-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
ఆచారం వేరు, విచారం వేరు.
ఆచారం సంప్రదాయానికి సంబందించినది,
విచారం విజ్ఞానానికి అనుబంధించినది.
ఆచారానికి మూలం నమ్మకం,
విచారానికి మూలం విశ్వాసం.
ఆచారంతో ఆధ్యాత్మికం మొదలవుతుంది,
విచారంతో ఆధ్యాత్మికం అంతమౌతుంది.
ఆచారానికి మూడత్వం జతపడితే అజ్ఞానిగా మారుతాం,
విచారానికి వేవేకం తోడవుతే జ్ఞానుల లిస్టులో చేరుతాం.
ఆచారం మనసును శుద్ధం చేయటానికి,
విచారం మనసును మేల్కొలపటానికి.
ఆచారం సాధన ద్వారా దేవుని తెలుసుకోమంటుంది,
విచారం చివరకు నీవే ఆదైవమని తెలుసుకోమంటుంది.
ఆచారం ప్రధమ దశలోని సాధన,
విచారం అంత్య దశలోని శోధన.
ఆచారం నది లాంటిది,
విచారం సంద్రం లాంటిది.
ఆచారానికి అజ్ఞానం నీడలా ఉంటుంది,
విచారానికి విజ్ఞానం తోడుగా ఉంటుంది.
ఆచారం నమ్మి పాటించమంటుంది,
విచారం తెలుసుకొనిపాటించమంటుంది.
ఆచారం కళ్ళు మూయిస్తుంది,
విచారం కళ్ళు తెరిపిస్తుంది.
ఆచారంలో వికారముంటుంది,
విచారంలో వికాసముంటుంది.
ఆచారం మనసుకి సంబంధించినది,
విచారం ఆత్మకి సంబంధించినది.