కవితా స్రవంతి

తాగ నేల?

కవితా స్రవంతి
-తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి తాగనేల తలతిరగనేల ఆపై తూగనేల తేనీగలందించు తియ్యని తేనుండగ తేయాకు తెచ్చిన కమ్మని తేనీరుండగా మురిగిన విప్పపూలను మరిగించగొచ్చిన ఈ కంపుని తాగనేల తాగి తూగనేల నురగ కక్కు బీరు కంపు కమ్మగుండు ఐసు ముక్కలపై అమృతం ఊరగాయలలో పరమామృతం కేకు ముక్కలతో మేకప్పు ఫేసు బుక్కులో లైకులు కిక్కు పై... కప్పు పై కెక్కుదాకా పెగ్గు పై పెగ్గు కొట్టి తాగనేల తాగి తూగనేల తనివితీరా పాత మిత్రులను తలచుకొని తూలనాడుటకా పాత ప్రేయసి పేర విరహ గీతాలు ఆలపించుటకా నిజాల నిగ్గు తేలుస్తూ సత్య హరిచంద్ర పద్యాలు పాడుటకా క్రొత్త క్రొత్త భాషలందు కించిత్ సెన్సార్ లేకుండా అనర్గళంగా వుపన్యసించుటకా పురవీధులందు పొర్లు దండంబులెట్టుటకా పరువు మట్టిపాలు చేసి మట్టినంటించుకొని నట్టింట నిలబడి అక్షింతల అనంతరం మజ్జిగ తాగనేల తాగి తూగనేల*

ఇదేం పాడుబుద్ధి నీకు?

కవితా స్రవంతి
-పారనంది శాంత కుమారి. పెద్దలను గౌరవిస్తున్న వాళ్ళను చూసి అదేమంత గొప్ప పనికాదు అంటావు. తల్లితండ్రులను ఆదరిస్తున్నవారిని చూసి అదంతా ప్రకటన కోసం అంటావు. కుటుంబంతో కలిసున్నవారిని చూసి వేరేఉండే ధైర్యంలేకే అలా ఉన్నారంటావు. తల్లితండ్రుల మాటను వింటున్నవారిని చూసి బుద్ధిలేని దద్దమ్మలంటావు. సాంప్రదాయాలను అనుసరిస్తున్నవారిని చూసి ఛాందసులు అంటావు. సమాజసేవ చేస్తున్నవారిని చూసి జీవితాన్ని ఎంజాయ్ చేయటం తెలియదంటావు. ఓర్చుకుంటున్న వారిని చూసి చేతకాని,చేవలేని వారంటావు. భక్తి చేస్తున్నవారిని చూసి బడాయి చూపుతున్నారంటావు. నీకు తెలిసినదే రైట్ అంటావు అవతలివారిదే తప్పంటావు. నోరు పెట్టుకొని సాధిస్తావు అర్ధరహితంగా వాదిస్తావు. నీ నీడను కూడా నమ్మనంటావు ఇలా అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. ఇదేం పాడుబుద్ధి నీకు?

ఆలోచించి చూడు

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. ఆలోచించి చూడు! అనృతపు అవశేషాలు తరిగి, అమృతపు అనుభవాలు కలుగుతాయి. అవలోకించి చూడు! అపార్ధాల పొరలు కరిగి, అనుబంధాల దారులు అగుపడతాయి. ఆక్షేపించి చూడు అకృత్యాల మరులు తొలగి అనునిత్యాల నిజాలు ఆవృతమౌతాయి. ఆమోదించి చూడు ఆవేదనలొదిలి ఆనందాలు ఆవరిస్తాయి. విబేధించి చూడు వికారాల వలలు తెగి వివేకాలు ఉద్భవిస్తాయి. ఆచరించి చూడు అసత్యాల తెరలు తొలగి సత్యాల సొగసులు అగుపడతాయి.

