బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు
ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!)
రజనిగంధం
(నిన్న విశాఖసాహితి వారు బాలాంత్రపు రజనీకాంతరావుగారి సాహిత్య సంగీత సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో నా ప్రసంగ సారాంశం. ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన, ఆచార్య
ప్రసన్న కుమార్ గారి ప్రధానోపాన్యాసంతో, ఆచార్య వేదుల సుబ్రమణ్యం గారు, ఎఐఆర్ నుంచి వచ్చిన వక్తలు ఆచార్య సూర్యారావు తదితర వక్తలు ప్రసంగించి సభని సుసంపన్నం చేశారు. మండపాక శారద గారి శిష్యులు, మరియు డా. కమల, శ్రీమతి రాజేశ్వరి సరస్వతి తదితరులు రజని పాటలు పాడి శ్రోతలనలరించారు.)
ఏ దృక్పధంతో చూసినా రజనీకాంతరావు గారు ఒక సంస్థ. ఒక కళ కాదు ఒక సంగీతం కాదు ఒక కవిత్వంకాదు. ఏది తల్చుకున్నా ముందుండే పేరు రజని గారిది. అరు ఏఐఆర్ విజయవాడలో వుండి చేసిన సాహితీ సేవ, లలిత సంగీతానికి ఒక ఊపిరినిచ్చి సమకాలీన సమాజపు ఊహా విహంగాలకి క్రొత్త రెక్కలనిచ్చిన ఒక అద్భుత వ్యక్తి. సంస్కృతీ సౌరభాలకొక ఒక గొప్ప పరిమళాన్ని ఆపాదించిపెట్టిన గురుతుల్యుడు. ఆరోజుల్లో నడీచిన భావకవిత్వం దీనికి తోడయ్యిఇవన్నీ పటిష్టమయినాయి.
౧౦౨౦లో నిడదవోలు లో జనించారు. పుట్టింది సాహిత్య కుటుంబంలో. వెంకట పార్వతీశ కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకట్రావుగారి కుమారులు తల్లి దండ్రులనించి సంగీత సాహిత్యలని వారసత్వంగా పొందిన అదృష్టవంతులు. వీరి తండ్రిగారుసాహితీ గ్రంధమాల అనే గ్రంధాలయాన్ని నడీపేవారు. విద్యాభ్యాసం పిఠాపురం లోను కాకినాడలోను జరిగింది. అక్కడే దేవులపల్లి, తెలికిచర్ల, చిలుకూరి నారాయణరావు గంటి సోమయాజుల లాంటి ప్రముఖ సాహితీ వేత్తలతో తొలి పరిచయాలేర్పడ్డాయి.పిఠాపురం సంగీత వేత్తలకు, సాహితీ మూర్తులకీ, నాట్యవేత్తలకీ పుట్టీనిల్లు. పానుగంటీ వోలేటి తుమరాడ, మొక్కపాటి, దేవులపల్లి ఎందరో ఎందరో మహానుభావుల ప్రభావంలో తన సాహితీ సంగీత వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దికున్నారు. శాస్త్రీయ సంగీతంతో ఆనాడు పడిన పునాదులే తర్వాత జీవితంలో లలిత సంగీతాన్ని, అన్నమాచార్య కీర్తనలనీ ప్రాచుర్యంలోకి తేవడానికి ఉపయోగపడ్డాయనడంలో సందేహంలేదు.
వారు విజయవాడ రేడియో డైరెక్టరుగా ఉన్నప్పుడూ చేసిన విశిష్టసేవలను గురించి చెప్పాలంటే మూడు ముఖ్యమైన అంశాలున్నాయి. కూచిపూడి యక్షగానాలకి క్రొత్తఊపిరి పొయ్యటం మొదటిది. ఒకప్పుడు రాత్రంతా
గ్రామగ్రామలలో ప్రదర్శనలిచ్చి అలరించిన యక్షగానాలు కాలక్రమేణా సమయాభావంతో కుదించబడిపోయాయి. ప్రయాగతో కలిసి వీటిని పునరుద్దరించటం వీరు చేసిన మొదటి సేవ. తర్వాత మనప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో వుండి తర్వాత పూర్తిగా అంతర్ధానమైపోయిన కళ మేలట్టూర్ భాగవతమేళాలు. వీటిని గూడా రేడియోద్వారా శ్రవ్య నాటికల ప్రసారాలతో ప్రచారంలోకి తెచ్చారు. మూడవది సజీవంగా వున్న కవులని రచయితలని ఇంటర్యూలద్వారా వాళ్ళచేతే మాట్లాడించి సమకాలీన సాహిత్యానికి ఒక క్రొత్త రూపాన్నిచ్చారు. చలం, దేవులపల్లి, విశ్వనాథ, శ్రి శ్రీ లాంటి ఎందరో ప్రముఖులు తమ తమ విలువైన రచానానుభవాల్ని ప్రపంచంతో పంచుకున్నారు.
ముఖ్యంగా చలంతో రజని చేసిన ఇంటర్యూ చాలా అరుదైనది ఎందుకంటే ఆయన తనజీవతాన్నుంచి సమాజాన్నుంచీ దూరంగా వెళ్ళిపోయి అరుణాచలంలో స్థిరపడ్డాక చలంభావాలకి అద్దం పట్టిన కార్యక్రమంగా ప్రజల గుండేల్లో చిరస్థాయిగా నిలచిపోయింది.
ఇవేకాక చెణుకులూ, ఉషశ్రీ గారి ధర్మసందేహాలు, భక్తిరంజని కార్యక్రమాలు, ఈమాసపు పాట అందులో చెప్పుకోదగ్గవి. ప్రత్యేకంగా సూర్యస్తుతి చాలా జనరంజకమైన కార్యక్రమం. భక్తిరంజని లాంటివి ఇంకా కొనసాగుతున్నాయి. ఆచంట జానకిరామ్ గారి అనార్కలి నాటకంలో పాటలకి బాణీలు కాట్టారు. సాలూరి రాజేశ్వ్రర రావు గారిచే మొదటి వాద్య గోష్టి నిర్వహించారు.
వీరి కృషి రేడియో కి కార్యక్రమాలని వృద్ది చేయటంతో ఆగి పోలేదు. టంగుటూరి సూర్యకుమారి, రావు బాలసరస్వతి లాంటి ఎందరో ఆణిముత్యాలని మనకి రేడియో ద్వారా పరిచయంచేసిన ఘనత కూడా రజనీగారికే దక్కుతుంది. తను రాసి స్వరకల్పన చేసి పాడి పాడించిన గేయాలూ, ఆరోజుల్లో పేరు ప్రఖ్యాతులు గడించిన దేవులపల్లి, ప్రయాగ, బందా కనకలింగేశ్వరరావు లాంటి వివిధరంగాలలో పేరెన్నిక గన్నకళాకారుల్ని ఇంటింటిలో మారుమ్రోగిన పేర్లగా మార్చారు.
శతపత్రసుందరి, ఏటికి ఎదురీత విశ్వవీణ,లాంటి పుస్తకాలద్వారా ఎన్నో లలితగేయాల్ని తెలుగు పాఠకులికి పరిచయం చేశారు. మనదీ స్వతంత్ర దేశం, మ్రోగింది జయభేరి, శతపత్ర సుందరీ మనప్రేమ, గుడారమెత్తివేశారు,
ఎందుచూచినగాని,, నటనమాడవేమయూరి, రొదసేయకే తుమ్మెదా, లాంటి పాటలు తెలుగు వారి హృదయాలలో ఘంటశాల, గోపాలరత్నం, మంగళంపల్లి, మల్లిక్, బాల సరస్వతి, వింజమూరి సోదరీ మణులు లాంటి గాయనీ గాయకుల గళాలద్వారా చిరస్థాయిగా నిలచిపోయాయి. ముఖ్యంగా చెప్పవలసింది కొండనుంచి కడలిదాకా అన్న గోదావరిమీద రచించి ప్రసారం చేసిన రేడియో నాటకం. డాక్యమెంటరీ అని చెప్పచ్చును.
జెజిమామయ్యగా బాలబాలికలకు పద్యాలు కథలు రేడియోద్వారా రూపొందించారు. సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు కూడా తనదైన బాణిలో ఒహో పావురమా లాంటి పాటలు ఆరోజుల్లో హిట్ సాంగ్స్. తను
ముట్టూకున్న ప్రతిదానినీ స్వర్ణం గా హేమమయంగా మార్చిన కళాతపస్వి. తారుమారు భలేపెళ్ళి, గృహప్రవేశం వీరి దర్శకత్వం లో వచ్చిన సినిమాలలో కొన్నిరజని. బుద్దరాజు నాగరాజు నళినీ కాంతరావు గార్ల పేర్లతో ఇందులో కొన్ని ప్రాచుర్యంలోకి వచ్చాయి, వీరు ప్రభుత్వ అధికారి గనుక వారి పేరు పెట్టలేదంటారు. బాపిరాజులాంటి వాళ్ళు ఏ బెంగాలులోనో పుట్టీ వుంటే టాగొర్ అంతటి వాళ్ళు అయి వుండేవాళ్ళు. అంత బహుముఖప్రఙ్జాశాలి రజని.
అలాంటి కవి గాయకుడు వాగ్గేయకారుడు, సృజనశీలి నభూతో న భ్హవిష్యతి.
***