మనబడి

మనబడి వార్తలు

మనబడి
ఉత్సాహభరితంగా మనబడి పిల్లల నాటకోత్సవం సిలికానాంధ్ర మనబడి బాలల నాటకోత్సవం అనే మరో అద్భుతానికి తెరతీసింది. ప్రవాస బాలలకు తెలుగు నేర్పించడమే కాకుండా మన సంస్కృతిని అలవరిచే క్రమంలో మరో అద్భుత ఆవిష్కరణ ఇది. ఎంతో ప్రఖ్యాతమైన నాటిక అనే కళాప్రక్రియను బాలలకు పరిచయం చేయడం ద్వారా, ఆ ప్రక్రియ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందనే ఉద్దేశ్యంతో ఉన్న మనబడి విద్యార్ధులకు ఈ నాటిక పోటీలు నిర్వహించింది. ముందుగా ప్రాంతాల వారిగా ఆన్ లైన్(అంతర్జాలమాధ్యమం) ద్వారా వచ్చిన నాటికలను పరిశీలించి, జాతీయపోటీలకోసం క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పీటస్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్ధి బృందాలను ఆహ్వానినిచింది మనబడి. మిల్పీటస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలోని వేదికపై వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మనబడి విద్యార్ధి బృందాలు చేసిన నాటక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముద్దు ముద్దుగా వారు పలుక

సిలికానాంధ్ర మనబడి దశాబ్ది వేడుకలు

మనబడి
నమస్కారం! పదేళ్ళ క్రితం, ఏప్రిల్ 2007లో, ఒక కలకి అంకురార్పణ జరిగింది. ఒక మహాయజ్ఞానికి తొలి సమిధ వెలిగింది. ఒక నలుగురి భాషాభిమానుల గుండెల్లో ఒక సంకల్పం కలిగింది. మన పిల్లలతో పాటూ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందిరి పిల్లలకీ తెలుగు నేర్పే మార్గం కావాలి అన్న ఆలోచన రేకెత్తింది. ఆ నలుగురి గుండెల అభిలాష నేడు, ఎన్నో కుటుంబాలలో,వారి వంశాలలో తెలుగు వెలుగయ్యింది. ఆ వెలుగుని పంచే కాంతిపుంజం "మనబడి" అన్న పేరుతో పదేళ్ళ క్రితం పుట్టింది. జగమంత తెలుగు కుటుంబంగా, తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో సాగే సిలికానాంధ్ర క్షేత్రంలో ఒక మహావృక్షానికి బీజం పడింది. అలా విరిసిన మొలకకి  పాదు కట్టి, ఎరువు పెట్టి , నీరు పెట్టి  పెంచారు, ఎందరో భాషాసైనికులు. వారి సేవానిరతికి ప్రతీకగా, ప్రతి ఏటా ఊరూరా ఈ మనబడి అనే అక్షరవృక్షాలు వెలుస్తున్నాయి.వందల కొద్దీ మనబడి కేంద్రాలు తెలుగు నందనవనాలై, తెలుగు సంస్కృతికి ప్రవాస భా
మనబడి పిల్లల నాటకోత్సవం

మనబడి పిల్లల నాటకోత్సవం

మనబడి
సిలికానాంధ్ర మనబడి ప్రతియేటా నిర్వహిస్తున్న 'మనబడి సాంస్కృతికోత్సవం'లో ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి ఈ సంవత్సరం 'పిల్లల నాటకోత్సవం' ప్రవేశపెడుతున్నది. అమెరికాలో నున్న మనబడి విద్యార్థులందరు ఈ పోటీలో పాల్గొనవచ్చును. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ఉంటాయి. వివరాలకు ఈ కింది లంకెను సందర్శించండి. ManaBadi Drama Festival - SiliconAndhra Manabadi మనబడి విద్యార్ధుల శ్రీ కృష్ణ రాయబారం నాటకం - కాలిఫోర్నియా