– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
చీకటిలో ఉన్నపుడు ఉదయాలను వెలిగిస్తాను
ఒంటరిగా ఉన్నపుడు హృదయాలను గెలిపిస్తాను
చేదు జ్ఞాపకాలెన్నో జీవితాన ముసురుకున్నా
మదిలోని తీపిగుర్తులు అందరికీ పంచుతాను
ముసురుకమ్మిన బతుకుల్లో విషాదాలెన్ని ఉన్నా
మధురజ్ఞాపకాలెన్నింటినో అందరికీ పంచుతాను
సంసారసాగరాన్ని భారంగానే నెట్టుకొస్తున్నా
కన్నీటి సముద్రాలను దాటుకుంటూ వెళతాను
చెప్పలేని ఆవేదనలు కడుపులోనే దాచుకుని
గుండెధైర్యంతోనే అడుగులు ముందుకు వేస్తాను
దుఃఖసముద్రాలెన్నో అలల్లా పోటెత్తుతుంటే
ఆటుపోటులనధిగమించి వజ్రంలా మెరుస్తాను
చింతలెన్నో నీడలా వెంటాడుతుంటే భీంపల్లి
కన్నీళ్ళను దాటుకుంటూ కాలంతో పయనిస్తాను
–000–