సుజననీయం

‘తాడు – పాము ‘ న్యాయం

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు ఈ న్యాయం ఉపనిషత్తులలో వివరించబడింది. అయితే, దేవుడు, మతాల జోలికి పోకుండా మనం నివసిస్తున్న జాగృదావస్థ ప్రపంచానికి ఈ న్యాయాన్నిఅనువదించుకుంటే కొన్ని విషయాలు విశదమవుతాయి. అజ్ఞానం (Ignorance) లోపానికి (Error) దారి తీస్తుంది. వాస్తవికతను (Reality) కప్పేసి ఒక భ్రమలోకి (Illusion) నెట్టేస్తుంది. అగ్రహణం (No Grasping) నుండి అన్యధా గ్రహణానికి (Wrong Grasping) కారణం అవుతుంది. అజ్ఞానం బీజం మొలకెత్తి సమస్యల వృక్షం అవుతుంది. ఈ తప్పంతా తనకు అంతా తెలుసనుకొని అజ్ఞానమనే చీకట్లో మనిషి ఉండటమే. వెలుతురు పడితేగాని పాము అనే భ్రమ తొలగిపోనట్టు జ్ఞానం సంపాదించనంత వరకు ఇలాంటి దుస్థితి కొనసాగుతుంది. 'నాకు తెలిసిందల్లా ఒక్కటే, నాకేమీ తెలియదు ' అని సోక్రటిస్ చెప్పిన ఆణిముత్యం లాంటి మాటను మనం మరచిపోకూడదు. మానసిక శాస్త్రం ప్రకారం ఒక మనిషి స్వయాన్ని (Self) నాలుగు భాగాలుగా విభజించవచ్చు. క్రింద ఇ

సుజననీయం

సుజననీయం
పదహారేళ్ళ పండగ అవును,సిలికానాంధ్ర సంస్థ స్థాపింపబడి పదహారేళ్ళు పూర్తయ్యాయి. ఒక సంవత్సర కాలం పూర్తయ్యిందంటే ఒక మైలు రాయిని చేరుకొన్నట్టు లెక్క. వార్షికోత్సవం అంటే గత సంవత్సరాల తీయటి జ్ఞాపకాల్ని నెమరేసుకొంటూ, ఈనాటి సంతోషాల్ని పంచుకొంటూ, రాబోయే కాలపు ఆశలకు, ఆశయాలకు ప్రణాళికలు వేస్తూ పండగ చేసుకోవడమే. అనాదిగా రత్నాలు, మణులకు మనిషి ఆకర్షితుడవుతున్నాడు. వాటిలో కానవచ్చే స్వచ్చత, బహు గట్టిదనం, మిలమిల మెరిసే ప్రకాశం వీటి ప్రత్యేక లక్షణాలు. పగడము, పచ్చ, నీలము, గోమేధికం, వజ్రము, వైడూర్యం మొదలగు నవరత్నాలు అలంకారభూషితాలుగా పేరొందాయి. మరి సిలికానాంధ్ర నవరత్నాలు ఏవంటే - ఉగాది ఉత్సవం, అన్నమయ్య జయంతి ఉత్సవం, కూచిపూడి నాట్యోత్సవం, తెలుగు సాంస్కృతికోత్సవం, సుజనరంజని మాసపత్రిక, మనబడి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, సంపద, జయహో కూచిపూడి కార్యక్రమాలను పేర్కొనవచ్చు. అలాగే, ఇంకా వెలికి తీస్తే ఎన్నో మణులు లభ్యమవుతాయి

చుక్కల్లో చంద్రుడు

సుజననీయం
మన భారతీయుడు, ఖగోళ సాస్త్రవేత్త, నోబెల్ బహుమాన గ్రహీత అయిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ చరిత్రను కాలిఫోర్నియా నివాసి, విశ్రాంత ఆచార్యుడు అయిన డా. వేమూరి వేంకటేశ్వరరావు రచించిన ధారవాహిక శీర్షిక ప్రారంభం అయినది. భౌతిక, గణిత, ఖగోళ, సాంకేతిక సమచారాల్ని జోడిస్తూ రాసిన ఈ రచనను తప్పక చదవండి. మీ అభిప్రాయాలు పంచుకోండీ. - తాటిపాముల మృత్యుంజయుడు

కవివరేణ్యుడు, సాహితీ దురంధరుడు – సినారే

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు కవిత్వమంటే కర్రుమొనలోంచి మట్టి పలికినట్టుండాలి చెమట ఆవిరిలోంచి మబ్బుపట్టినట్టే ఉండాలి కరీం నగర్ జిల్లా హనుమాజీపేట వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) తన కవిత్వంలో కూడ మట్టి వాసనను ఆఘ్రాణించాడు. పాఠశాల విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో జరిగిన సినారె కు చిన్నప్పుడు ఊళ్ళో జరిగే హరికథలు, ఒగ్గుకథలు విని, ప్రదర్శనలు చూసి తెలుగుభాష మధురిమలకు ఆకర్షితుడైనాడు. రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు పోతూపోతూ రాస్తాను వసుపు వాడే వరకు అంటూ కవిత్వమే తన ఊపిరిగా చేసుకొని చివరి క్షణం వరకు బతికాడు. గురువులు, ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని వంటి దిగ్గజాల మెప్పు పొంది, పాఠాలు, పరిశోధనలచే అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి, గేయాలు, గజళ్ళు, గ్రంథాలు రాసి పాఠకుల అభిమానాన్ని చూరగొని, పాటలతో ప్రేక్షకలోక అభిమానాన్ని సంపాదించి, రాష్ట్ర,
పరోపకారార్థం

