సుజననీయం

సిసలైన తెలుగుతేజం

సుజననీయం
ప్రతి మనిషికి తన జీవితకాలంలో కొన్ని అరుదైన, అపురూపమైన సంఘటనలు ఎదురైతాయి. ప్రస్తుతం జగమంతా నిండిన తెలుగు వారికి అలాంటి సంఘటనే జూన్ 16న జరిగింది. అప్పటివరకు ప్రపంచంలోనే రెండవ పెద్ద కంపెనీగా వ్యవహరింపబడుతున్న ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవో గా ఉన్న సత్య నాదెళ్ళను బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ చైర్మన్ గా కూడా ఎన్నుకొన్నారు. ఈ రెండు పదవులను అలకరించిన మొదటి మనిషి ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. తెలుగువాడు ఈ స్థాయికి ఎదగడం మనందరికి గర్వకారణం. సత్యనారాయణ నాదెళ్ళకు సుజనరంజని అభినందనలు తెలుపుతున్నది. అలాగే, తొంభై దాటి జీవిస్తే నూరేళ్ళు చేరుకున్నట్టే అన్నది నానుడి. అలా పరిపూర్ణంగా జీవించిన కారా మాస్టారు స్థాపించిన కథానిలయం తెలుగు కథలకు కేరాఫ్ అడ్రసుగా నిలిచింది. ప్రముఖ కవి సుధామ గారు సుజనరంజని సంపాదకురాలు తమిరిశ జానకి గారితో కాళీపట్నం రామారావు గురించి తమ జ్ఞాపకాలను పంచుకొన్నారు. సాహితీ వార్తలు శీర్

దేశభక్తి కవిత

సుజననీయం
దేశమే నేను-నేనే దేశము రచయిత్రి-తమిరిశ జానకి దేశమంటే మట్టికాదని దేశమంటే మనుషులని పాడుకుందాం గురజాడవారి జాడలో ! వట్టిమాటలు కావవి గట్టిమేలుకొలుపులు మనసా వాచా కర్మణా దేశాన్ని ప్రేమించు మనుషులం మనమవుదాం మంచిమనసులకు రూపాలు అవుదాం ! నడుచుకుందాం తోటిమనిషికి సాయపడుతూ నడవనిద్దాం వారి వృద్ధికి అడ్డుపడక ! నటనకాదు దేశభక్తి స్వతహాగా రావాలి మనసులోంచి ! దేశం నాకేమిచ్చిందని రుసరుసలాడకు దేశానికి నేనేమి చెయ్యగలనని యోచించు ! ఏడాదికోసారి ఎగరవేస్తే జెండా అయిపోదు బాధ్యత అని తెలుసుకుందాము ! కులమతభేదాలు కుతంత్రాలు కూలదొయ్య్కపోతె ప్రక్షాళన చెయ్యకుంటె అవినీతీ అక్రమాలు దేశమేగతి బాగుపడును భవిత ఏ తీరున చక్కపడును ! భావిభారత పౌరుల తీర్చిదిద్దాలంటె ఉండాలి మెండుగా దేశమంటే భక్తి నేనే దేశము దేశమే నేనన్న భావన నిండాలి మనసున దండిగా ! ఎందరి త్యాగఫలమో మనదేశ స్వాతంత్ర్యం అర్పించుకుందాము అందరికీ వందనాలు ! గౌరవ

కీ.శే. చంద్ర గారికి సుజనరంజని నివాళి

సుజననీయం
ప్రఖ్యాత చిత్రకారుడు, కీ.శే. చంద్ర గారికి సుజనరంజని నివాళి! కొద్ది రోజుల కాలం చేసిన చిత్రకారుడు చంద్ర గారితో సిలికానాంధ్ర సంస్థకు, సుజనరంజని మాసపత్రికకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. వాటి అక్షర గుర్తింపు చిహ్నాలను (logos) తీర్చి దిద్దింది ఆ మహనీయుడే. అలాగే, అన్నమయ్య అంటే ఇలాగుండాలి అని అన్నమయ్య ఉత్సవాల కోసం పదకవితామహుణ్ణి కో అందమైన రూపం కల్పించి ప్రపంచమంతా అందరూ ఉపయోగించుకునేలా చేసింది ఆ అపురూప శిల్పియే. ప్రతి ఏడు వెలువడే ప్రత్యేకసంచికలలో కొన్నింటికి ముఖచిత్రం వేయటమే కాకుండా లోపలి కథలు, కవితలకి బొమ్మలు కూడా గీసారు. ఈ పనుల్లో వారితో ఫోనులో పలుసార్లు సంభాషించటం జరిగింది. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆ మాటలు నెమరువేసుకుంటాను. తెలుగు ప్రజలకు తీర్చలేని లోటు అతని మరణం. ఓం శాంతిః - తాటిపాముల మృత్యుంజయుడు

సుజననీయం

సుజననీయం
ప్రొ. వేల్చేరు నారాయణరావు ప్రవాసాంధ్రుడైన నారాయణరావు గారు అమెరికా దేశంలో తెలుగు ఆచార్యుడిగా పనిచేశారు. ప్రఖ్యాత తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య, క్షేత్రయ్య గార్ల సాహిత్యాన్ని మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవ పురాణం, క్రీడాభిరామం వంటి ప్రసిద్ధ తెలుగు రచనల్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పురస్కారాన్ని 14వ గ్రహీతగా, తొలి భార్తీయునిగా అందుకొన్నారు. 1971నుండి ప్రముఖ తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని, ఇతరులతో కలిసి ఆంగ్లంలోకి అనువదిస్తూ తెలుగుభాషకు ఎనలేని సేవ చేస్తున్నారు. డేవిడ్ షుల్మన్ తో "క్లాసికల్ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ" అను రచనకు సహ రచయితగా, సహ సంపాదకుడిగా మరియు "గాడ్ ఆన్ ద హిల్: టెంపుల్ పోయెమ్స్ ఫ్రం తిరుపతి" అను రచనకు సహ ఆంగ్లానువాదకుడిగా వ్యవహరించారు. "ట్వంటీయత్ సెంచురీ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ" అను గ్రంథానికి సంపాదకత్వం, అనువాదం అందించారు. గురజాడ అప్పారా

డా.సి.ఆనందారామం

సుజననీయం
- తమిరిశ జానకి విద్వన్మణి,ప్రముఖరచయిత్రి మంచిమనిషి డా.సి.ఆనందారామంగారు నిన్నరాత్రి (Febraury 11) మనందరినీ వదిలి వెళ్ళిపోయారన్న వార్త ఈ ఉదయం తెలియగానే మనసు స్తబ్ధుగా అయిపోయింది. ఈమధ్య కొన్నిరోజులుగా ఆవిడకి ఒంట్లో బాగులేదని తెలిసి రెండుసార్లు పలకరించాను. ఫోన్లో కూడా ఒక్క నిమిషం కంటే మాట్లాడలేకపోతున్నాను జానకీ అన్నారు.అందుకే తరచుగా ఫోన్ చెయ్యడం మానేశాను.ఆవిడ ఆరోగ్యం ముఖ్యం కదా. ఈ కరోనా గొడవ కాస్త తగ్గితే వెళ్ళి చూసిరావాలనుకున్నాను. ఎప్పుడు సభల్లో కలిసినా మాజానకి అంటూ నన్ను దగ్గిరకి తీసుకునేవారు. మా పుట్టిల్లు ,ఆవిడ అత్తవారిల్లు రెండూ నర్సాపురమే. పైగా ఆవిడ అత్తవారిల్లు మా నాన్నగారింటికి దగ్గిరే. నర్సాపురంలో మా తాతయ్య గారి కాలేజీ వై.ఎన్.కాలేజ్ లో ఆవిడ కొన్నాళ్ళు లెక్చరర్ గా చేశారు. అందరికీ ఆవిడంటే చాలా గౌరవం. నర్సాపురంలో అప్పట్లో ఆ కాలేజీలో చదివిన మా కజిన్స్ అందరికీ ఆవిడ తెలుసు.మా అందరికీ ఆవిడ

