Tag: ఆర్. శర్మ దంతుర్తి

ముష్టివాడు

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి అమెరికా నుంచి వచ్చిన స్నేహితుడు రమ్మంటే రామ్మూర్తి ఊరి బయట శివాలయానికి బయల్దేరాడు. ఇదే ఊళ్ళో ఉంటూ ఎన్నాళ్ళనుంచో చూస్తున్న శివాలయంలో రామ్మూర్తికి పెద్దగా చూడ్డానికేమీ లేదు; వెళ్ళడం ఇష్టం లేదు కూడా. గుడి ఆవరణలో ఉండే బిచ్చగాళ్ళూ, కుష్టివాళ్ళనీ చూడ్డం అంటే రామ్మూర్తికి చిరాకు. పైన గుడిలో లోపలకి వెళ్ళాక పూజారి చేత్తో చాచిన కంచంలో ఏదో దక్షిణ వేయాలి. లేకపోతే ఈ పంతులు గారు ఊళ్ళో అందరితోనూ ఫలానా రైస్ మిల్లు రామ్మూర్తిగారు దేవుడికి కూడా దక్షిణ ఇవ్వలేదు అని అందరితో చెప్తాడు. సుబ్రహ్మణ్యం, ఉరఫ్ - సుబ్బుడు తనతో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాడు. అసలే అమెరికా అంత దూరం నుంచి వచ్చి పిలిచినవాడు రమ్మంటే వెళ్ళకపోతే బాగోదు కనక బయల్దేరాడు – జేబులో కాసిని చిల్లర డబ్బులు పెట్టుకుని. సుబ్బుడు, రామ్మూర్తీ కలుసుకుని చాలా ఏళ్ళయింది కనక కబుర్లు చెప్పుకుంటూ దారిలో వచ్చేపోయే వాహనాలని దాటుకుంటూ ఆవు