వీక్షణం

వీక్షణం-77

వీక్షణం
-- విద్యార్థి   వీక్షణం 77వ సమావేశం జనవరి 13, 2019 నాడు, శ్రీమతి విజయా ఆసూరి, శ్రీ వేణు ఆసూరి దంపతుల స్వగృహమునందు జరిగినది. భోగి పండుగ నాడు జరిగిన ఈ సమావేశం సంక్రాంతి సాహిత్య సభగా, ఒక ఆత్మీయ సమావేశంగా సాగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన వారు ఆచార్య చెన్న కేశవ రెడ్డి గారు. ఈ సభలో మొదటి అంశం రావి శాస్త్రి గారి "పిపీలికం" కథా పఠనం మరియు చర్చ. కథ ఎంత బాగుందో, వేణు ఆసూరి గారి కథా పఠనం కూడా అంత ఆసక్తికరముగా సాగింది. ఈ కథ గురించి వేణుగారు వివరిస్తూ, "రావి శాస్త్రి గారు ఆంధ్ర జ్యోతి పత్రిక వారివద్ద అప్పు తీసుకుని, ఆ అప్పు తీర్చటం కోసం వ్రాసి ఇచ్చిన బాకీ కథలలో పిపీలకం ఒక కథ" అని వివరించారు. ఈ కథ శ్రామిక వర్గాలలో చైతన్యం నింపే కథ. వేరే వారెవరూ కాకుండా, పీడిత ప్రజలు తమకు తాము చైతన్యవంతులై దోపిడీవర్గాలను ఎదుర్కోవటాన్ని తెలిపే కథ. కథా శైలి గురించి విపులంగా జరిగిన చర్చ ఆసక్తికరముగా సాగింది.

వీక్షణం-76 సమీక్ష

వీక్షణం
-వరూధిని వీక్షణం-76 వ సమావేశం ఫ్రీ మౌంట్ లోని షర్మిలా గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.ఈ సభకు శ్రీ తాటిపామల మృత్యుంజయుడు అధ్యక్షత వహించారు.ముందుగా సభలో వీరేశలింగం గారి గురించి ప్రసంగిస్తూ శ్రీ అక్కిరాజు రమాపతిరావు వారి రచనలపై తన డాక్టరేట్ రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు.వీరేశలింగం గారి విశిష్టతను సభకు పరిచయం చేస్తూ ఆధునిక ఆంధ్ర దేశం గోదావరి అయితే వీరేశలింగం నాసికాత్ర్యయంబకం అన్నారు. తెలుగు సాహిత్యంలో ఆధునిక ప్రక్రియలైన నవల, కథ, నాటిక మొ.న అన్నిటికీ ఆయనే ఆద్యుడని పేర్కొన్నారు. ఆయన వితంతువులకి ఉచిత విద్యని అందించాడు.ఆయనను గురించి చిలకమర్తి "అటువంటి సంఘసంస్కర్త, అటువంటి రచయిత మరి కొన్ని వందల ఏళ్లకు గాని మళ్లీ పుట్టడు" అన్నారని అన్నారు.వీరేశలింగం "వివేకవర్థిని" పత్రికను నడిపారు, అనేక ప్రహసనాలు రాసేరు, ఆధునిక భావాల్ని విస్తరింపజేసారు. తన స్వీయ చరిత్రను తన శ్రీమతి రాజ్యలక్ష్మికి అంకితం

