– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్కా
లమెప్పుడూ సాఫీగా సాగుతుందని అనుకోకు
జీవితమెపుడూ సంబరంగా ఉంటుందని అనుకోకు
అలలెప్పుడూ ఎగిసిపడుతూ కల్లోలపరుస్తుంటాయి
కడలి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని అనుకోకు
తుఫానులు అల్పపీడనాలు ముప్పిరిగొని వస్తుంటాయి
ప్రకృతి ఎప్పుడూ వసంతంలా ఉంటుందని అనుకోకు
గర్జనలతో ఉరుములు మెరుపులు గాండ్రిస్తుంటాయి
ఆకాశం ఎప్పుడూ నిర్మలంగా ఉంటుందని అనుకోకు
జ్వాలాతోరణాలతో నిప్పురవ్వలు ఎగిసిపడుతుంటాయి
పర్వతం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని అనుకోకు
వాసంతసమీరాలెపుడూ మధుపవనాలను వీస్తుంటాయి
గ్రీష్మఋతువు ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అనుకోకు
కలలు రోజూ వస్తూ మనసును కలవరపెడుతుంటాయి
వాస్తవరుచి ఎప్పుడూ మిగిలే ఉంటుందని అనుకోకు