ముసలోడు

కవితా స్రవంతి
- శ్రీధరరెడ్డి బిల్లా పెచ్చులూడి పోయిన ఆ పెంకుటింటి ముందు నవ్వారు మంచంపై నడుము వాల్చిన ముసలోడు! తనను ఒంటరి వాణ్ణి జేసి పోయిన తన ఇంటిదాన్ని మింటి చుక్కల్లో వెతుకుతూ కంటిరెప్ప వేయనేలేదు! గుడ్డిదీపమున్న ఇంట్లో గూళ్ళు కడుతున్న సాలీళ్లు. మూతలేని గిన్నెపై ముసురుకుంటున్న ఈగలు . అన్నం మెతుకులకు అటూఇటూ తిరుగుతున్న బొద్దింకలు ! వచ్చీరాని వంట! ఏం వండుకున్నాడో ?ఏం తిన్నాడో? “తిన్నావా..?” అన్న చిన్నపిలుపు కూడా రాదని తెలిసిన చెవులు మొరాయించి ఎప్పుడో చెవిటివాణ్ని చేశాయి! ఏ జ్ఞాపకం హఠాత్తుగా ఏ కలవరాన్ని మోసుకొచ్చిందో? పక్కనున్న మంచాన్ని ఒక్కసారి తడిమిచూశాడు . ముసల్ది మరణించిందని ఓక్షణం పాటు మరిచాడేమో ఖాళీ మంచం వేళాకోళమాడుతూ వెక్కిరించింది!, కళ్ళకు పొరలు వచ్చి కంటిచూపు మందగించిందేమో పగిలిన అద్దాల కళ్ళజోడు కోసం చేతులు తచ్చాడుతున్నాయి! కుఱ్ఱవాళ్ళు నలుగురు , కళ్ళకు ఏ పొరలు కమ్మెనో కానీ, ఫోన్

కాలం

కవితా స్రవంతి
-తమిరిశ జానకి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువతో వేకువ పరిమళభరితం సుతిమెత్తని పూలవానలా స్నేహితాల పలకరింపులు చరవాణిలో క్రమం తప్పని కాలగతి కళకళలాడే పచ్చని ప్రకృతిలా పరవశాన పాడేపాటలా వచ్చి నిలిచింది నా ముందు మరొకవత్సరానికి తెర తీస్తూ ! వెనుకకి తల తిప్పితే ఏదో తెలియని వింత గుబులు గతాన గేలి చేసిన ఒడిదుడుకులు తలదించుకోక తప్పని తప్పులతడకలు అన్నీతరుముకొస్తున్న భ్రాంతి ! ఎదరకి చూపు సారిస్తే ఎరుకలేని ప్రశ్నావళి అంతుచిక్కని చిక్కుముడులై చుట్టూ బిగిసిపోతున్నసమస్యలవలయాలు సవాలుగా తీసుకోక తప్పదు సవాలక్ష ప్రశ్నలైనా సమస్యని విడగొడితే కద సానుకూల పరిస్థితి నెలకొనేది ! ఆగదుగా కాలం ఎవరికోసమూ అంతూదరీ అంతుపట్టక సాగిపోతూనే ఉంటుంది తెలుసుకోలేకపోయాను కాలం విలువ ! కష్టాలకి కుంగి కాలాన్నితిట్టడం సుఖాలకి కళ్ళు నెత్తికెక్కి కాలాన్ని మరవడం అదేకదా అలవాటు చేసిన తప్పులు సరిదిద్దుకోడానికే చాలట్లేదు జీవితం ఇ

ఎవరు?!

కవితా స్రవంతి
-సముద్రాల హరిక్రృష్ణ. దాశరధి!! తా శరధి! శరధి మద విదారి! ఆశల కాదని,సతిని విడచిన,వింత దారి!! ఎవడన్న వీడు, కఠిన శాసకుడొ ఎవడమ్మ వీడు లలిత నాయకుడొ?! (1) సుదతి వీడెనని వగచి సోలినాడే కుదురె కానని కపి సేన కూర్చినాడే ఎదురెలేని నీరధికి వారధి కట్టినాడే పదితలల రాకాసిని పడగొట్టినాడే. ఇంత చేసి,సీతనే చినపుచ్చినాడే పతిగ,నా విధిగ వెత దీర్చితన్నాడే! (2) కొందరెవ్వరో రవ్వ చేసిరని, రాజునని అది విని,ఇల్లాలినే కానల విడచినాడే పది.మంది మాటయే పాడియన్నాడే ఎదిచేసిన జనవాక్యమే తుది అన్నాడే! ఆనతిచ్చి సీత నడవి దింపించినాడే తానే శిక్షల వేసి బిట్టు కుమిలినాడే!! తనవారని చూడని వాడు రాజారాముడేమో మనసార వలచిన వాడు సీతారాముడేమో అన్ని ధర్మముల నిక్కపు ఆకృతి రాముడేమో అన్ని సరిత్తుల సంద్రపు విస్త్రుతి రాముడేమో! ******