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం

సుజననీయం
*అంతర్జాల మాధ్యమం ద్వారా 2021 సంవత్సరపు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం* జనవరి 30, 2021 శనివారం సాయంత్రం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గ మండలి, అధ్యాపకులు, విద్యార్థులు, దాతలు, శ్రేయోభిలాషులు అంతర్జాల స్నాతకోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. 2021 సంవత్సరంలో పట్టభద్రులవుతున్న విద్యార్థులు (Class of 2021) సాధించిన విజయాలను ప్రతిఫలింపజేసుకొంటూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందించిన తోడ్పాటును తలచుకొంటూ, వారు మొదలెట్టబోతున్న నూతన రంగాల్లో విజయాలను అభిలషించారు. మిల్పిటాస్, జనవరి 30, 2021 - సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులవుతున్న 2021 సంవత్సరపు విద్యార్థులను అభినందిస్తూ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ 'తాము సాధించిన విజయాలను చూసి గర్వపడాలని ' అన్నారు. సభను ఉద్దేశిస్తూ, "భారతదేశ సంస్కృతి ఎంతో పురాతనమైనది. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం తొలినాళ్లలోనే ప్రపంచ ప్రఖ్యాతినొ

ఆకాశమే హద్దు!

సుజననీయం
పుట్టగానే బంగారు తొట్టెలో నిద్రపోక పోవచ్చు. జీవితం వడ్డించిన విస్తరి కాకపోవచ్చు. 'ఆడ'తనం ఎన్నో అడ్డంకులను తెచ్చిపెట్టవచ్చు. జాతి, మత, వర్ణాలు అనేక ఆటంకాలను ఎదురుపెట్టవచ్చు. వీటన్నిటిని అధిగమిస్తూ, 'ఆసాధ్యం' కానిదేది లేదంటూ అగ్రరాజ్యంలో ఒక అధినేతగా వెలుగబోతున్న అచ్చమైన భారతీయత పేరున్న 'కమల దేవి ' హార్రీస్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. (గమనిక: సిలికానాంధ్ర ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఏ ఒక్క రాజకీయ సిద్ధాంతాన్ని బలపరచదు. సిలికానాంధ్ర ఒక సాంస్కృతిక సంస్థ.)

సుజననీయం 2020

సుజననీయం
శ్రీ పీ వీ నరసింహారావు, శతజయంతి The TRUE Legend! Sri PV garu, the leader who made India what it is today. ‘దేశాభివృద్ధిలో, జాతి ప్రగతిలో సాంస్కృతిక రంగం పాత్ర కీలకం. జాతి సమగ్రతను పరిపుష్టం చేయడంలో కళారంగం పోషించే పాత్ర బృహత్తరం. సాంస్కృతిక సమైక్యతతోనే నిజమైన భావసమైక్యత సిద్ధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.’ - కూచిభొట్ల ఆనంద్, అధ్యక్షుడు, సిలికానాంధ్ర బహుభాషా పాండిత్యం, నిఖార్సయిన వ్యక్తిత్వం రాజనీతి చాతుర్యం, జాతి వికాస కర్తృత్వం తెలంగాణ తేజోమూర్తి, తెలుగుజాతి వెలుగుల దీప్తి భరతజాతి జ్ఞాన సంపత్తి, తరతరాలకు నిత్య స్ఫూర్తి అతడే మన పీవీ నరసింహారావు , భారత మాజీ ప్రధానమంత్రి (స్వతహాగా మంచి సాహిత్యవేత్త అయిన శ్రీ పీవీ రాసిన కథ, కవిత ఈ సంచికలో తప్పక చదవండి) -తాటిపాముల మృత్యుంజయుడు ముఖచిత్రం: శ్రీ PVR మూర్తి

తెలుగు సాహితీ ద్వయం

సుజననీయం
ఈ నెల ముఖచిత్రంపై ఇద్దరు తెలుగు సాహితీ ఉద్ధండులు కొలువుదీరారు. ఇద్దరు పుట్టినరోజులు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఒక మొట్టమొదటి తెలుగు 'జ్ఞానపీఠ అవార్డు ' గ్రహీత కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మరొకరు తెలుగు భావకవిత్వంలో తనకొక అధ్యాయాన్ని ఏర్పరుచుకొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి. వీరిరువరిని ఈ విధంగా స్మరించుకోవటం తెలుగు సాహిత్యానికి వందనం చేయటమే. ఈ సందర్భంగా విశ్వనాథవారి కథ 'మాక్లీదుర్గంలో కుక్క ' ప్రచురిస్తున్నాం. విశ్వనాథ సత్యనారయణ గారు ఎంతటి వవిధ్యమైన రచనలు చేశారో తెలియటానికి ఇదొక చిన్న ఉదాహరణ. జై తెలుగు! -తాటిపాముల మృత్యుంజయుడు