ధారావాహికలు

రామాయణ సంగ్రహం

శత్రుఘ్నుడు వాల్మీకి మహాముని ఆశ్రమం చేరిన ఆ రాత్రే సితాదేవి ప్రసవించి కవలలను కన్నది. ఆమె అర్దరాత్రి ప్రసవించిందని మునిబాలకులు వచ్చి చెప్పారు. అప్పుడు వాల్మీకిమహాముని శిశువులకు శాంతికపొష్టిక కార్యకలాపం ఆచరించాడు. (భూతవినాశిని, రాక్షసఘ్ని అనే రక్షాక్రియలు నెరపాడు). పిడికిటిలో దర్భలు తీసుకొని వాటిని సమభాగాలు చెసి అగ్రభాగం వాటితో ఒకరికి, అడుగుభాగం వాటితో మరొకరికీ రక్ష కలగాలని అభిమంత్రించాడు. అందువల్ల వాళ్ళకు కుశుడు (కుశమంటే దర్భ పైభాగము), లవుడు(లవమంటే దర్భ కిందిభాగం) అనే పేర్లు వచ్చాయి. ముని పత్నులు శ్రీ సీతారాములను గూర్చి పాటలు పాడారు. పురిటి పనులు నిర్వహించారు. అప్పుడు సీతాదేవి ప్రసవించిన విషయం శత్రుఘ్నుడు తెలుసుకొని వెళ్ళి ఆమెకు నమస్కరించి రఘువంశప్రదీపకులను చూశాడు.

బాగా తెల్లవారిన తర్వాత శత్రుఘ్నుడు చ్యవనమహర్షిని దర్శించాడు. శ్రిరమచంద్రుడి దగ్గరకు వచ్చి లవణుడి ఘోరకృత్యాలు చెప్పింది. ఈ మునే కాబట్టి లవణుడి దుశ్చర్యలు, వాడి వధోపాయం అడిగాడు శత్రుఘ్నుడు. అప్పుడు చ్యవనుదు ఇక్ష్వాకుకుల ప్రసిద్దుడైన మాంధాత వృతాంతం అందుకు సంబంధించి ఉండడంతో ఆ కథ చెప్పాడు శత్రుఘ్నుడికి.

‘యువనాశ్వుడి కుమారుడు మాంధాత. ఆయన ఇంద్రుడి అంతటి పరాక్రమశాలి. స్వర్గాన్ని జయించి ఇంద్రసమానత్వం పొందాలని ఆయన ఆశయం. ఈ విషయం తెలిసి దేవతలూ, ఇంద్రుడూ కలత చెందారు. ఇంద్రుడితో అర్జ్ధసింహాసనం అనుభవించాలని మాంధాత వాంఛ. మాంధాత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడికి తన కోరిక తెలిపాడు. అప్పుడు
ఇంద్రుడు భూలోకం జయించిన తర్వాత నాకలోకం విషయం ఆలోచిద్దాం. ముందు నీ లోకానికి నీకు ఏకచ్చత్రాధిపత్యం సమకూరాలి కదా! అన్నాడు. అయితే భూలోకంలో
నేను జయించని వారెవరు? అని అడిగాడు మాంధాత. ‘మధువు కుమారుడు లవణుడున్నాడే. వాడు మహాదుర్మార్గుడు. రాక్షసకృత్యాలతో పృథివిని భయకంపితం చేస్తున్నాడు. ముందు వాడి పనిపట్టు. తరువాత నాకసింహాసనం గూర్చి ఆలోచిద్దాము’ అన్నాడు ఇంద్రుడు. అప్పుడు మాంధాత ఇంద్రుడు చెప్పిన మాట ఆలోచించవలసిందే అనుకున్నాడు. పృథ్వికి వచ్చి లవణుడిపై దందయాత్రకు బయలుదేరాడు. ముందుగా తన ఆధిపత్యాన్ని శిరసావహించవలసందిగా లేకపోతే యుద్ధం తప్పదనీ లవణుడి దగ్గరకు జక దూతను పంపాడు. లవణుడు మాంధాత మాట లక్ష్య పెట్టకపోవడమేకాక ఆ దూతను చంపివేశాడు.

అప్పుడు మాంధాత లవణుడిపై యుద్ధభేరి మోగించి విక్రమించాడు. అయితే లవణుడు లక్ష్యపెట్టక పరమశివుడు అనుగ్రహించిన శూలం మాంధాతపై ప్రయోగించగా మాంధాత అసువులు బాశాడు.