మొగ్గలు

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సుఖదుఃఖాల ఆటుపోట్లను తట్టుకుంటున్నప్పుడల్లా కవిత్వం సాగరంలా తీరంవైపు పరుగెడుతుంటుంది బీడుగుండెలలో దాహార్తిని తడిపే ప్రవాహిని కవిత్వం సమాజగతిని నిత్యం పహరాకాస్తున్నప్పుడల్లా కవిత్వం జెండాలా రెపరెపలాడుతుంటుంది నిరంతర ఆర్తనాదాల అలల కచేరి కవిత్వం కవిత్వంతో కాసేపు ముచ్చట్లు పెడుతున్నప్పుడల్లా కర్తవ్యాన్ని బోధించమని సందేశమిస్తుంటుంది నటరాజుని పరవశ తాండవనృత్యం కవిత్వం పలుకుబడులతో అక్షరాలను పలకరిస్తున్నప్పుడల్లా మాండలిక మాధుర్యం పల్లెగానాన్ని వినిపిస్తుంటుంది పల్లెపదాలను అభిషేకించే అందమైన చిత్రం కవిత్వం సమాజ సంఘర్షణలను నిత్యం చిత్రిస్తున్నప్పుడల్లా ఆలోచనల ఘర్షణలు రగులుకుంటూనే ఉంటాయి అనేక వ్యధల రోదనల ఆవేదనా వీచిక కవిత్వం

వెకిలి బుద్ధులెందుకు ?

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజ రావు. వేదమంత్రాలతో ఒక్కటైన వారికి వెకిలి బుద్ధులెందుకు? పెద్దల ఆశీస్సులతో ప్రేమను పండించుకున్నవారికి పంతాలెందుకు? కాదనకుండా మీ కోరికలన్నిటిని తీరుస్తున్న ఇంటిపెద్దలపై అనవసరపు అలకలెందుకు? బంధుసముహంలో బంధమేర్పరుచుకున్నవారికి విడిగా ఉందామన్న ఆలోచనలెందుకు? ఉమ్మడి కుటుంబంలోని ఉన్నతత్వాన్ని ఉరితీద్దామన్న ఊసులెందుకు? కలివిడితనం లోని కమనీయతను కర్కశంగా కాలరాస్తారెందుకు? వైవాహిక జీవితంలో ఓర్పులేని,ఓర్వలేని మీకు విరివిగా ఈ వైరాలెందుకు?

ఏది నిజం

కవితా స్రవంతి
 -- తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి నీదే ఇజం నాదే ఇజం ఏది నిజం? ఈ ఇజాల మధ్య నలిగేదే నిజం మనుషుల్లో పోయిన మానవత్వం జనాల కొచ్చిన జడత్వం తంత్రాలతో కుతంత్రం వ్యాకోచిస్తున్న సంకుచితత్వం సుత్తి కొడవలి నెత్తిన టోపీ ఖాకి నిక్కరు చేతిన లాఠీ బొడ్లో కత్తి బుగ్గన గాటు మెడలో మాల చేతిన శంఖం చంకన గ్రంధం వక్తలు ప్రవక్తలు ఇజాలు వేరట నిజాలు వేరట వారిదో ఇజం వీరిదో ఇజం ఏది నిజం? ఈ ఇజాల మధ్య నలిగేదే నిజం మసిదు మాటున నక్కే ముష్కరులు గుడి నీడన చేరిన గాడ్సేలు చర్చి చావిట్లో చైల్డ్ యభ్యుసర్స్ అడవుల్లో అతివాదులు మన మధ్య మితవాదులు ఎవరివాదనలు వారివి నిజవాదం నేడో వివాదం నీదే ఇజం నాదే ఇజం ఏది నిజం? ఈ ఇజాల మధ్య నలిగేదే నిజం ఇజాల నీడలో నిజాలు దాగవు నిజాల వెలుగులో ఇజాలు ఇమడవు నిజాన్ని చూడలేని అంధులు సాటి మనిషిలో శత్రువుని చూడగా మానవత్వం ఎండమావే మనుషులంతా ఒక్కటనే మిద్య మన మ