వీక్షణం

వీక్షణం – 88

వీక్షణం
- రూపారాణి బుస్సా గొల్లపూడి మారుతీరావు గారికి నివాళులర్పిస్తూ రెండు నిముషాల పాటు మౌనం పాటించి 88 వ వీక్షణ సభ ప్రారంభించబడినది. తరువాతి కార్యక్రమంగావెంకట రమణ రావు గారు తాము వ్రాసిన కథ చదివారు. ఈ కథ పుట్టిల్లు అన్న శీర్షికతో 2008లో నవ్యలోప్రచురింపబడినది.ఈఛ్Fఆఈ సంస్థ వాళ్ళు పెట్టిన పోటీలో మొదటి బహుమతి పొందింది. కథ నేపథ్యం అనంతపురంలోజరిగినట్టు చెప్పబడినది. కొన్ని సంభాషణలలోప్రాంతీయ భాషా శైలి కనబడుతుంది. కథ ఇలా కొనసాగుతుంది:- పార్వతి తన కూతురి ఇంటికివెళ్ళినప్పుడు తన ఊరి స్నేహితురాలు అలిమేలును కలిసి సొంత ఊరి వాళ్ళ గురించి తెలుసుకునిఏదో స్వగతాలలో మునుగుతుంది. స్నేహితురాళ్ళంతా కలిసినపుడు తోట, స్నేహం ఉన్నంత వరకు ఇదేమన పుట్టిల్లు అని అనుకున్నారు. ఊరులో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మకు కొడుకు, కోడలు వచ్చిఎంత పిలిచినా తన అవసరం ఉన్న వారి దగ్గర ఉండడమే న్యాయం మరియు ఈ ఇంట్లో చివరి కాలం గడపడమేసమంజసం అ

వీక్షణం సాహితీ గవాక్షం- సప్తమ వార్షికోత్సవం

వీక్షణం
-మాధవపెద్ది ఫణి రాధాకుమారి సెప్టెంబరు 8, 2019 న కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో స్వాగత్ హోటల్ లో ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం- సాహితీ గవాక్షం సప్తమ వార్షికోత్సవం ఆహూతుల ఆనందోత్సాహల నడుమ అత్యంత రసవత్తరంగా జరిగింది. వీక్షణం నిర్వాహకురాలు డా||కె.గీత మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా నెల నెలా క్రమం తప్పకుండా కొనసాగుతున్న వీక్షణం సాహిత్య కార్యక్రమాలకు సహకారం అందజేస్తున్న స్థానిక సాహిత్య కారుల్ని, అభిమానుల్ని వేనోళ్ల కొనియాడారు. ఈ సందర్భంగా వీక్షణం తనతో బాటూ అందరికీ అందజేస్తున్న సాహిత్య స్ఫూర్తి వల్లే ఇదంతా సాధ్యపడుతున్నదని అన్నారు. ఈ సభలో ఉదయం సెషన్ కు శ్రీ పొద్దుటూరి ఎల్లారెడ్డి అధ్యక్షత వహిస్తూ కరుణశ్రీ గారి పద్యంతో ప్రారంభించారు. తర్వాత శ్రీ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం నుంచి పద్యాలనాలపించి అందరినీ ముగ్ధుల్ని చేశారు. ముందుగా శ్రీ చుక్కా శ్రీనివాస్ "ఖదీర్ బాబు కథల గురించి మాట్ల

వీక్షణం సాహితీ గవాక్షం – 84

వీక్షణం
-ఛాయాదేవి వీక్షణం 84 వ సమావేశం లాస్ ఆల్టోస్ లోని ఉదయలక్ష్మి గారింట్లో ఆద్యంతం అసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ పెద్దు సుభాష్ అధ్యక్షత వహించారు. డా||కె.గీత శ్రీమతి చాగంటి తులసి గారి కథ "యాష్ ట్రే" చదివి వినిపించి కథా పరిచయం చేశారు. తరువాత జరిగిన కథా చర్చలో భాగంగా కథలో స్త్రీ వాదం, విశ్వప్రేమ, మాతృహృదయం, స్వార్థ నిస్వార్థాలు, స్త్రీ, పురుషుల మధ్య సున్నితాంశాలు, కథ నేరేషన్ మొ.న అంశాలను గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. రచయిత్రి, కథా వివరాలు అందజేస్తూ "డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె ప్రఖ్యాతిని పొందిన విశిష్టమైన , తెలుగు సాహిత్యం గర్వించదగ్గ సాహితీ మూర్తి. హిందీ, ఒడియా , తెలుగు నడుమ భాషా వారధి గా ఆమె ఎన్నో అనువాదాలు చేశారు. రాహుల్ సాంకృత్యాన్ ‘ఓల్గా నుండి గంగకు’ హిందీ ను