422

అని ఈ కథ చెప్పి చ్వవనుడు ‘నీ చేతిలో లవణుడి చావు తప్పుదు” అని శత్రుఘ్నుణ్ణి ఆశీర్వదించాడు. ఇట్లా ఇద్దరు మునులను సేవించుకొని శత్రుఘ్నుడు లవణవధార్ధం మధునగర నమీవమునకు చేరి, నగర ద్వారమువొద్ద కనిపెట్టకొని ఉన్నాడు. ఒకసారి లవణుడు ఆహారం కోసం అడవికి వెళ్ళినప్పుడు చూచి శత్రుఘ్నుడు చేరి కోటద్వారం దగ్గర లవణుడి రాకకోసం వేచి ఉన్నాడు.

అప్పుడు లవణుడు కొన్ని వేల జంతువుల కళేబరాలతో నగరానికి వచ్చి కోట ద్వారం దగ్గర తన కోసం కనిపెట్టుకొని ఉన్న శత్రుఘ్నుణ్ణి చూసి నిప్పులు గాక్కాడు. వాళ్లకప్పుడు ఘోరమైన పోరు మొదలైంది. లవణుడు కోటలోకి పోయి శూలం తెచ్చుకోవడానికి వీలులేకుండా శత్రుఘ్నుడు నిశితశరాలతో ముందు శత్రుఘ్నుణ్ణి బలహీనుణ్ణి చేసి, తరవాత విజ్రుంభించి తన అన్న తనకు ఇచ్చిన దివ్యశరాన్ని లవణుడిపై ప్రయోగించి లవణసంహారం చేశాడు. దేవతలు శత్రుఘ్నుణ్ణి ప్రశంసించారు. బుషులు ఆశీర్వదించారు. లవణుడి దగ్గర ఉన్న శూలం పశుపతిని చేరిందప్పుడు.

దేవతలంతా వచ్చి శత్రుఘ్నుణ్ణి ఎంతగానో కొనియాడి ఇంద్రుడు మొదలుగా అందరూ ‘ఏమి కావాలో కోరుకో’ అని అడిగారు. అప్పుడు శత్రుఘ్నుడు వాళ్ళకు ప్రణమిల్లి, ‘ ఈ మధుపురం నాకు రాజధాని అయ్యేట్లు, సకల సౌభాగ్య సముపేతంగా వర్ధిల్లేట్లు అనుగ్రహించండి’ అని ప్రార్ధించాడు వాళ్ళను. దేవతలు సంతోషించారు. ‘ఇక ముందు ఈ మధుపురం శూర, వీరవరసముపేతంగా వర్ధిల్లుతుంది’ అని వరమిచ్చారు. ఆ శ్రావణమాసంలో శత్రుఘ్నుడు పురప్రేవేశం చేశాడు. శత్రుఘ్నువిజయం తెలిసి గంగాతీరంలో రహస్యంగా తిరుగుతున్న ఆయన సైన్యం మధుపురం చేరింది.

ఆ తరువాత కాలంలో ఆ ప్రదేశం ‘శూరసేన’ మని ప్రసిద్ధి పోందింది. సకలజన సంసేవ్యమానమూ, సుందరాతిసుందరమూ, సమస్తసంపద్భరితమూ అయి విలసిల్లింది. అక్కడ పన్నెండేడ్లు ఉండి శాఘ్యంగా పరిపాలన చేసిన శత్రుఘ్నుడికి తన అన్నగారిని దర్శించాలని కుతూహలం కలిగింది. కొద్ది సేనలతో మేలుజాతి రథాశ్వగజపరివారంతో ఏడు పగళ్ళు ఏడు రాత్రుల ప్రయాణంలో మధ్య మధ్య మజిలీలు చేసుకుంటూ ముందుగా వాల్మీకి ఆశ్రమం చేరుకున్నాడు. వాల్మీకి మహర్షి శత్రుఘ్నుణ్ణి ఎంతగానో అభినందించాడు. ఆయనకు ఎన్నో పూర్వ రాజన్య వృతాంతాలు చెప్పాడు. శత్రుఘ్నుణ్ణి కౌగలించుకొని ముర్ధాఘ్రాణం చేశాడు వాల్మీకి మహర్షి. ఘనంగా అతిధి సత్కార్యం చేశాడు. శత్రుఘ్నుదు ఏంతో ఆనందంగా వాల్మీకిమహర్షి పర్ణశాలలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనకు కర్ణపేయమైన సుమధుర శ్రావ్యాతిశ్రావ్యగానం వినవచ్చింది. అది

