-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
పుట్టగొడుగుల్లా పండితులు
పూటకొక్కరు పుట్టుకొస్తుంటే,
టీవీలలో ఠీవిగా కనిపిస్తూ,
పోటీలుపడి మరీ ప్రసంగాలు పెట్టించుకుంటుంటే,
పసలేనితనాన్ని పట్టెనామాలవెనుక దాచుకొని,
పనికిరానితనాన్ని రూపుమాపుకోవటానికి,
పైసల సంపాదనే పరమార్ధంగా చేసుకొని,
ప్రజల మనసులను మభ్యపెడుతుంటే,
ఆలకించేవారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని
అనంతంగా అజ్ఞానులిలా అవతరిస్తుంటే,
సుజ్ఞానులు సుంతైనా శ్రద్ధచూపక
మౌనాన్ని అభినయిస్తుంటే,
విజ్ఞానులు వీటన్నిటినీ
వింతనుచూసినట్లు చూస్తుంటే,
ఆధ్యాత్మికం అపహాస్యం పాలుకాక ఏమౌతుంది?
అసలు తత్త్వం అంతర్ధానమవక ఏం చేస్తుంది?