-భువనగిరి ఫ్రసాద్
స్వర్గాని నేలకు దించి చేతి కందిస్తానంటే వద్దు పొమ్మన్నాను!
భువిలోని సంపదలన్నీ ఓ పెద్ద మూటగా కట్టి
పెరడులో పెడతా నంటె కాదుపోమన్నాను!!
నీకు చేతనైతే చిననాటి బాల్యం తెచ్చి చిందులేసి అడ మన్న!
వాననీటి గుంటల్లో గంతులేసిన జ్ఞాపకాలూ,
కాగితపు పడవలతో మురికి నీటి పోటీలు,
సంకురాత్రి సందెల్లోఎగరేసిన గాలిపటాలు,
హరిదాసుల జోలేల్లో బిచమేసి చిట్టి చేతులు, స్వర్గాని నేలకు దించి!!
గుడి గోపురం పైకెకి పావురాలను తరిమిన రోజులు,
ఊరచేరువు మధ్యలో ఈది తెచిన కలువ పూలు,
చవితి పొద్దున్న తిట్లకోసం విసేరేసిన పల్లేరు కాయలు,
తిరిగిరాని జ్ఞాపకాలు, మరిచిపోని గురుతులు, స్వర్గాని నేలకు దించి!!