వీక్షణం సాహితీ గవాక్షం- 75

వీక్షణం
వజ్రోత్సవ సమావేశం -ఆర్. దమయంతి కాలిఫోర్నియా బే ఏరియాలో నెలకొన్నవీక్షణం సాహితీ సంస్థ 75 మాసాలను పూర్తి చేసుకున్న శుభ తరుణాన వజ్రోత్సవ వేడుకలనుఎంతో ఘనంగా జరుపుకుంది. మిల్ పిటాస్ లో నివసిస్తున్నరచయిత శ్రీ అనిల్ ఎస్ రాయల్ గారి స్వగృహం లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆ నాటి సభలో పాల్గొన్న వారిలో తెలుగు సాహిత్యంలో ఘనాపాటీలు గా కీర్తింపబడుతున్నవారు, వేద పండితులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రసిద్ధ కవులు, రచయితలు, విశేష విశ్లేషకులు,మధుర గాయనీ గాయకులు పాల్గొని , తమ తమ ప్రతిభాపాటవాలతోసభికులను రంజింప చేసారు. సభని ప్రారంభిస్తూ, డా. గంగిశెట్టిలక్ష్మీ నారాయణ వీక్షణం వారి సాహితీ సేవలనుకొని యాడారు. ఆనాటి ప్రధానోపన్యాసకులు, కేంద్రసాహిత్య అకడెమీ అవార్డ్ గ్రహీతలు అయిన శ్రీ సదాశివ మూర్తి గారిని గారిని వేదిక మీదకి సాదరం గా ఆహ్వానించారు. శ్రీ సదాశివ మూర్తి గారు - రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ

వీక్షణం 74వ సమావేశం- సమీక్ష

వీక్షణం
- విద్యార్థి వీక్షణం 74వ సమావేశం శా.శ. ౧౯౪0 ఆశ్వీయుజ పంచమి నాడు, ( అక్టోబరు 14, 2018) నాడు, శ్రీ పెద్దిభొట్ల ఇందు శేఖర్, లావణ్య గార్ల గృహము నందు జరిగినది. ఈ సభకు అధ్యక్షత వహించిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ప్రసంగిస్తూ Myth అనే మాటకు తెలుగులో మిథ్య అనే మాటకు సరి పోలికలున్నవి. హిందీలో మిథిక అనే వాడుక ఉంది. ప్రపంచములోని ఎక్కడి మిథాలజీ కథలు అయినా, మనిషి ఎక్కడ ఉన్నా ఆలోచనలు ఒక్కటే అనేటట్లు ఋజువు చేస్తాయి. గ్రీకు మిథాలజీ కథలు కూడా అటువంటివే" అని చెప్పి, ప్రాచీన గ్రీకు కావ్యాలను సభకు పరిచయం చేయటానికి ఆసూరి వేణు గారిని ఆహ్వానించారు. వేణు గారి ప్రసంగ విశేషాలు - "ప్రాచీన గ్రీకు కావ్యాలు ఇలియడ్, ఒడిస్సేలు మన రామాయణ మహాభారతాలని పోలి ఉంటాయి. వీటి రచయిత హోమర్. షుమారు సామాన్య శక పూర్వం 6వ శతాబ్ది కి చెందినవాడు. హోమర్ అనాథ, పైగా అంధుడు. వాల్మీకిలాగా ఆనాటి కుల వ్యవస్థలో ఉన్న కష్టాలును అధిగమించి,

వీక్షణం ఆరవ వార్షికోత్సవం

వీక్షణం
-జయమాల & దమయంతి వీక్షణం ఆరవ వార్షికోత్సవం సెప్టెంబరు 16, 2018 న మిల్పిటాస్ లోని స్వాగత్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. సభను ప్రారంభిస్తూ వీక్షణం సంస్థాపకురాలు డా||కె.గీత ఆరేళ్ల ప్రస్థానాన్ని తల్చుకుంటూ ఇప్పుడు వీక్షణం ఇక్కడి వారి జీవితంలో భాగస్వామ్యమైపోయిందనీ, ఆపాలనుకున్నా ఆగని నిరంతర సాహితీ వాహిని గా అందరినీ అలరిస్తూందని, ఈ సంవత్సరం శేక్రమెంటో లో మరో శాఖతో విస్తరిస్తూ సాహితీ సేవలో మరో అడుగు ముందుకేసిందనీ అంటూ అందరికీ ఆహ్వానం పలికారు. ఉదయం సెషన్ కు శ్రీ చుక్కా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా సాహిత్య సమావేశాలు జరుపుకుంటున్నామంటే మనందరిలో సాహిత్యాభిరుచి, సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి కారణమని అందరినీ అభినందిస్తూ సభను ప్రారంభించారు. ముందుగా శ్రీ తాటిపామల మృత్యుంజయుడు "భగవద్గీత ను ఎలా చదవాలి, ఎందుకు చదవాలి?" అనే అంశం పై ప్రసంగిస్తూ, తాను చెప్పదలుచుకున్నద

