వీక్షణం

వీక్షణం- 70


వీక్షణం 70 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో జరిగింది.

ఈ సమావేశాన్ని డా||కె.గీత కన్నడంలో నుంచి తనే అనువాదం చేసిన స్వాగత గీతంతో ప్రారంభించేరు.
శ్రీ లెనిన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం ముందుగా “వేదం” గురించి శ్రీ శ్రీచరణ్ గారి ఉపన్యాసంతో ప్రారంభించబడింది.
ముందుగా వేదం అంతే ఏవిటో వివరిస్తూ, వేదం ఆని చోట్లా ఉందని, అనుభవమే వేదమనీ అన్నారు. వేదాలు ముఖ్యంగా నాలుగు. ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వ వేదం. మత్స్య పురాణంలో వేదాల గురించిన ప్రస్తావన ఉంది. వేదాలు అపౌరుషేయాలు. విభజన చేసినంత మాత్రాన వ్యాసుడు వేదకర్త కాదు. ఈశ్వరుడి చేత బ్రహ్మకు వేదాలు ఇవ్వబడ్డాయి. వేదంలో అన్నీ ఉత్తమ పురుషలో ఉంటాయి. ప్రతీ వేదం మళ్లీ నాలుగు విభాగాలు. సంహితము, బ్రాహ్మణకము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. వీటిలో చెప్పిన సారాన్ని చివరగా చెప్పేది వేదాంతము. ఇలా వేదాల గురించి వివరంగా విశదీకరిస్తూ ఉపన్యాసం కొనసాగింది.
తరువాత శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ ఎప్పటిలానే అలరించింది.
విరామం తర్వాత శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ “నమ్మకాలు- మూఢ నమ్మకాలు” అనే అంశంమీద ప్రసంగించారు. మూఢనమ్మకాలలో భాగంగా జాతకాలు, శకునాలు, ఆచారాల గురించి వివరించారు.
చివరగా శ్రీ సుభాష్ పెద్దు రాసిన “దిష్టి” కథని శ్రీమతి ఆర్. దమయంతి సభకు ఆసక్తికరంగా పరిచయం చేశారు.
మనవరాలిని తీసుకుని ఒక పెద్దావిడ విజయవాడ నుంచి న్యూయార్క్ కు చేసిన ప్రయాణపు అనుభవాలే “దిష్టి” కథ. ఈ కథకి ప్రాణం “అమ్మతనం” అని దమయంతి గారు అన్నారు.

రచయిత సుభాష్ గారు మాట్లాడుతూ అమెరికాలో పిల్లల్ని పెంచడానికి ఇండియా నుంచి తీసుకొచ్చుకునే తల్లిదండ్రుల కష్టాలు ఈ కథకి స్ఫూర్తి అన్నారు.
ఈ సమావేశానికి శ్రీమతి ఉమా వేమూరి, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి మాధవి, శ్రీమతి శారద, శ్రీమతి కోటేశ్వరమ్మ, శ్రీమతి రమణమ్మ, శ్రీ వేమూరి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ లెనిన్, శ్రీ రమణ మున్నగు వారు హాజరయ్యేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked