రచన—తమిరిశ జానకి
నీ మురళిపాటకై వేచియున్నాను
వేగిరము రావేల వెతలు బాపంగ
నీ సొగసు కనుటకై కాచియున్నాను
కమలనయన ఇటు కనుపించవేల
నీ మురళిపాటలో నెమ్మది దొరికేను
నీ సొగసుకాంతిలో శక్తి కలిగేను
పూలబాటగా నా బ్రతుకు సాగిపోయేను
గడియ గడియకూ భ్రమ కలిగించెను
ఎండుటాకుల గలగల నాకు
నింగిలో తారకలు నను చూచి నవ్వేను
పొగడచెట్టు నను పలుకరించేరీతి
పొందికగ నాపైన పువ్వులను రాల్చేను
ఇటువింటి నీ కాలిమువ్వలసడి
అటువింటి నీ వేణుగానమ్ము
ఎటు చూచిన కానరావు
వేధించకయ్య నను బాధించకయ్య
వేగిరము రావయ్య వేణుగోపాల
మురిపించబోకు మరి మువ్వగోపాల !
తమిరిశ జానకి