సుజననీయం

సుజననీయం 2020

సుజననీయం
శ్రీ పీ వీ నరసింహారావు, శతజయంతి The TRUE Legend! Sri PV garu, the leader who made India what it is today. ‘దేశాభివృద్ధిలో, జాతి ప్రగతిలో సాంస్కృతిక రంగం పాత్ర కీలకం. జాతి సమగ్రతను పరిపుష్టం చేయడంలో కళారంగం పోషించే పాత్ర బృహత్తరం. సాంస్కృతిక సమైక్యతతోనే నిజమైన భావసమైక్యత సిద్ధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.’ - కూచిభొట్ల ఆనంద్, అధ్యక్షుడు, సిలికానాంధ్ర బహుభాషా పాండిత్యం, నిఖార్సయిన వ్యక్తిత్వం రాజనీతి చాతుర్యం, జాతి వికాస కర్తృత్వం తెలంగాణ తేజోమూర్తి, తెలుగుజాతి వెలుగుల దీప్తి భరతజాతి జ్ఞాన సంపత్తి, తరతరాలకు నిత్య స్ఫూర్తి అతడే మన పీవీ నరసింహారావు , భారత మాజీ ప్రధానమంత్రి (స్వతహాగా మంచి సాహిత్యవేత్త అయిన శ్రీ పీవీ రాసిన కథ, కవిత ఈ సంచికలో తప్పక చదవండి) -తాటిపాముల మృత్యుంజయుడు ముఖచిత్రం: శ్రీ PVR మూర్తి

తెలుగు సాహితీ ద్వయం

సుజననీయం
ఈ నెల ముఖచిత్రంపై ఇద్దరు తెలుగు సాహితీ ఉద్ధండులు కొలువుదీరారు. ఇద్దరు పుట్టినరోజులు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఒక మొట్టమొదటి తెలుగు 'జ్ఞానపీఠ అవార్డు ' గ్రహీత కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మరొకరు తెలుగు భావకవిత్వంలో తనకొక అధ్యాయాన్ని ఏర్పరుచుకొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి. వీరిరువరిని ఈ విధంగా స్మరించుకోవటం తెలుగు సాహిత్యానికి వందనం చేయటమే. ఈ సందర్భంగా విశ్వనాథవారి కథ 'మాక్లీదుర్గంలో కుక్క ' ప్రచురిస్తున్నాం. విశ్వనాథ సత్యనారయణ గారు ఎంతటి వవిధ్యమైన రచనలు చేశారో తెలియటానికి ఇదొక చిన్న ఉదాహరణ. జై తెలుగు! -తాటిపాముల మృత్యుంజయుడు

పద్దెనిమిదేళ్ళ వేడుకలు!

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు సిలికానాంధ్ర ఏర్పడి 18ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆగష్టు 4వ తేదీన సంస్థాపక దినోత్సవాన్ని జరపటానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో ప్రముఖ వాయులీన విద్వాంసులు అశోక్ గుర్జాలే ఆధ్వర్యంలో 20మంది కళాకారులతో వాయులీన నాదామృతవర్షిణి పేరిట సంగీత విభావరి, సినీకవి జొన్నవిత్తుల ఆధ్వర్యంలో పేరడీ కవితాగానం నిర్వహింపబడతాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సేవాసంస్థ రోటరీ క్లబ్ 'సిలికానాంధ్ర రోటరీ క్లబ్' పేరుతో ఏర్పాటు చేయబడుతుంది. ఈ శాఖ సంస్థాపక దినోత్సవ సందర్భంగా 203 మంది సభ్యులతో 'చార్టరింగ్ సెరిమొనీ' జరుతుంది. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' శీర్షిక చూడండి. అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం!

అబ్బూరి ఛాయాదేవి

సుజననీయం
ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడే వదనం....ప్రశాంతత నిండిన చూపులు....సంభాషణల్లో అలవోకగా అమరి కురిసే చమత్కారాలు ....అమ్మలా ప్రతిఒక్కరితో అతిమృదువుగా పలకరింపులు.....అవును ఆవిడే అబ్బూరి ఛాయాదేవి. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆరోజుల్నిబట్టి ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పించడం ముఖ్యం కాదు పెళ్ళి తొందరగా చేసెయ్యాలి అన్న పద్ధతి పాటించారు ఆమె తరఫు పెద్దలు. ప్రసిద్ధ సాహితీవేత్త అబ్బూరి రామకృష్ణరావుగారి కోడలిగా ప్రసిద్ధ రచయిత విమర్శకులు అయిన అబ్బూరి వరద రాజేశ్వరరావుగారి సతీమణిగా సంసారజీవితంలో అడుగు పెట్టారు ఛాయాదేవిగారు. రాజేశ్వరరావుగారితో సాహితీచర్చలు జరిపేందుకు ప్రముఖ కవులు రచయితలు వారి ఇంటికి వచ్చేవారుట. స్వతహాగా ఆమెకు కూడా సాహిత్యం పట్ల చాలా ఆసక్తి ఉండడం వలన ఆమెకూడా ఆచర్చల్లో పాల్గొనేవారుట. ఆవిధంగా ప్రముఖ కవులు రచయితలు తనకు పరిచయ

ఎన్నటికి చెడని వాగ్గేయం

సుజననీయం
మనం నిత్యజీవితంలో అగుపించే వస్తువులు కాలక్రమేణ క్షీణిస్తూ చివరకు అంతరించిపోతాయి. బంగారు ఆభరణాలకు కూడా 'తరుగు' ఉంటుంది. విశాల విశ్వంలో ఉన్న అతిపెద్ద నక్షత్రాలు చిట్టచివరి దశలో కాంతిని గుప్పిట బంధించే 'కృష్ణబిలాలు'గా మారుతాయని విజ్ఞానశాస్త్రం ఋజువు చేస్తున్నది. కాని, సర్వకాల సర్వావస్థలయందు అనుక్షణం, ప్రతి తలంపు శ్రీ వేంకటేశ్వరుడుపై మోపిన అన్నమాచార్యుడు 'శ్రీహరి పాదతీర్థమె చెడని మందు' అంటూ శుక్రవారం స్వామికి జరిగే తిరుమజ్జనోత్సవంలో కీర్తించాడు. 'చెడని మందు ' అతి తేలికైన తేటతెల్లని పదం. చిన్న పిల్లాడు కూడా అర్థం అలవోకగా చెప్పేస్తాడు. ఎల్లప్పుడు హితాన్ని కోరుతూ, తన పాండిత్యం ఎక్కడా ఆధిపత్యం చేయనీయకుండా, సంకీర్తనలు రచిస్తూ స్వరపరుస్తూ పాడుతూ నాట్యం చేస్తూ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించాడు అన్నమయ్య. మే 25, 26, 27 తేదీల్లో సిలికానాంధ్ర అన్నమయ్య జయంతి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది.

అన్నమయ్య జయంతి

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు తెనాలి రామకృష్ణుడు తాళ్ళపాక కవులను ఒక పద్యములో ఇలా ప్రశస్తించెను - చిన్నన్న ద్విపదకెఱగును పన్నుగ బెదతిరుమలయ్య పదమున కెఱగన్ మిన్నంది మొరసె నరసిం గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్! అన్నమాచార్యుడు, అతని వంశీయులైన నరసన్న, పెదతిరుమలయ్య, చిన్నన్న అందరూ కవులే. అన్నమయ్య తెలుగు నుడికారమున దిట్ట. సంస్కృతమున కూడా మంచి సంకీర్తనలు రచించాడు కూడా. ద్రావిడ, కర్ణాటక, తెలుగు భాషల్లో మొదటగా సంకీర్తనలు రచించిన వాడు అన్నమాచార్యుడు. అందుకే 'పదకవితాపితామహుడు ' బిరుదాంకితుడు. ఎన్నో కవితారీతుల్లో మధురంగా రచించిన అన్నమయ్య జానపద రీతులు కొన్ని ఇవి - జాజఱలు, గొబ్బి, నలుగులు, గుజ్జెనగూళ్ళు, అల్లోనేరెళ్ళు, తందనాలు. మే 25, 26, 27 తేదీల్లో జరిగే అన్నమయ్య జయంతి ఉత్సవానికి తప్పక విచ్చేయండి. ఆ సంకీర్తనాచార్యునికి గాన, నాట్య కళలతో అర్పించే నివాళిలో పాలుపంచుకోండి. వివరాలకు 'ఈ మాసం సిలికాన

