-(శిరాశాస్త్రి) శిష్ ట్లా రాజేశ్వర శాస్త్రి
మా నాన్న చిన్నతనాన్ని నేను చూడలేదు
మా తాతా చూడలేదు, ఆ భాగ్యంలేదువారిద్దరికీ, మాకు ఆ లోటే లేదు
మనుమడు, అడుగులు వేస్తుంటే పోల్చుకుంటూ అంతా ఎంత మురిసి పోతామో, ఎన్ని జ్ఞపకాలు నెమరు వేసుకుంటామో ఎన్ని మార్లు కళ్ళు తుడుచుకుంటామో, ఎంత భాగ్యమో అది.
నాన్న పోలికలు, హావభావాలుమాతోచెలిమి
ఆ నడక, ఆ చనువు, ఆ పలువరుస, ఆఠీవి
ఆ చొరవ, ఆ శ్రద్ధ, చదువుతీరు,అనుబంధం
నాన్నే వచ్చాడా నేను తీర్చని రుణానికి
చూపని ప్రేమకి చేయని సేవకు పంచుకో ని భావాలకు బాల మేధావిగా కొడుకుచెలిమలా బ్రతుకు గురుతుగా నాకై
నా మీద స్వతంత్రం, తాత నాదే అనేహక్కు
నా ఒడిలో తలపెట్టి కళ్ళల్లో మెరిసే చూపు
నేనే మీ నాన్నను అని తెలియచెప్పే యా తనేమో ఆ భావాల చూపుల భాష ప్రయాస.
నాయనమ్మను చూడగానే తాత నాదీ అనీ
ఎదపై చెయ్యివేసి, ఒడిలో తలపెట్టి సొంతం చేసుకునే కొంటెతనం ఆ పోటీ ఆ హక్కు ఆ కవ్వింపు, చూపులో పొందేఆనందంఅమితం, అద్భుతంఅశ్చర్యం
నాన్న నాన్న ప్రేమకు నోచుకోలేదు
బాల్యంలోనే ఎరుక తెలియకమునుపే
కనుమరుగయ్యాడు, అంతా అమ్మప్రేమే
నాన్నకే కరువైతే తాత ప్రేమ ఎక్కడిదిక
పాపం జాలి వేస్తుంది కొడుకును ముద్దు చేసే తండ్రిని, తాతచేతుల్లో మనుమడిని చూస్తే, అనుబంధం కలిమి ఎంత బలమో!
ఎన్ని ఆటలు, ఎంత సంబరం, ఎంత తృప్తి
ఏదో సాధించిన సంబరం నాన్న మళ్ళీవస్తాడనే నమ్మకం వచ్చినఅనుభూతి,
వాడి ప్రతి కదలిక నాన్న పక్కనే ఉన్నధైర్యం.
తాతా మనుమళ్ల అనుబంధం ఆపాత మధురం,మన సంస్కృతి అనుభవైక వేద్యం
కొడుకుల ముచ్చట్లు చాలానే మిగిలాయి
ఇప్పుడు అవన్నీ మనుమళ్లకు తీరాలి
బాల్యంలో కలిగిన లోటు పాట్లు సర్దాలి
వాళ్ళసంతానాన్ని వాళ్ళలా మురిపించాలి
పిల్లల నవ్వుల్లో ఆటల్లో అందరూ పిల్లలు కావాలి అన్నీ మరిచిజాలీగాహాయిహాయిగా
ఈ మహదానందాన్ని సంగమించి సంక్రమించి చేతికి అందించిన కోడళ్లకు కొడుకులకు బహు,బహుధా బహు పరాక్.
సంఘం శరణం గచ్చామి. దేశమా వర్ధిల్లు.
పిల్లలే ఈ ప్రపంచదేహం. శతమానం భవతి.