వీక్షణం – 83

వీక్షణం
-రూపారాణి బుస్సా జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన "బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక" అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం. తరువాత కార్యక్రమం అబ్బూరి ఛాయాదేవి గారు గురించి. వీరు స్త్రీల సాహిత్యానికి ద్రోణాచార్యులవంటి వారు ఇటీవలే స్వర్గస్తులైయ్యారు. వీరికి నివాళులు తెలుపుతూ ఆమె వ్రాసిన "వుడ్ రోజ్ " అన్న చిన్న కథను డా|| కె గీత గారు వాచించారు. ప్రతి ఇంటా జరిగే సహజమైన కథావస్తువు తీసుకుని అందరి కళ్ళల్లో కథా చిత్రం కనిపించేలా రాసారు. సభలోని వారంతా కథ గురించి తమ తమ అభిప్రాయాలను తెలిపారు. తదుపరి కె. వరలక్ష్మిగారిచే రచ

వీక్షణం-82

వీక్షణం
వీక్షణం 82వ సమావేశం కాలిఫోర్నియాలోని మోర్గాన్ హిల్ లో డా||కె.గీత గారింట్లో ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం డా||కె.గీత, భర్త శ్రీ సత్యన్నారాయణ గారితో బాటూ కలిసి సభకు ఆహ్వానం పలికారు. ఈ సభకు శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా "తెలుగురచయిత.ఆర్గ్" నుండి శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి "ఉద్వేగాలు" కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు. రాజు, శేషి అన్నా చెల్లెళ్లు. కథా ప్రారంభంలో "ఉద్వేగాలు అంటే నాకు చాలా అసహ్యం. ఏమీ కారణం లేకపోయినా ఏడవగలగడం ఒక గొప్పతనమేమోగాని, సంఘమర్యాదకీ, నాగరికతకీ తగినదిమాత్రంకాదు. పెద్దవాళ్లెవరేనా కంటనీరు పెట్టుకొని ఏడిచారంటే నాకు రోత. నాకేగాదు, నాగరికత అంటే తెలిసిన ప్రతివాడికీని. హరిశ్చంద్రనాటకంలో కూర్చుంటేవేషాలు వేసేవాళ్లు సరిగా ఏడవలేకపోయినా, మనకి అటూ ఇటూ కూర్చున్నవాళ్లు ముక్కులు చీదుకుంటూ, గొంతులు సవరించుకొంటూ కళ్లనీళ్ల

వీక్షణం-81

వీక్షణం
సమీక్ష - ఛాయాదేవి ఛాయాదేవి వీక్షణం-81 వ సమావేశం శానోజే లోని క్రాంతి మేకా గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు గారు అధ్యక్షత వహించారు. ముందుగా అందరికీ పరిచితమైన వీక్షణం సాహితీ గవాక్షం సాహితీ లోకానికే వీక్షణంగా పేరు గాంచాలని సభలోని వారందరూ ఆకాంక్ష వెలిబుచ్చారు. మొదటి అంశంగా డా||కె.గీత శ్రీ విశనాథ సత్యన్నారాయణ గారి "జీవుడి ఇష్టం" కథానికను సభకు చదివి వినిపించి కథా చర్చకు ఆహానం పలికారు. ఈ కథపై ఆసక్తికరంగా చర్చ జరిగింది. కథలో నాగరిక, అనారిక ప్రజల్ని భారతదేశంలోని ప్రజలు, బ్రిటీషు వారిగా ఊహించుకోవచ్చని, ఇందులో ప్రధాన పాత్రధారి అయిన స్త్రీ ధైర్యాన్ని కొనియాడవలసినదని, సీతా రావణుల కథకు ప్రతిరూపమని, స్త్రీ హృదయం ఎవరూ దొంగిలించలేరని, కథ పురుషుడు రాసినందు వల్ల స్త్రీ హృదయావిష్కరణ సరిగా జరగలేదని, ఒక స్త్రీ తన పిల్లల్ని తన కళ్ల ముందు నిర్జీవం కానివ్వదని... ఇలా అనేక రకాల ఆసక్తి