పారాడే పిల్లడు

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు పొత్తిళ్ళలో ఉన్న పిల్లడు ఆ అవస్థనుండి బయటపడి గబగబ పారాడటం మొదలెడితే తల్లికి ఎంతో ఆనందం కలుగుతుంది. అదే భావన, అనుభవం జనవరి 27న సిలికానాంధ్ర కుటుంబసభ్యులకు కలిగింది. ఆ రోజు సిలికానాంధ్ర రెండేళ్ళ క్రితం స్థాపించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra) మొదటీ స్నాతకోత్సవం జరిగింది. అత్యద్భుతంగా జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో సర్టిఫికేట్, డిప్లోమా, మాస్టర్స్ కోర్సులలో చదువులు పూర్తిచేసిన విద్యార్థులు సర్టిఫికేట్లు అందుకొన్నారు. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' చూడండి. అలాగే, కాకర్ల త్యాగరాజస్వామి వారు పుష్య బహుళ పంచమి (1847 సంవత్సరం)న సిద్ధి పొందారు. తెలుగులో మధురమైన కృతులు రచించి స్వరపరచిన త్యాగయ్య గురించి 'సంగీతరంజని ' లో చదవండి. తీపి తెలుగురా-సొగసు చూపు తెలుగురా-ఎదల ఊపు తెలుగురా బంగారు తెలుగురా పై పలుకులు బులుసు వెంకటేశ్వర్లు గారివి.

సంపాదకవర్గం

సుజననీయం
ప్రధాన సంపాదకుడు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకవర్గం: తమిరిశ జానకి శైలజా మిత్ర డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ Cheif Editor: M J Thatipamala Editorial Board: Janaki Tamirisa Shailaja Mitra Dr. Bhimapally Srikanth

సుజననీయం

సుజననీయం
"సంస్కృతి అంటే?" - తాటిపాముల మృత్యుంజయుడు సంస్కృతి అంటే జీవన విధానం, నాగరికత, భాష, సాహిత్యం, కళలు ఇలా కలగలుపుతూ ఎన్ని విధాలుగానైనా చెప్పుకోవచ్చు. సంసృతి అంటే ముందు కాలం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భావితరాలకు భద్రంగా అందించే సంపద అనుకోవచ్చు. కళలు 64 (చతుషష్టి) విధాలు. వెనువెంటనే మనకు తట్టేవి సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం మొదలుగాగల జనసామాన్యమైనవి. సర్వే లెక్కల ప్రకారం, ఉత్తర అమెరికాలో గత కొన్నేళ్ళుగా అత్యంత గణనీయంగా పెరుగుతున్న జాతి తెలుగు మాట్లాడే కుటుంబాలు. ఈ విషయాన్ని ముందస్తుగానే గమనించి అనుకుంటాను, సిలికానాంధ్ర 17 ఏళ్ళ క్రితం ఆవిర్భవించి తెలుగు సంసృతిని ముందు తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో నిర్విరామంగా కృషి చేస్తున్నది. అదే విధంగా సుజనరంజని మాసపత్రిక కూడా రచనల రూపంలో తెలుగు సంస్కృతిని వెల్లడించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇందుకు సహకరిస్తున్న మీకందరికి సాహితీ వందనాలు!  

హ్యాపీ హాలిడేస్

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు డిసెంబర్ నెలంటేనే ఒక సంవత్సరం ముగుస్తున్నట్టు. అలాగే పండుగల కాలం. స్కూల్లకు, కాలేజీలకు కూడా సెలవులు. క్రిస్మ్మస్, నూతన సంవత్సరాది పండగల హడావుడి. మన భారతీయులైతే దీపావళీ పండుగను కూడా జతచేస్తూ నవంబర్ నెలంతా వివిధ కార్యక్రమాలతో వినోదంగా గడుపుతారు. ఇంకా చెప్పుకోవాలంటే నవంబర్ నెల ఆఖరి గురువారం గొప్పగా జరుపుకునే ఉత్సవం 'థాంక్స్ గివింగ్ డే'. ఆ వారం మొత్తం అమెరికాలో చాలావరకు అందరు తమ శక్తిమేరకు ఎంతో కొంత విరాళాలు ఇస్తారు. ఆ సదవకాశాన్ని వినియోగించుకోటానికి స్వచ్చంద సేవా సంస్థలు విరాళాల సేకరణ కార్యక్రమాలు మొదలెడతారు. ఈ క్రమంలోనే దాతలు సిలికానాంధ్ర కూచిపూడీ గ్రామంలో స్థాపించిన సంజీవని వైద్యాలయానికి విరివిగా ధన సహాయం చేసారు. అందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు! ఈ సంవత్సరం మొత్తం వినూత్న రచనలతో విడుదలైన సుజనరంజని సంచికలను ప్రోత్సాహించిన పాఠకులకు, తమ రచనలను పంపించిన రచయిత(త్రు)