423

తంత్రీలయసమన్వితంగా ఉంది. సమ మధురోపనతార్ధ వాక్యబద్ధంగా ఉంది (సమానమైన పాదాలలో మధుర వాక్యసముపేతం). చెవులకు ఎంతో ఇంపుగా వినపడుతున్నది.అందులోని కథ ఏమిటయ్యా అంటే అది ఇప్పటివరకూ జరిగిన శ్రీరామకథ. అది విని శత్రుమ్నుడు పరవశించాడు. అతని కళ్లు చెమ్మగిల్లాయి. ఆ గానం ఎంత హృదయంగమంగా ఉందంటే ఏదో దివ్యలోకాలలో విహరిస్తున్నట్లనిపించింది శత్రుఘ్నుడికి. శత్రుఘ్నుడి ముఖ్యపరివారం కూడా ఆ దివ్యగానం విన్నది. దీని గూర్చి తెలుసుకోవలసిందని వాళ్ళు ప్రార్ధించగా శత్రుఘ్నుడు విభ్రమంతో ఇదేమిటో ఆ ముని చెప్పిందాకా తొందర ఎందుకు? అన్నాడు.

మర్నాడు ఆయన మహర్షికి నమస్కరించి సెలవు తీసుకొని అయోధ్యకు బయలుదేరారు. అక్కడాయన వేల్పులు పరివేష్టించి ఉండగా పురందరుడిలాగా కొలువు దీరి ఉన్న శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నాడు. శ్రీరాముడు తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు. శత్రుఘ్నుడు అన్నతో ఇన్నాళ్ళుగా ఎడబాటుకు వగచాడు. శ్రీరాముడాయనను ఓదార్పాడు. ఉత్తమ నాయకునికి ప్రజాపాలనమే ముఖ్య కర్తవ్యమని ప్రబోధించాడు. వారం రోజులు నాతో గడిపి మళ్ళీ మధుపురం చేరుకోవలసిందిగా తమ్ముడికి శ్రీరాముడు బుజ్జగించి చెప్పాడు. శ్రీరాముడి అనునయం మేరకు అన్నలందరికి మొక్కి శత్రుఘ్నుడు వారం రోజుల తర్వాత మళ్ళీ మధుపరానికి చేరాడు.

విప్రశోకం

శ్రీరాముడు ఎంతో ప్రజాభీష్టంగా రాజ్యం చేస్తుండగా ఒక రోజున ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఐదేళ్ళ వయసుగల తన మృతళశిశువును మోసుకొని వచ్చి అయోధ్యా నగర
ప్రధాన ద్వారం దగ్గరకు చేరి దీనాతిదీనంగా ఆ పిల్లవాణ్సి గూర్చి తలచుకొంటూ విలపించటం సాగించాడు. “నేనే పాపమూ చేయలేదు. అసత్య మాడలేదు. అధర్మ్శకార్యానికి ఒడిగట్టలేదు. ఇక మీ అమ్మా, నేనూ ఎట్లా జీవిస్తామురా!” అని కుమిలి కుమిలి ఏడ్చాడు. రాజు పట్ల ఏదో దోషం ఉంటేగాని ఇటువంటిది జరగదని” ఎలుగెత్తి అంటూ వచ్చాడు. ఇక్ష్వాకులు పాలించిన ఈ దేశానికి ఈ గతి పట్టింది ఏమిరా!” అని ప్రలాపించాడు.

ఈ దుర్భరశోకవేదన, నిందావాక్యాలు శ్రీరాముడికి తెలిశాయి. శ్రీరాముడు చాలా విషాదంలో కూరుకొని పోయినాడు. మంత్రులను పిలిపించాడు. గురువులను రప్పించాడు. తమ్ములను తోడ్కొని రమ్మన్నాడు. అప్పుడు ద్వారపాలకులు వెళ్ళితమ్ములను తోడ్కొనివచ్చారు.

424
మార్కేండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, జాబాలి, గౌతముడు మొదలైన ఋషీశ్వరులంతా వచ్చారు. వాళ్ళందరికీ విప్రశోకం గూర్చి చెప్పాడు శ్రీరాముడు.

