-సముద్రాల హరిక్రృష్ణ
సామవేదము నా రూపమనె స్వామి, వేణు/
గానము సన్ననయ్యె, మొగము చిన్ననయ్యె!
ప్రేమ మీర గోప గణములు,మా వాడనె/
కనుబ్రామి ఎపుడో రాధామోహనుడయ్యె!
నా సన్నల యదు సింహమని, సాత్రాజితి/
తా మొగ్గె వైదర్భి దెస, బృంద దళమున!!
నీవే నా తోడు నీడ, గురుడవనె క్రీడి/
నగుబాటు జేసె గాంగేయు మార్కొను వేళ!
నమ్మిన ఫలమీ రీతైనను, వీరు,వారెవరుర
నళిన నేత్ర!
తన,పర భేదములేమొ,నీకే తెలియు,కృష్ణ!
గహన విచిత్ర!
*******