-దేవనపల్లి వీణావాణి
ఎడిటర్ గారికి నమస్సులు.. నేను వ్రాసిన ” తెలుస్తుందా…?” కవితను సుజన రంజని కొరకు అందజేయుచున్నాను… ఈ కవిత యొక్క ఉద్దేశ్యం… భక్తి ముసుగులో తోటి మనుషుల మీద జరుగుతున్న దాడి.
అదిగో..అక్కడ .. జనసంద్రంలో..
తామర తూళ్లూ, తాటి పళ్ళూ,
ఇప్ప పూలూ, రెల్లు పరకలు..
కపోతాలు, కాకులు బకాలు…,సీతాకోకలు…
చరిత్ర దిద్దిన చిత్రిక… రంగు పూల పొత్తి…!
ఇప్పుడు… వదులైన కుంచెలా
విడివడ్డ దారాలు..! మెదళ్లను విధికి
దేహాల్ని వీధులకీ విసిరేసి
వెలుగు మొహం తెలియని
గబ్బిలాళ్లలా తోడేళ్ళ పొదివి మీద
వేలాడుతున్నాయ్…! చిన్న వానకే
దీపానికి ముసురుకున్న
ఉసుల్ల పుట్టలా అర్థం కాకున్నా
ఎగురుతున్నాయ్…!
తినడానికే పెంచుకున్న కోడిపిల్లలై
గొఱ్ఱె దాటుడు నేర్చుకున్న కప్పల్లా
పాముల గూటికి పరుగెడుతున్నయ్…!
ఎప్పుడు తెలుస్తుందో
బతుకు నిచ్చెఁ మెతుకు గొప్పదని
మట్టిని మెతుకు చేసిన
చెమట గొప్పదని చెమట కు శక్తినిచ్చిన
సృష్టి గొప్పదనీ…! శక్తికి, శాంతికి
మూలం లోలోనే అని దేవుఁడుకి , దయ్యానికి
ఆద్యం మనలోనే.. అని అది మనకు ,మనమే
వెలిగించుకోవాల్సిన దివ్వె అనీ…!!
***
ధన్యవాదాలు
అసిస్టెంట్ డైరెక్టర్
తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమి
దూలపల్లి, హైదరాబాద్ -14
9951331122