సారస్వతం

తాపీ ధర్మారావు గారు

సారస్వతం
*శారదాప్రసాద్ * తాపీ ధర్మారావు గారు తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు .తన కాలానికి కన్నా ముందు ఆలోచనలతో వర్ణాంతర వివాహాలు, దండల పెళ్లిళ్లకు అప్పట్లోనే పురోహితుడు ఈయన . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.ధర్మారావు గారు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం )లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు.వారి ఇంటి పేరును గురించి వారే ఈ విధంగా చెప్పారు --- "మా పూర్వీకుల ఇంటి పేరు బండి వారో, బండారు వారోనట! సైన్యంలో సిపాయిలుగా ఉంటూ, సైన్యం నుంచి విడుదలై వచ్చాక ఏదో పని చేసుకొనేవారట. మా తాతయ్యకు ముత్తాత లక్ష్మయ్య వాళ్ళ ఊళ్ళో (శ్రీకాకుళం) తాపీ పనిలో బాగా పేరు తెచ్చుకున్నారట. కొడుకూ, కూతురూ చనిపోవడంతో తన దగ్గర పెరుగుతున్న మనుమణ్ణి లక్ష్మయ్య బడిలో వేసినప్పుడు ‘తాపీ లక్ష్మయ్య మనుమడు అప్పన్న’ అని

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య ఈ కీర్తనలో గాలి వీచే పద్ధతులను, మనకు ఏ ఏ ప్రదేశాలలో వీచేగాలి యింపుగా ఉంటుందో ఆ అనుభవాలను చెబుతున్నారు. మనం గమనించినట్లైతే వాస్తుశాస్త్రం ప్రకారం వీచే గాలి ఆధారంగా గాలి ఏ వైపు నుంచి ఇంట్లోకి వస్తే ఏ విధంగా ఉంటుందో తూర్పు నుంచి వచ్చే గాలి శరీరాన్ని తాకిన వెంటనే మధురానుభూతి కలుగుతుంది. అందుకే తూర్పు దిక్కున అధికంగా ద్వారాలు, కిటికీలు ఏర్పాటు చేయాలి అనేది వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే తూర్పు నుంచి వీచే గాలి వల్ల ఎక్కువ దాహం వేస్తుంది. అందుకే తూర్పున నీటిని అందుబాటులో ఉంచుకోవడం శ్రేయస్కరం అన్నారు. పశ్చిమ దిశ నుంచి వీచు గాలి శరీరానికి వేడిని కలుగజేస్తుంది. అందుకే పశ్చిమాన కిటికీల సంఖ్య, ద్వారాల సంఖ్యను కుదించారు. ఉత్తరం నుంచి వీచే గాలి చల్లగా ఉంటుంది. ఇది శరీరంలోని ప్రతి భాగాన్ని తాకినప్పుడు శరీరపుష్టిని కలుగజేస్తుంది. అందుకే ఉత్తరంలో ఎక్కువగా కిటికీలు, ద్వారాలు

మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు

సారస్వతం
జ్యోతిష విజ్ఞాన భాస్కర బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు -శారదాప్రసాద్ ​సుప్రసిద్ధ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ మధుర కృష్ణ మూర్తి శాస్త్రి 06-04-2016 న మధ్యాహ్నం కన్నుమూసారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామంలో 1928 ఫిబ్రవరి 28న మధుర వెంకయ్య , శచీదేవి దంపతులకు జన్మించిన కృష్ణమూర్తి శాస్త్రి 8వ తరగతి వరకు ఇంగ్లీషు చదువుకున్నారు.1948 లో వివాహం చేసుకున్న ఈయన గారి భార్య పేరు శ్రీమతి మహాలక్ష్మి గారు. వీరికి ఇద్దరు కుమారులు , నలుగురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణమూర్తి శాస్త్రి గారి పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు సి. ఎ పూర్తిచేసి, విశాఖలో చార్టర్డ్ ఎక్కౌంటెంట్ గా స్థిరపడ్డారు. రెండవ కుమారుడు పాలశంకర శర్మ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 1940 నుంచి 42 వరకు శ్రీ పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి (పిఠాపురం) దగ్గర పంచకావ్యాలు, వ్యాకరణ శాస్త్రం కౌముది కొంతవర

