కవితా స్రవంతి

అమరత్వం

అమరత్వం

-తాటిపాముల మృత్యుంజయుడు

 

జననం సహజం, మరణం సహజం
కోటికి కొందరే పొందురు అమరం

పెరిగిన పేగున అమ్మదనం, ఒదిగిన ఒడిలో కమ్మదనం
ఇద్దరు తల్లుల మురిపెము పొందుట ఒక అపురూపం

ఎదిగిన కొడుకును చూసిన కన్నుల కలిగెను పుత్రోత్సాహం
మాతృసేవకై సాగెను పయనం, హిమవన్నగమే తన గమ్యం

మంచుకొండలో, కొరికే చలిలో వెనుకాడక నిలిచే ధీరత్వం
మతివిహీనులను కపటశీలులను ఎదురొడ్డే నీ వీరత్వం

కర్మలు సేయ ధర్మము నిలుప జూపించితివి శూరత్వం
కార్యదీక్షతో మము రక్షింపగ దనుజుల జంపుట నీ లక్ష్యం

అనుపమ పోరులో దేహము విడువ పావనుడవు, మానధనుడవు
అరయ గొల్తును, వందనము సేయ ఇదియే నీకు నా ప్యారే సలాం!

(A tribute soldiers who lost live in a border battle with China)

Tags : కవితా స్రవంతి, తాటిపాముల మృత్యుంజయుడు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked