శ్రీరామావతార సమాప్తి
శ్రీరాముడు తరువాత వానరప్రముఖులను, విభిషణుణ్జి తన దగ్గరకు రప్పించుకున్నాడు. వాళ్ళందరికి చెప్పవలసిన సంగతులు చెప్పాడు. ఆయనను సుగ్రీవాదులు అనుగమిస్తామన్నారు. శ్రీరాముడు విధివిధానంగా అయోధ్యా పౌరులు, వానర ప్రముఖులతో సరయూనది చేరి మహాప్రస్థానం పాటించాడు, వానర ప్రముఖులు శ్రీరాముడి యుద్దసహాయకులు అందరూ తమ తమ దేవతాలోకాలకు చేరుకున్నారు.
అయ్యోధ్య పౌరులందరికీ కూడా ‘సంతానకాలు’ అనే దివ్యలోకాలు లభించాయి.
ఫలశ్రుతి
శ్రీరామాయణం ఆదికావ్యం, సాటివేని మహాకావ్యం. దీని కథానాయకుడు శ్రీరామచంద్రుడు. ఉత్తమగుణాలన్నీ సమగ్రంగా కలిగినవాడు. ధర్నానికి ఆయన ప్రతిరూపం, రాజుగానే కాక, ఒక ఉత్తమ మానవుడుగా లోక క్షేమమే ధ్యేయంగా భావించినవాడు. సత్యమే ఉత్తమధర్మంగా స్వీకరించి, తన తండ్రిని సత్యసంధుడిని చేయటానికి రాజ్యం విడిచి అడవులకు పోయినవాడు. రక్షించమని కోరినవాడు శత్రువైనా సరే కాపాడటం వ్రతంగా పెట్టుకున్నవాడు. శత్రువును కూడా కరుణించినవాడు. సకల జీవులనీ సమంగా గారవించిన వాడు.
కృతజ్ఞతకు పరాకాష్ట తమ నడవడిచేతా, జ్ఞానంచేతా, వయస్సుచేతా వృద్ధులైనవారి సాహచర్యం చేసి, తన నడవడికి వన్నె తెచ్చుకొన్నవాడు. మిత్రులను సోదరులను వలె ప్రేమించేవాడు. దోషులను శిక్షించేవాడు. సజ్జనుల్ని కాపాడేవాడు. ఏకపత్నీవ్రతుడు. ప్రతి మానవునికీ ఆయన ఆదర్శం. మానవులకు నాటికీ నేటికీ ఆరాధ్యదైవం. శ్రీరాముడి రాజ్యపాలనలో ప్రజలంతా అన్నివిధాలా సుఖించారు. ఏ భయమూ వా రెరుగరు. చోరభయం, మృగభయం, అనావృష్టి వంటి ఆపద లేమీ లేకుండా ప్రజలు సుఖసంతోషాలతో జీవించారు.
స్రీలు వైధవ్యం ఎరుగరు. అకాల మరణాలు లేవు. ప్రజలు ఒకరితో ఒకరు కలహించలేదు. దీర్ఘాయుషుతో పుత్రపౌత్రాది సౌభాగ్యంతో ఆనందంగా జీవించారు. వృక్షాలు అన్ని బుతువుల్లోనూ పూలు, పండ్లతో కళకళలాడుతూ ఉండేవి. సకాలవర్నాలతో భూమి సస్యశ్యామలంగా ఉందేది. కోసల ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు ఎరుగనే ఎరుగరు. శ్రీరామ రాజ్యంలో ప్రజలంతా ధర్మానికి కట్టుబడి ఉండటమే ఇందుకు కారణం. ప్రజలు ఎప్పుడూ శ్రీరాముడి కథలే సంభాషించుకొనేవారు. శ్రీరామచంద్రుడు ఈ విధంగా పదకొండు వేలసంవత్సరాలు ప్రజాపాలనం చేశాడు.
సీతమ్మ ఆయన ధర్మపత్ని. అడవులలో కూడ పతిని అనుసరించిన సహధర్మచారిణి. పతి మనసు ఎరిగిన పతివ్రత. పరపురుషుడు ఎంతటవాడైనా ధుష్టుడైతే వాడిని గడ్డిపోచగా తలచిన పరమసాధ్వి. జగములు మన్నించే ఇల్లాలు. లోకమాత. శ్రీసీతారాముల దివ్యచరిత్రను వాల్మీకిమహర్షి సంస్కృత భాషలో 7 కాండలలో, 500 సర్గల్లో, 24000 శ్లోకాలతో మనోహర మహాకావ్యంగా రూపొందించాడు. శ్రీరామచంద్రుల పుణ్యచరిత్రను వర్ణించిన శ్రీరామాయణం అత్యంత పవిత్రమైనది.
ఉత్తమగుణములకు నెలవైన శ్రీ సీతారాముల దివ్యచరిత్రను సంగ్రహరూపంలో చెప్పిన ఈ గ్రంథం భక్తి శ్రద్ధలతో చదివి, వారి గుణాలను తాము కూడా నిత్యజీవితంలో ఆచరిస్తూ, పదిమందికీ మార్గదర్శనం చేసేవారు ధన్యజీవులు. అట్టివారి మనోమాలిన్యం తొలగిపోతుంది. పాపాలు పటావంచలవుతాయి. ఉత్తమశీలవంతులౌతారు. ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయి. పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ధనధాన్యాల కొరత ఏమీ ఉండదు. శత్రుబాధ దరిచేరదు. కామక్రోధలోభమోహమదమత్సర్యాలనే అంతరంగ శత్రువులు నశించిపోతాయి. తలచిన పనులన్నీ ఫలిస్తాయి. విఘ్నాలేవీ బాధించవు. వారికి పేరు ప్రతిష్టలు కలుగుతాయి.
ఈ గ్రంథం చదివినా, చదివించినా, విన్నా వినిపించినా, వ్రాసినా, ముద్రించినా, ప్రచారం చేసినా, చేయించినా అందరూ శ్రీరామచంద్ర అనుగ్రహం పొందుతారు. జనన మరణ భయం వారికి ఇక ఉండదు.
వాల్చీకీగిరసంభూతా రామసాగరగామినీ, పునాతి భువనం వుణ్వా రామాయణమహానదీ. శ్రీరామాయణం ఒక మహానది. ఇది వాల్మీకి అనే పర్వతం నుండి పుట్టింది. శ్రీరాముడనే సముద్రంలోకి ప్రవహించింది. ఇది ఈ లోకాన్నే పావనం చేస్తున్నది.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే,
చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళమ్॥
స్వస్తి ప్రజాభ్యః.
కోసలదేశప్రభువు, ఉత్తమగుణాలకు ఆటపట్టూ, దశరథచకక్రవర్తి తనయుడూ, సార్వభౌముడూ అయిన శ్రీరామచంద్రునికి మంగళము.
ప్రజలందరకూ శుభం కలగాలి.