చిరంజీవి శంకరశాస్త్రి

సారస్వతం
-శారదాప్రసాద్ జె.వి. సోమయాజులు గారు తెలుగుప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలన్నింటిలో నటించాడు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. జె.వి. సోమయజులు 1928 జూన్ 30 వ తెదీన శ్రీకాకుళం జిల్లా , లుకలాం అగ్రహారం గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు. ఈయన సోదరుడు చలన చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి. రమణమూర్తి. ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు విజయంనగరంలో మహారాజా కళాశాలలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు.తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. జె.వి.సోమయాజులు తన పదహారవ ఏట నుంచి రంగస్థల నటనపై కాంక్ష పెంచుకున్నారు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి

చాటు కవిత్వం

సారస్వతం
-*శారదాప్రసాద్ * చాటువులు కవి ఆశువుగా ఏదో ఒక సందర్భంలో చెప్పిన చక్కని పద్యాలు.చాటు పద్యాన్ని చెప్పేటప్పుడు కవి మిగిలిన కవితా విశేషాలు పెద్దగా పట్టించుకోడు. చాటు పద్యానికి కవితా వస్తువు ఏదైనా కావచ్చు. "చాటు" అంటే ప్రియమైన మాట అని అర్ధం చెప్పుకోవచ్చు. చాటు పద్యం చెప్పేటప్పుడు దాన్ని ఎందుకు, ఏ సందర్భంలో చెప్పవలసి వచ్చిందో చెబితే కాని ఆ పద్యం యొక్క విశేషం తెలియదు."పరమేశా!గంగ విడువు పార్వతి చాలున్" అన్న చాటు పద్యంలో, పల్నాటి సీమలో దాహంతో ఉన్న శ్రీ నాధుడు ఆశువుగా ఆ పద్యాన్ని చెప్పాడు అని చెబితే గాని ఆ పద్యంలోని సొగసు తెలియదు. ఒక సారి శ్రీనాధ కవి దరిద్ర బాధ తట్టుకొనలేక, మిక్కిలి కష్టములు అనుభవించే వేళలలో తనను ఒక భోగపు దానిగా సృష్టించిన బాగుండేదని ఈ విధంగా వాపోయాడు-- కవితల్ సెప్పిన,బాడనేర్చిన వృధాకష్టంబే యీ భోగపుం జవరాండ్రె కద భాగ్యశాలినులు పుంస్త్వంబేలపో పోచకా సవరంగా సోగాసిచ్చి మేల్ యువతి

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-  టేకుమళ్ళ వెంకటప్పయ్య చెలియమోము చూడరమ్మా ఇది ఒక శృంగార సంకీర్తన. అన్నమయ్య, చెలులలో ఒకచెలికత్తెగా మారి అమ్మ అలమేలు మంగమ్మ ముఖసౌందర్యం చూడమంటున్నాడు. అమ్మ బాహ్యప్రపంచంలో ఇక్కడ ఉన్నప్పటికీ ఆమె చిత్తమంతా శ్రీవేంకటేశ్వరుని మీదనే అని సరదాగా వేళాకోళమాడుతూ పరామర్శిస్తున్నాడు. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: చెలియమోము చూడరమ్మా చెలియమోహము నేఁడు చెలుల కగ్గలమాయ ॥పల్లవి॥ చ.1.చిత్త మాతని మీఁద చేయి చెలియ మీఁద కొత్తెన గమనంబు కొన వేళ్ల మీఁద తత్తరపుఁ దాపంబు తనువల్లి మీఁద బిత్తరపుఁ గోపంబు ప్రియ సతుల మీఁద ॥చెలియ॥ చ.2.అలపులును సొలపులును అంగజుని మీఁద తలపంత యెడ లేక దైవంబు మీఁద పలుకులును బంతములు ప్రాణంబు మీఁద తెలుపులును తెగువలును దీమసము మీద ॥చెలియ॥ చ.3.ఇంపు సొంపులు వేంకటేశ్వరుని మీఁద గుంపైన చందురులు కుచయుగము మీఁద కెంపుఁ గనుగవచూపు గిలిగింత మీఁద దంపతుల పరిణతుల

అన్నమయ్య శృంగార నీరాజనం మార్చ్ 2020

సారస్వతం
జానామ్యహంతే సరసలీలాం -టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇది ఒక శృంగార మధురభక్తి సంకీర్తన. అన్నమయ్య ఒక నాయికగా మారి ఈ శృంగార సంస్కృత కీర్తనలో స్వామిని ఎలా వేళాకోళం చేస్తున్నాడో, ఎలా దెప్పిపొడుస్తున్నాడో చూడండి. నాయకుడైన శ్రీనివాసుడు నాయిక వివిధ ప్రశ్నలకు సమాధానం ఏమిచ్చాడో తెలీదు. ఆయన ప్రత్యుత్తరాలకు కినుక వహించిన నాయిక స్వామిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నాయిక ఖండిత అనవచ్చు. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: జానామ్యహంతే సరసలీలాం నానావిధ కపటనాటక సఖత్వమ్ ॥పల్లవి॥ చ.1 కిం కరోమి త్వాం కితవ పరకాంతాన- ఖాంకురప్రకటన మతీవ కురుషే శంకాం విసృజ్య మమసంవ్యాన కర్షణం కింకారణమిదం తే ఖేలన మిదానీం ॥జానా॥ చ.2 కిం భాషయసి మాం కృతమానసతయా డాంభికతయా విట విడంబయసి కిం గాంభీర్యమావహసి కాతరత్వేన తవ సంభోగ చాతుర్య సాదరతయా కిం ॥జానా॥ చ.3 కిమితి మామనునయసి కృపణ వేంకటశైల- రమణ భవదభిమతసురతమనుభవ ప్రమదేన మత్ప్రి

కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారు

సారస్వతం
-శారదాప్రసాద్ సాహితీ స్రష్టల్లో నోరి నరసింహశాస్త్రి గారు సుప్రసిద్ధులు. కవిగా, కథకునిగా, నవలాకర్తగా, విమర్శకునిగా, పరిశోధకునిగా బహుముఖీనమైన పాత్ర పోషించి తనదైన ప్రత్యేక బాణిలో తమ వాణిని వినిపించారు ఆయన. నోరి నరసింహశాస్త్రి గారు 6-2-1900 న మహాలక్ష్మమ్మ, హనుమచ్ఛాస్త్రి. దంపతులకు గుంటూరులో జన్మించారు. నోరివారి వంశము శిష్టాచార సంపదలో పేరుమోసినది.నరసింహశాస్త్రి గారి తండ్రి హనుమచ్ఛాస్త్రి గారు గుంటూరు "మిషను కళాశాల"లో సంస్కృతాంధ్రాధ్యాపకులు. వారి తండ్రి గోపాల కృష్ణయ్యగారు మంత్రశాస్త్ర కోవిదులు. అటువంటి గొప్ప వంశంలో నరసింహ శాస్త్రి గారు పుట్టారు. వీరి పినతండ్రి గురులింగశాస్త్రి గారు చెన్నపురి తొండ మండలము హైస్కూలులో పండిత పదవిలో ఉండేవారు. వ్యాకరణము, వేదాంతము, జ్యోతిషము, మున్నగు శాస్త్రములలో వీరిది గట్టిచేయి. తెలుగు వచనములో అనేక పురాణాలు వ్రాసారు. శ్రీ నరసింహశాస్త్రిగారు ఆంధ్రకవులలో సంప్రదాయ సిద

అన్నమయ్య శృంగార నీరాజనం ఫిబ్రవరి 2020

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య చెప్పరాదీ యింతి సిరులు అన్నమయ్య శ్రీ వేంకటనాధుని దేవేరి అందచందాలను వివరిస్తున్నాడు. ఆమె వంటిపై ధరించిన ఆభరణాలను సరససృంగార రసభరితంగా వర్ణిస్తున్నాడు. ప్రబంధశైలిలో సాగిన ఈ కీర్తన తరువాతి తరాల కవులకు మార్గదర్శకమై ఉండవచ్చు. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: చెప్పరాదీ యింతి సిరులు - దీని- వొప్పులిన్నియుఁ జూడ వొరపులో కాని ॥పల్లవి॥ చ.1 ముదితజఘనముమీఁది మొలనూలిగంటలవి కదలు రవమెట్లుండెఁ గంటిరే చెలులు మదనుఁడుండెడి హేమమందిరము దిరిగిరాఁ గదిసి మ్రోసెడి పారిఘంటలో కాని ॥ చెప్పరాదీ ॥ చ.2 కొమ్మపయ్యెదలోని కుచమూలరుచి వెలికిఁ జిమ్ముటది యెట్లుండెఁ జెప్పరే చెలులు యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి కమ్ముకొని చెంగావి గప్పిరో కాని ॥ చెప్పరాదీ ॥ చ.3 నెలతకంఠమునందు నీలమణిహరములు అలరుటెట్లుండు కొనియాడరే చెలులు లలితాంగి ప్రాణవల్లభుఁడు వేంకటవిభుఁడు నెలకొన్న కౌఁగిటనె నిలిచెనో కాని ॥