కవితా స్రవంతి

అహం

-నసీమ షైక్

మనుషులను విడదీస్తుంది ,మనసులను దూరంచేస్తుంది,మమతలను
మసిచేస్తుంది,మంచిచెడుల తారతమ్యాలు మరిపిస్తుంది….
నీ….నా…..అంటూ తేడాలు చూపుతుంది,నేను…నాకు…అంటూ ముందుకు
సాగుతుంది,ఓటమిని అంగీకరించనివ్వదు,గెలుపును నిలబడనివ్వదు….
తెలియనిది తెలుసుకోనివ్వదు,తెలిసింది తెలుపనివ్వదు,తప్పును
ఒప్పుకోనివ్వదు,తప్పిదాన్ని మన్నించనివ్వదు ……
అన్నింటికి మూలకారణం అహమే….!!అహాన్ని జయించిన జీవితం ఆదర్శప్రాయమే…..!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked