వీక్షణం

వీక్షణం-94-వరూధిని

జూన్ నెల వీక్షణం సమావేశం ఆన్ లైను సమావేశంగా జూన్ 14, 2020 న జరిగింది.
ఇండియా నుంచి సమావేశానికి హాజరైన శ్రీమతి వెంకట లక్ష్మి మల్లాది గారి పరిచయ కార్యక్రమంతో సమావేశపు మొదటి సెషన్ ప్రారంభమయ్యింది.
రెండవ సెషన్ “ప్రసంగం” లో భాగంగా  శ్రీమతి రఘు మల్లాది ‘చాటువులు ఆధునిక కాలాన్వయం’ అనే  అంశంపైన ముప్ఫై నిముషాలు ప్రసంగించారు.
ఏడేళ్ల కిందట తోలి వీక్షణ సమావేశంలో అధ్యక్షత వహించింది మొదలుగా నాలుగైదు సమావేశాలు వారింట జరుపుకున్న మధుర క్షణాల్ని గుర్తుచేసుకున్నారు.
చాటువుల్ని ఇవేళ చాటుగా చెప్పుకోవాల్సిన దుస్థితి పట్టిందన్నారు.
“సర్వజ్ఞ నామధేయము”
“వీసపు ముక్కు నత్తు”
వంటి చాటువుల్ని ఉదహరిస్తూ ఆ నాటి సమాజంలో కుల ప్రస్తావన ఏ విధంగా ఉందో వివరించారు.
ఇప్పటి సమాజంలో చాటువులు కాదు కదా అసలు కవికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కొరవడిందన్నారు.
ఈ విషయంగా చర్చలో భాగంగా డా||కె.గీత మాట్లాడుతూ కవికి సామాజిక బాధ్యత ఉండి తీరాలని, బాధిత పక్షాన్ని వహించాలని అన్నారు.
తరువాత జరిగిన కవిసమ్మేళనం లో భాగంగా వెంకట లక్ష్మి గారు “పులకరింత” అంటూ కాలుష్యంలేనితనం గురించి కవితను, శ్రీధర్ రెడ్డి గారు “అవతారములు” అనే కవితను, డా|| గీత “క్రిమి సమ్మారం” కవితను, వ్యాసరాజు గారు “నల్ల ఆవు- తెల్ల పాలు” కవితను, వెంకట్ ధవళ “ఏనుగుమొకమోడికి దండం పెడతాం” అనే కవితను చదివి వినిపించారు.
తరువాత రమణారావు గారు అప్పటి వరకు విన్న కవిత్వాన్ని విశ్లేషిస్తూ  శ్రీధర్ రెడ్డి గారి కవితను గురించి మాట్లాడుతూ వ్యవహారికం కంటే గ్రాంథికం వినడానికి బావున్నా కవితా వస్తువుకి తగిన భాషనీ ఎన్నుకోవాలని అన్నారు. అందుకు ఉదాహరణగా గీత గారు రాసిన “క్రిమి సమ్మారం” కవితను పేర్కొంటూ కవిత ఎవరిని ఉద్దేశించి రాసేరో వారి భాషలో చెప్పిన సరికొత్త కవిత అని అన్నారు.  శ్రీనాధుడి కాలంలో కూడా కులవివక్షని పదాల వాడుకని బట్టి తెలుసుకోవచ్చని అన్నారు.  వెంకట్ కవితలో భావం బాగుందని అంటూ శైలిలో మెరుగు పరుచుకోవలసిన విషయాల్ని తెలియజేసేరు.

తరువాత కిరణ్ ప్రభ, శారద గార్ల ఆధ్వర్యంలో సాహితీ క్విజ్ అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది.

సమావేశం చివరి అంశంగా శ్రీమతి సుభద్ర గారు, శ్రీమతి కె.గీత గారు దేవులపల్లి వారి చక్కని లలితగీతాల్ని ఆలపించగా, వ్యాసరాజు గారు “ఆవకాయ మన అందరిదీ” అనే సినీ గీతాన్ని పాడి అందరినీ అలరించారు.

ఇంకా ఈ సమావేశంలో బే ఏరియా సాహిత్యకారులు, సాహిత్యాభిమానులు అయిన శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి ఉమావేమూరి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి ఫణి రాధా కుమారి, శ్రీ లెనిన్ , శ్రీ పి. సుబ్బారావు శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ సంపత్ రెడ్డి, శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు, శ్రీ ప్రసాద్ నల్లమోతు మొ.న వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked