కరోనా కాటు
-ఆర్. శర్మ దంతుర్తి
మహా భాగవతంలో కధ ఇది. కృష్ణుడు తన మనుమడైన అనిరుద్ధుణ్ణి రక్షించడానికి శోణపురంలో ఉన్న బాణాసురుడిమీదకి దండెత్తి వెళ్తాడు. ఈ బాణాసురుడు గొప్ప శివభక్తుడు. వాడితో యుద్ధం చేస్తూ వైష్ణవ జ్వరం అనేదాన్ని కృష్ణుడు ప్రయోగిస్తాడు, ఆ బాణాసురుడు వేసిన శివజ్వరం అనే అస్త్రానికి ప్రతిగా. మొత్తానికి కధలో బాణాసురుడి ఉన్న వేయి చేతుల్లో నాలుగింటిని వదిలి మిగతావాటిని ఛేధిస్తాడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో. ఆ తర్వాత శివజ్వరం అనేది కృష్ణుడి దగ్గిరకి వచ్చి క్షమించమని అడిగితే ఆయన చెప్తాడు, “నన్ను శరణు జొచ్చావు కనక బతికిపోయావు, నన్ను తల్చుకుంటే ఎవరికీ నీ వల్ల కష్టాలు రావు,” అని. ఈ కధ, జ్వరం అనే అస్త్రాలు ఎందుకు గుర్తొచ్చాయంటే గత ఏడాది చివర్లో ప్రపంచం మీద విరుచుకుపడిన ఇటువంటి అస్త్రమే కరోనా. ఇది ఎక్కడ ఎలా మొదలైంది అనేది మాత్రం ఇంకా ఎవరికీ తెలియకుండా ఉంది. దానిక్కారణాలు అనేకం, వచ్చినది ప్రయోగశాలలోం