‘చేనేత మొగ్గలు’ – పుస్తకపరిచయం
చేనేత మొగ్గలు
రచయిత: తాటిపాముల మృత్యుంజయుడు
ఆంగ్లపదం Handloom మనందరికి పరిచయమే. దీనికి సమానార్థమైన తెలుగుపదం 'చేనేత '. గ్రామీణ జీవిత నేపథ్యం గలవారికి ఈ వృత్తి గురించి ఎంతో కొంత సమాచారం తెలిసే వుంటుంది. నాకైతే బాల్యంలో మావూళ్లో తిరిగిన 'పద్మశాలీ' వాడ గుర్తుకు వస్తుంది. అక్కడి ఇళ్లలోనుండి వచ్చే మగ్గాల శబ్దాలు, వీధి పొడుగునా ఆరబోసిన జలతారుల్లాంటి నూలు దారాలు, ఆడామగా కలిసి పనిచేసే దృశ్యాలు గుర్తుకు వస్తాయి. అయితే, అప్పుడు చేనేత పనిలో వుండే కష్టాలు, నష్టాల గురించి తెలిసేది కాదు.
'చేనేత మొగ్గలు ' కవితాపుస్తకంలో కవి డా. భీంపల్లి శ్రీకాంత్ చేనేతకారుల జీవితాల్ని 360 డిగ్రీల్లో చూపిస్తూ 60కి పైగా పేజీల్లో నిజాయితీగా స్పృశించారు. చెప్పగా విన్నవి, చదువగా తెలుసుకొన్నవి, చూడగా అర్థమైన విషయాన్ని భావుకత వున్న మనిషి ఏదో ఒక సాహిత్య రూపంలో కొన్ని పేరాగ్రాఫుల్లో రాయగలడు. కాని 60 పేజీల్లో కవితా ప్రక్రియ