సిబ్బందీ ప్రభుత్వవర్గాలు