వీక్షణం సాహితీ గవాక్షం-80

వీక్షణం
-వరూధిని వీక్షణం-80 వ సమావేశం కాలిఫోర్నియా బే-ఏరియాలోని పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారింట్లో ఏప్రిల్ 14, 2019 న జరిగింది. ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు, శాంత గారు సభకు ఆహ్వానం పలుకుతూ నిన్నా మొన్న ప్రథమ సభ జరిగినట్లుగా ఉందని ఇంతలోనే వీక్షణం 80 వ సమావేశం లోకి అడుగు పెట్టడం, ఈ సమావేశం తమ ఇంట్లో జరగడం తమకు అత్యంత ఆనందదాయకమని అన్నారు. ఉగాది కవి సమ్మేళనం ప్రధాన కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశానికి శ్రీ రావు తల్లాప్రగడ గారు అధ్యక్షత వహించారు. ముందుగా శ్రీ చరణ్ గారు "రామ నామ శబ్ద విశిష్టత" అనే అంశమ్మీద మాట్లాడుతూ "రం" అనే ధాతువు గురించి, ఋగ్వేదంలోని శబ్ద మూలాల గురించి వివరించారు. రాముని పుట్టుకకు ముందే ఈ శబ్దం ఉన్నదనీ, అత్యంత ఆనందస్థితే ఈ శబ్దమని అంటూ రామ శబ్దానికి ఈశ్వర తత్త్వానికి ఒకటే అర్థమని వివరించారు. ఇందులో భాగంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాల గురించి వివరిస్తూ వేదాల్లో చెప్పిన విషయాలను

వీక్షణం- 79

వీక్షణం
-వరూధిని వీక్షణం 79 వ సమావేశం మిల్పిటాస్ లోని తాటిపామల మృత్యుంజయుడు గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ సుభాష్ పెద్దు అధ్యక్షత వహించారు. ముందుగా చలం గారి కథ "యముడితో చలం" కథను డా||కె.గీత, శ్రీమతి కె. శారద గార్లు చలం, యముని పాత్రలుగా కథను చదివి వినిపించి అందరినీ అలరించారు.కథా పథనం తర్వాత సభలో రసవత్తరమైన చర్చ జరిగింది. ఈ కథ 1958 లో చలం గారు పూర్వ జీవితానికీ, ఆశ్రమ జీవితానికీ మధ్య కాలంలో రాసినదని, కథలో తత్త్వ విచారం సరిగా జరలేదని, కొన్ని ప్రశ్నలకు అర్థం లేనిదని, తప్పు చేస్తేనే శిక్షా?, స్వరం, నరకం అంటే ఏవిటి? పాప పుణ్యాలకు అర్థాలు ఏవిటి? చదువరుల విశ్లేషణ ఎలా ఉంది? అసలు ప్రశ్నలు కథ ముగిసేక మొదలవుతాయి, యముణ్ణి విమర్శిస్తే ఎక్కడా ఎందుకు ప్రతి చర్చ ఉండదు? యముడు, చలం ఇద్దరూ చలమే. చలం గారి ఆత్మాన్వేషణే ఈ కథ..." అంటూ విభిన్న అభిప్రాయల్ని వెలిబుచ్చారు.ఆ తర్వాత కిరణ్ ప్రభ గారు "చలం జీవితం లో

వీక్షణం సాహితీ సమావేశం-78

వీక్షణం
-వరూధిని వీక్షణం 78 వ సాహితీ సమావేశం కాలిఫోర్నియా బే ఏరియాలోని ప్లెసంటన్ లో ఫిబ్రవరి 10, 2019 న శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు, శ్రీమతి ఉమా వేమూరి గారి ఇంట జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు అధ్యక్షత వహించారు. ఈ సభలో ముందుగా శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి కథ "ఉద్యోగం" మీద కథా చర్చ జరిగింది. కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు. ఒక మధ్యతరగతి వాడు ఉద్యోగం కోసం ఎన్ని పాట్లు పడాలో వివరించే కథ ఇది. ఇక కథ పట్ల సభలోని వారు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతూ, చిన్న చిన్న విషయాలు వివరంగా చెప్పడం కొ.కు స్టైల్ అనీ, కథాంశం కంటే చెప్పే విధానం చాలా బావుందని, కథ చదువుతున్నపుడు కాలమానపరిస్థితులు చక్కగా తెలుసుకోగలిగిన కథ, ఆశ, నిరాశల మధ్య ఊగిసలాటని వ్యంగ్యంగా చెప్పడం బావుందని, కథ వేగంగా నడిచినా కథలో వేగం లేదని, చిన్న ఉద్యోగి కేపిటలిస్టిక్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలియజెప్పే కథ అనీ అన్నారు