వీక్షణం సాహితీ గవాక్షం -71

వీక్షణం
-సాయికృష్ణ మైలవరపు వీక్షణం 71 వ సమావేశం కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో నగరంలో జూలై 14వ తేదీన లక్ష్మీనారాయణ మందిరములో దిగ్విజయంగా జరిగింది. ఈ నెల సమావేశ అంశం "సంస్కృతాంధ్ర అవధానం". అవధానులు శ్రీయుతులు పాలడుగు శ్రీచరణు గారు అసమాన ప్రతిభతో తెలుగులో ఎనిమిది అంశాలు, సంస్కృతం లో మూడు అంశాలతో పృచ్ఛకులు అడిగిన కష్టతరమైన ప్రశ్నలకు చక్కటి సమాధానాలనిస్తూ ఆద్యంతం ఆసక్తిదాయకంగా పూర్తి చేసేరు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకట శాస్త్రి గారు సంచాలకత్వం చేసిన ఈ సభకు సుమారు నూరు మంది వీక్షకులు వేంచేసి రసరమ్యంగా వీక్షించారు. తెలుగు పురాణ పఠనము శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారి తెలుగు పురాణ పఠనము అందరినీ ఉఱ్ఱూతలూగించినది. తెనాలి రామలింగ పాండురంగ మహాత్మ్యము, నంది తిమ్మన పారిజాతాపహరణము మున్నగు పురాణములనుండి మృదుమధురముగా అక్కిరాజువారు ఆలపించిన పద్యాలకు అవధాని వారు చక్కటి వ్యాఖ్యానమునొసగినారు. నిషిద్ధాక్ష

వీక్షణం- 70

వీక్షణం
వీక్షణం 70 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో జరిగింది. ఈ సమావేశాన్ని డా||కె.గీత కన్నడంలో నుంచి తనే అనువాదం చేసిన స్వాగత గీతంతో ప్రారంభించేరు. శ్రీ లెనిన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం ముందుగా "వేదం" గురించి శ్రీ శ్రీచరణ్ గారి ఉపన్యాసంతో ప్రారంభించబడింది. ముందుగా వేదం అంతే ఏవిటో వివరిస్తూ, వేదం ఆని చోట్లా ఉందని, అనుభవమే వేదమనీ అన్నారు. వేదాలు ముఖ్యంగా నాలుగు. ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వ వేదం. మత్స్య పురాణంలో వేదాల గురించిన ప్రస్తావన ఉంది. వేదాలు అపౌరుషేయాలు. విభజన చేసినంత మాత్రాన వ్యాసుడు వేదకర్త కాదు. ఈశ్వరుడి చేత బ్రహ్మకు వేదాలు ఇవ్వబడ్డాయి. వేదంలో అన్నీ ఉత్తమ పురుషలో ఉంటాయి. ప్రతీ వేదం మళ్లీ నాలుగు విభాగాలు. సంహితము, బ్రాహ్మణకము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. వీటిలో చెప్పిన సారాన్ని చివరగా చెప్పేది వేదాంతము. ఇలా వేదాల గురించి వివరంగా విశదీకరిస్తూ ఉపన్యాసం