పరోపకారార్థం

సుజననీయం
సంపాదకవర్గం: ప్రధాన సంపాదకులు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదక బృందం: తమిరిశ జానకి కస్తూరి ఫణిమాధవ్ -తాటిపాముల మృత్యుంజయుడు   అవసానదశలోకి అడుగిడుతున్న ఒక ముదుసలి గుంతను తవ్వుతూ ఒక చిన్నమొక్కను నాటటానికి ఎంతో కష్టపడుతున్నాడు. దారిన పోయే దానయ్యలు ఆపసోపాలు పడుతున్న ఆ వృద్ధుణ్ణి చూసి నవ్వుకొంటున్నారు. ఈ వయసులో ఇలాంటి పని చెయ్యడం అవసరమా ప్రశ్నిచుకొంటున్నారు. చివరికి ఒక దానయ్య నిలబడి 'తాత, ఎనభై ఏండ్ల వయసులో ఏమి సాధిద్దామని ఈ పని చేస్తున్నావు? మొక్క ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు నీకు పండ్లు ఇవ్వాలి. అంతా నీ భ్రమగాని ' అని పరిహసించాడు. అప్పుడు తాత ముసిముసిగా నవ్వుతూ 'ఈ మొక్క చెట్టుగా ఎదిగి నాకు పడ్లను ఇవ్వాలనే దురాశతో ఈ పని చెయ్యటం లేదు. ఏదగబోయే చెట్టూ నా మనవడికో లేదా వాని కూతురు, కొడుకుకో నీడ ఇస్తుంది. వాళ్లు పళ్ళని తింటారు. పదిమందికి పంచుతారు ' పెద్ద జ్ఞానిలా మాట్లాడాడు. పైన చెప్పుకున్న కథ

కాలం మహిమ!

సుజననీయం
ప్రధాన సంపాదకులు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదక బృందం: తమిరిశ జానకి కస్తూరి ఫణిమాధవ్ కాలం మహిమ! 'ప్రభో , కాలం నీ చేతుల్లో అనంతం నీ నిమషాల్ని లెక్కపెట్టగలవారెవరూ లేరు ' (గీతాంజలి, చలం) 'ఎందులోంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలము? ఎవరివల్ల, ఎవరికోసం జరిగిందీ ఇంద్రజాలం?' (త్వమేవాహం, ఆరుద్ర) 'గాలంవలె శూలం వలె వేలాడే కాలం వేటాడే వ్యాఘ్రం అది, వెంటాడును శీఘ్రం' (ఖడ్గ సృష్టి, శ్రీ శ్రీ) పైవన్నీ మన తెలుగు కవులు తమ కవితల్లో కాలానికి అన్వయించుకున్న అర్థాలవి. మరి తత్వవేత్తలు, ఆధ్యాత్మికులు కాలాన్ని ప్రవాహమని, చక్రమని పరిగణించారు. ఇదలా ఉంచితే, శాస్త్రవేత్తలు కాలం ఈ విశ్వం ఉద్భవించినప్పటినుండి పుట్టిందని పేర్కొన్నారు. నిరంతరం క్రియప్రక్రియలతో నిరాఘాతంగా వ్యాపిస్తున్న ఈ విశ్వంలో ఎప్పుడో ఒకప్పుడు వివిధరూపాల్లో ఉన్న శక్తులు ఉట్టడుగుతాయని (Thermal Equillibrium), అప్పుడు సంకోచం ప్ర

యువత – భవిత

సుజననీయం
సంపాదకవర్గం: ప్రధాన సంపాదకులు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదక బృందం: తమిరిశ జానకి కస్తూరి ఫణిమాధవ్   - తాటిపాముల మృత్యుంజయుడు 'భాషా సేవయే భావితరాల సేవ' అన్న నానుడితో అమెరికాలోని పెక్కు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా శరవేగంతో అభివృద్ధి చెందుతూ పిల్లలకు తెలుగు విద్యాబోధన చేస్తున్నది సిలికానాంధ్ర మనబడి. అలాగే, హైస్కూలు పూర్తి చేసిన పిల్లలకు, మరియు పెద్దలకు భారతీయ సంస్కృతిలోని వివిధ అంశాలలో ఉన్నత విద్య అభ్యసించటానికి 'సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం' ప్రారం భించడం జరిగింది. విద్యాబోధనే కాకుండా యువత మనోభావాలు వెల్లడించటానికి 'సిలికానాంధ్ర యువత' అనే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి ప్రపంచీకరణ నేపథ్యంలో వారిని ముందు తరపు పౌరులుగా తయారుచేయటానికి కావల్సిన సదుపాయాలను తయారుచేసి, తగిన రీతిలో సహాయం అందిచడం ఈ వేదిక ముఖ్యోద్దేశం. మరిన్ని వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర' శీర్షిక చూడం