Author: Sujanaranjani

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: సంసార సుఖంబులబ్బు సన్యాసికిలన్ (శ్రీ చిరువోలు విజయ నరసింహా రావు గారు పంపిన సమస్య) ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న: యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్ (“నిద్ధరన్” అని ఉంటే బాగుండేది అని శ్రీ M.V.S. రంగనాధం గారు సూచించారు) ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి. ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్ (1) ఉ. యుద్ధమె జీవితమ్ము, గెలు పోటము లుండును, పోరు సాగగన్

‘అనగనగా ఆనాటి కథ’

కథా భారతి
-సత్యం మందపాటి స్పందనః నాకు ఆనాటినించీ ఈనాటిదాకా ఎన్నో పుస్తకాలు, పత్రికలూ చదివే అలవాటు వుందని చెప్పాను గదా! అలాగే కొన్ని పత్రికల్లో పడుపు వృత్తి గురించి, వారు అలాటి వృత్తిలోకి కావాలని రాకపోయినా, ఆ విషవలయంలోకి ఎలా కొందరు స్వార్ధపరులు డబ్బుకోసం వారిని ఆ రొంపిలో తోసేస్తారు, సమాజంలో ఆ వృత్తి చేసుకునే వారికి మర్యాద, గౌరవం ఎలా వుంటుంది మొదలైన విషయాలు చదువుతుంటే వచ్చిన ఆలోచనే ఈ కథ వ్రాయటానికి స్పందన. ఈ కథ ఆంధ్రపత్రికలో వచ్చాక, ఎందరో పాఠకులు మెచ్చుకుంటూ ఉత్తరాలు వ్రాశారు. అంతేకాక, ఆనాటి కొన్ని మంచి కథలు ప్రచురించిన ఒక కథా సంపుటిలో కూడా, ప్రత్యేకంగా ఆ పుస్తకానికే “మనిషి” అని పేరు పెట్టి ప్రచురించారు. ఇది నాకిష్టమైన కథల్లో ఒకటి. మీ అభిప్రాయం కూడా చెబుతారు కదూ! 0 0 0 మనిషి (ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక సెప్టెంబర్ 4, 1974 సంచికలో ప్రచురింపబడింది) ఒకసారి ఆ ఆరుగురినీ పరీక్షగా చూశాడతను. ముఖాలకు

సిసలైన తెలుగుతేజం

సుజననీయం
ప్రతి మనిషికి తన జీవితకాలంలో కొన్ని అరుదైన, అపురూపమైన సంఘటనలు ఎదురైతాయి. ప్రస్తుతం జగమంతా నిండిన తెలుగు వారికి అలాంటి సంఘటనే జూన్ 16న జరిగింది. అప్పటివరకు ప్రపంచంలోనే రెండవ పెద్ద కంపెనీగా వ్యవహరింపబడుతున్న ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవో గా ఉన్న సత్య నాదెళ్ళను బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ చైర్మన్ గా కూడా ఎన్నుకొన్నారు. ఈ రెండు పదవులను అలకరించిన మొదటి మనిషి ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. తెలుగువాడు ఈ స్థాయికి ఎదగడం మనందరికి గర్వకారణం. సత్యనారాయణ నాదెళ్ళకు సుజనరంజని అభినందనలు తెలుపుతున్నది. అలాగే, తొంభై దాటి జీవిస్తే నూరేళ్ళు చేరుకున్నట్టే అన్నది నానుడి. అలా పరిపూర్ణంగా జీవించిన కారా మాస్టారు స్థాపించిన కథానిలయం తెలుగు కథలకు కేరాఫ్ అడ్రసుగా నిలిచింది. ప్రముఖ కవి సుధామ గారు సుజనరంజని సంపాదకురాలు తమిరిశ జానకి గారితో కాళీపట్నం రామారావు గురించి తమ జ్ఞాపకాలను పంచుకొన్నారు. సాహితీ వార్తలు శీర్

జన్మ దినోత్సవం

కవితా స్రవంతి
- అరాశ (అమరవాది రాజశేఖర్ శర్మ) ఫోమును ప్రెస్ చేసి మోమంత చల్లేసి                కంపును కొంపంత నింపుతారు క్రొవ్వొత్తులంటించి రివ్వుననూదుచు               నోర్పుగా దీపాల నార్పుతారు కేరింతలనుగొట్టి కేకును ఖండించి               క్రీము ఫేసులకద్ది గెంతుతారు సరదాలు పండించ సఖులంత వరుసగా               వీపుపై గ్రుద్దులు మోపుతారు   పిచ్చి కేకల బొబ్బల రెచ్చిపోయి గాలి బుడగల పిన్నుతో కూలదోసి అల్ల కల్లోల భావన నల్లుతారు జన్మ దినమను పర్వమున్ జరుపువేళ   దేహమునిచ్చి పెంపుగొన దీవెనలిచ్చి సరాగమున్నిడన్ స్నేహితులై చెలంగి మది చింతలెరుంగని సౌఖ్యమిచ్చు స మ్మోహన దేవతల్ గనగ మోదమగున్ తలిదండ్రులన్న దా సోహమటంచు జన్మదిన శోభనమున్ ప్రణమిల్ల సౌఖ్యమౌ   వందనమిదె గొనుమా గో విందా యని కోవెల జని వేడుక తోడన్ బృందా విహారిని జనన పుం దినమున గన్న యమిత పుణ్యంబబ్బున్   వృద్ధ జనులకు సేవ సమృద్

అసాధ్యుడు

అసాధ్యుడు (పి వి మొగ్గలు) - డా. భీంపల్లి శ్రీకాంత్ జూన్ 28వ తేది మాజీ ప్రధాని కీ.శే. పాములపర్తి వెంకట నరసిం హారావు శతజయంతి. కేంద్ర ప్రభుత్వం బిరుదు ఇవ్వక పోయినా పివి ని భారతజాతి రత్నంగా పరిగణించవచ్చు. దేశ ఆర్థిక సంస్కర్త, భారతదేశ నూతన శకానికి కర్త అయిన పి.వి. నరసిం హారావును మనదేశపు ఠీవీగా చెప్పుకోవచ్చు. రాజకీయవేత్తగా, విద్యార్థి నాయకుడిగా, సాహితీమూర్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా, ఇంకా తనను వరించిన ఇతరపదవులకే వన్నె తెచ్చి, తను పనిచేసిన అన్న్ని రంగాల్లో ఆదర్శప్రాయుడుగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశీలిని 360 డిగ్రీలలో ప్రస్తుతించారు కవి శ్రీకాంత్ గారు. మూడు పాదాల కవితల్లో, సరళమైన భాషలో, చదవగానే సులభంగా అర్థమయ్యే పదానుక్రమణతో రచించారు కాబట్టి 'పి వి మొగ్గలు ' అని కవితా సంపుటి పేరు పెట్టారనుకోవచ్చు. పాలమూరు సాహితి, మహబూబ్ నగర్ ప్రచురించిన 40 పేజీల ఈ పుస్తకం కావాలనుకొన్నవ

ముఖచిత్రం

విఖ్యాత తెలుగుతేజం - మైక్రోసాఫ్ట్ చైర్మన్ & సీఈఓ - సత్య నాదెళ్ళ కారా గారితో జ్ఞాపకాలు - సుధామతో ప్రశ్నోత్తరాలు (సాహితీ వార్తలు)  

తనకు మాలిన ధర్మము

కథా భారతి
— బి వి లత ‘శశీ, ఎక్కడకు వెళుతున్నావు?’ ‘ఇప్పుడే వస్తా’ ‘నా మాట వినరా! బయట పరిస్ధితి బాగా లేదు, నువ్వు చెపితే వినవేం? ఊరంతా కరోనా అని భయపడుతోంది. జాగ్రత్తగా ఉండాలిరా’ ‘అందుకే వెళుతున్నానమ్మా! ఎవరికో ఎమర్జన్సీట!’ ‘కనీసం ఆ పి పి యీ కిట్టు ఏదో ఉంటుందిగా, అదేదో వేసుకోని, మాస్కన్నా సరిగ్గా పెట్టుకో’ ‘నాకు తెలుసులేమ్మా, నస పెట్టకు’ అంటూ హడావుడిగా వెళ్ళే కొడుకు కేసి బెంగగా చూస్తూ, ‘చూడండి, వాడు నా మాట వినకుండా, ఎలా వెళుతున్నాడో?’ అంటూ భర్తకు ఫిర్యాదు చేసింది సుగుణ. ‘ఇది మీ ఇద్దరకీ మాముూలేగా? కాస్త కాఫీ ఇవ్వు’ అంటూ శరత్ గారు టివి న్యూస్ చూడటంలో మునిగి పోయారు. *** ‘శశి రాలేదా?’ ‘లేదు, రాత్రి 10 అయ్యింది, రోడ్డుమీద పురుగు లేదు, వీడు ఎక్కడ ఉన్నాడో? ఫోన్ కూడా ఎత్తడు. అదిగో, వచ్చినట్లున్నాడు, శశీ, నీళ్ళు బయట పెట్టా, అక్కడే బట్టలు వదిలి, రెండు చెంబులు పోసుకోని రా’ వి

వీక్షణం సాహితీ గవాక్షం-106 వ సమావేశం

వీక్షణం
-వరూధిని వీక్షణం-106 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆసక్తిదాయకంగా జూన్ 13, 2021 న జరిగింది. ఈ సమావేశంలో కా.రా. మాస్టారికి నివాళి గా "కాళీపట్నం రామారావు గారి కథలు" అనే అంశమ్మీద శ్రీమతి కొండపల్లి నీహారిణి గారి ప్రసంగం, కవిసమ్మేళనం జరిగింది. ముందుగా నీహారిణి గారు మాట్లాడుతూ కథానిలయం రూపకర్త, కథలకు చిరునామా కారా మాస్టారు గారి గురించి వీక్షణం లో మాట్లాడే అవకాశం కలగడం సంతోషదాయకమైన విషయం అని పేర్కొంటూ "ఎప్పుడో చదివిన కారా గారి కథలను మళ్ళీ ఇప్పుడు చదివి మరింత లోతుగా వారిని అర్థం చేసుకున్నాను" అన్నారు. కాళీపట్నం రామారావుగారి కథల గురించి వివరిస్తూ "కవి క్రాంతదర్శి అనడం బహుశా: ఇటువంటి గొప్ప రచయితలు ఉంటారనే నిర్వచించి ఉంటారు మన పూర్వీకులు. ఇంతలా మనసుపెట్టి సమాజాన్ని పరిశీలించి , మంచి చెడులను కథలుగా మలిచిన కథా రచయితలు బహుతక్కువగా ఉన్నారు. కాళీపట్నం రామారావుగారు కథలను అల్లలేదు. కథలలో జీవితాలను చూ

అసలుది తప్ప!!

కథా భారతి
- సముద్రాల హరిక్రృష్ణ "ఎండను పడి వచ్చారు ఏం తీసుకుంటారు?!" "అబ్బే, ఏమీ వద్దండీ, అది ఇచ్చేస్తే,తీసుకెళ్దామనీ....." "మజ్జిగ పుచ్చుకుంటారా!అయినా, పేరుకె కానీ,ఏం మజ్జిగ లేండి,తెల్లటి నీళ్ళు తప్ప...." "సరిగ్గా చెప్పారు,ఒక్క వస్తువు ససిగ ఉండట్లేదు పాలు బాగుంటే కద మజ్జిగ రుచి సంగతి..". "బుర్రలో మాట అందిపుచ్చుకున్నట్టు చెప్పారు.దాణా బాగుంటే కాదుటండీ పాడి ,అదీ వదలట్లేదుగా మహానుభావులు!" "అవు న్నిజమేనండీ,సామాన్య జనం మనం ఏం చేయకల్గుతాం,... మరి అది కాస్తా ఇప్పిస్తే...." "ఏం సామాన్యమో ఏం జనమో, చురుకు లేదు ఒక్క శాల్తీలో, నిలదీసి అడిగి,కడిగి పారేయద్దండీ, వెధవ పిరికితనం కాకపోతేనూ!!మనిషన్నాక ఆ మాత్రం ఖలేజా ఉండద్దూ!" "ఎట్లా ఉంటుందండీ ఖలేజా?!వాళ్ళా- డబ్బు, దస్కమ్; మందీ మార్బలం ఉన్నవారు,జనం దగ్గర ఏముంది? రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాయె!" "అదిగొ, ఈ చేతకాని మాటలే నాకు నచ్చవు.మన