వీక్షణం సాహితీ గవాక్షం – 66

వీక్షణం
- విద్యార్థి వీక్షణం 66వ సమావేశం మిల్పిటాసు (కాలిఫోర్నియా) లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయమందు, ఫిబ్రవరి 12, 2018 నాడు జరిగినది. ఈ సభకు శ్రీ చెన్నకేశవ రెడ్డిగారు అధ్యక్షత వహించినారు. సాహిత్యంలో తత్త్వ దర్శనం గురించి అధ్యక్షులవారు ప్రసంగిస్తూ చెప్పిన విశేషములు - "అష్టాక్షరీ మంత్రము "ఓం నమోనారాయణ" లోని రా శబ్దమునకు పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" లోని మ అక్షరం కల్పితే వచ్చేది రామ శబ్దము. ఆ రామ అయనము అనగా రాముని ప్రయాణము యొక్క తత్త్వాన్ని వివరించేదే రామాయణము. సాహిత్యములో కబీర్, తుకారాం, వేమన, బసవడు మొదలగు వారి రచనలలో తత్త్వ దర్శనం ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్యములో బహు రచనలు తత్త్వ బోధనతో కూడి ఉన్నాయి". మొదటి ప్రసంగకర్త, శ్రీ అన్నే లెనిన్ గారిది. వారి ప్రసంగ విశేషములు - "నవీనాంధ్ర కవిత్వములో ఆత్మ, తత్త్వము పలువురి రచనలలో కనబడుతుంది. సముద్రాల, సిరివెన్నెల మొదలగు సినీ రచయితల

వీక్షణం సాహితీ గవాక్షం -63

వీక్షణం
రచన : అన్నే లెనిన్ నవంబరు 12, 2017 న ఫ్రీమౌంట్ లోని శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. శ్రీ మృత్యుంజయుడు తాటిపామల అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ పాడుగు శ్రీ చరణ్ "రఘువంశ ప్రశస్తి" లోని కొన్ని శ్లోకాలను టీకా తాత్పర్య సహితంగా ఉదహరిస్తూ అత్యంత రమణీయంగా ఉపన్యసించారు. 17 సర్గల రఘువంశ చరిత్రను సూక్ష్మంగా వివరించారు. దిలీపుడు, సగరుడు, భగీరధుడు, హరిశ్చంద్రుడు గొప్పవారైనా రఘువు పేరు మీదుగానే వంశం వర్థిల్లడానికి కారణాలు వివరించారు. మల్లినాథ సూరి గారి సంజీవని వ్యాఖ్యా విశేషాల్ని, కాళిదాసు, పోతన పద్య సారూప్యతలను వివరించారు. తరువాత శ్రీ క్రాంతి శ్రీనివాసరావు "ఆధునిక కవిత్వం" అనే అంశం మీద ఉపన్యసిస్తూ సాహితీ సభల లోని రకాలను హాస్యస్ఫోరకంగా వివరించారు. తాను ఇంతవరకు పాల్గొన్న సభలన్నిటిలో వీక్షణం ప్రత్యేకమైనదని అభిమానాన్ని వ్యక్తం చేసారు. నన్నయ్య చెప్ప

వీక్షణం-58వ సమావేశం

వీక్షణం
-పొట్లూరి చాయాదేవి నేటి సమావేశం లోని ముఖ్యాంశాలు:- ఈ సమావేశానికి శ్రీ మేకా రామస్వామి గారు ఆహ్వానం పలుకుతూ సాహితీ ప్రపంచానికి ఎల్లలు లేవని అన్నారు. తెలుగు భాష తీగలు భువనమంతా పాకాయని, వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రతీ తెలుగు వారికి ఉందని తెలిపారు. శ్రీమతి కాత్యాయనీ విద్మహే గారు మరాఠీ అనువాదం "మా బతుకులు" అనే పుస్తకం గురించి విశ్లేషణ చేసారు. తను ఎక్కువగా సాహిత్యంలో స్త్రీల సమస్యల పై స్పందిస్తానని అన్నా రు. స్త్రీల రచనలు సేకరించడం తన బాధ్యతగా భావించానని అన్నారు. సాహిత్యంలో స్త్రీల రచనల పట్ల అసమానతలున్నాయని, వాటిని రూపుమాపాలని, స్త్రీలు తమ రచనలలో తమ అభిప్రాయాలని స్వేచ్ఛగా పొందుపరుస్తారని అన్నారు. స్త్రీల రచనల్లో ఆత్మ కథలు, స్వీయ చరిత్ర లు బహు తక్కువని, అందులో ఒకటి మహారాష్ట్ర లో 1965 లో దళిత మహిళ సమాజంలో అనుభవించిన బాధల సమాహారమే "మా బతుకులు" నవల అన్నారు. మా బతుకులు నవల మరాఠీ భాషలో 1980 లో స్త్రీ