అప్పుడు వాళ్ళు యుగధర్మం గూర్చి వివరించారు. కృతయుగంలో ధర్మం ఎట్లా ప్రవర్తమానమైందో చెప్పారు . త్రేతాయుగంలో వచ్చిన మార్చు లేమిటో చెప్పారు. త్రేతాయుగం ముగియవస్తుండగా వచ్చిన విపరీతపరిణామాలేమిటో వివరించారు. చతుర్ధవర్జుడు తపస్సు చేయడం ఈ త్రేతాయుగంలో ధర్మవిరుద్ధమనీ అటువంటి దేదో జరిగిందనీ అభిప్రాయపడ్డారు బుషులు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి ఆ బాలుడి మృతదేహాన్ని పరిరక్షిస్తూ ఉండమని చెప్పి, పుష్పకవిమానాన్ని తలచుకున్నాడు. పుష్పకం వేంటనే అక్కడకు వచ్చింది. పుష్పకాన్ని పూజించి అందులో ఎక్కాడు శ్రీరాముడు. తన ధనుర్బాణాలు తెచ్చి ఇచ్చిన లక్ష్మణుడినీ, భరతుడినీ నగరసంరక్షణలో అప్రమత్తులై ఉందవలసిందిగా ఆదేశించి, పడమటి దిశగా ముందువెళ్ళాడు. అక్కడ ఆయనకు ఏవిధమైన అపక్రమం కనప డలేదు. ఆ తరువాత తూర్పుదిశగా పయనించాదు. అక్కడా ఆయనకు ఏమీ అధర్మం కనపడలేదు. అప్పుడు దక్షిణదిశగావెళ్లాడాయన.

అక్కడ ‘శైవలం’ అనే కొండపక్కన ఒక సరస్సు సమీపంలో తలకిందులుగా తపస్సు చేస్తున్న వ్యక్తిని చూశాడాయన. శ్రీరాముడు ఆయనను “ఎవరు నీవు?” అని అడిగాడు.

అప్పుడా వ్యక్తి తాను చతుర్ధవర్ణుణ్ణి అనీ, సశరీరస్వర్గం కోసం ఇట్లా తపస్సు చేస్తున్నానన్ని, తన పేరు శంబూకుడనీ చెప్పాడు. వెంటనే శ్రీరాము డతణ్ణి హతమార్చాడు. ఆ విధంగా అధర్మచరణం చేసినవాడిని శిక్షించినందుకు దేవతలు వచ్చి శ్రీరాముణ్ణి మెచ్చుకున్నారు. ‘కావలిసిన వరం ఇస్తాము’ కోరుకోమన్నారు. అప్పుడు శ్రీరాముడు విప్రబాలుణ్ణి బ్రతికించ వలసిందిగా వాళ్ళను కోరాడు. వాళ్ళు ఇప్పటికే ఆ బాలుడు జీవించడాని శ్రీరాముడికి సంతోషవార్త తెలిపి, మేమంతా అగస్త్యమహర్షిని దర్శించటానికి వెళుతున్నాము. అయన జలస్తుడై పన్నెండు సంవత్సరాలుగా తపోదీక్షలో ఉన్నాడు. అది నేటితో ముగిసింది. మేమంతా ఆయన్ను దర్శించటానికి వెళుతున్నాము. నీవు కూడా వస్తావా? అని శ్రీరాముణ్ణి సాదరంగా అడిగారు. వాళ్ళతో శ్రీరాముడు కూడా అగస్త్యాశ్రమానికి వెళ్ళాడు. అగస్త్యుడు శ్రీరాముణ్ణి స్తుతించాడు. చక్కటి అతిథిసపర్యలు చేశాడు. ఒక దివ్యాభరణం అనుగ్రహించాడు.

అప్పుడు శ్రీరాముడికి ఒక ధర్శ్మసందేహం తోచింది. ‘మహాత్నా! బ్రాహ్మణ ద్రవ్యాన్ని క్షత్రియుడు స్వీకరించవచ్చా? అని అడిగాడు. అప్పుడు అగస్త్యమహర్షి-‘కృతయుగంలో
తమను పరిపాలించే ప్రభువు లేక, ప్రజలు బ్రహ్మదేవుణ్ణి ప్రార్ధించారు. అప్పుడు చతుర్ముఖుడు ఇంద్రాదిదేవతల నుంచి అంశభాగాలు స్వీకరించి ఆ అంశలతో ‘క్షుపుడు’
అనే పాలకుణ్ణి సృష్టించాడు. ఈ అంశలన్నిటితో క్షుపుడు ధాత్రిని పాలించాడు. ఈ అభరణం ఇంద్రాంశ వల్ల రూపొందింది కాబట్టీ నీవు స్వీకరించవచ్చు” అని చెప్పాడు శ్రీరాముడికి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked