ఆమె చేసిన తప్పు
ఆమె తన పెళ్ళయిన మరు క్షణం నుంచే
అతను ప్రతి చిన్న విషయానికి తనపై ఆధారపడేలా చేసింది.
నిన్న మాత్రం అతనికి చెప్పకుండానే,
గుట్టుచప్పుడు కాకుండా అతన్ని విడిచిపెట్టి
తన దారి తను చూసుకుని వెళ్ళిపోయింది.
తను లేకుండా తరువాత అతనెలా బ్రతుకుతాడనే
ఆలోచన ఆమెకు ముందులో లేకపోయింది.
ఇన్నాళ్ళు ఆమే లోకంగా బ్రతికిన అతనికి
ఇప్పుడు లోకమంతా శున్యంగా అనిపిస్తోంది.
ఇన్నేళ్ళు ఆమెపై పూర్తిగా ఆధారపడిన అతనికి
ఇప్పుడు బ్రతుకు భారంగా అనిపిస్తోంది.
అతనిక కోలుకోలేడు,
ఈ ఒంటరి సామ్రాజ్యాన్ని ఏలుకోలేడు.
ఇప్పటికి ఆమె చేసిన తప్పేమిటో అతనికి అర్ధం అయింది,
అది ఇప్పుడు అతనిపాలిటి తీరని శాపమయింది.
పారనంది శాంత కుమారి
కవితా స్రవంతి