కవితా స్రవంతి

నీ సన్నిధి

-వెన్నెల సత్యం

అనుక్షణమూ చకోరమై తపిస్తాను నీకోసం!!
నా విరహమె గజళ్ళుగా రచిస్తాను నీకోసం!!

నీ సన్నిధి లేనప్పుడు ఈస్వర్గం నాకెందుకు
నవ్వుతూనె నరకాన్ని వరిస్తాను నీకోసం!!

నీతో నేను గడిపినదీ ఓ గుప్పెడు క్షణాలే
జ్ఞాపకాల సంద్రాన్నే మధిస్తాను నీకోసం!!

ఊపిరివై నావెంటే నిలిచావా ఓ చెలియా
ఏడేడూ లోకాలను జయిస్తాను నీకోసం!!

ఎదగుడిలో దేవతవై నీవున్నది ఓ ‘సత్యం’
నా ప్రాణం తృణప్రాయం త్యజిస్తాను నీకోసం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked